పలాస-కాశీబుగ్గ

పలాస శ్రీకాకుళం జిల్లాకి అనాదిగ వాణిజ్య కేంద్రం. జిల్లాకి రెండవ రాజకీయ కేంద్రం అని చెప్పవచ్చు. ఉత్తర శ్రీకాకుళానికి రాజధాని వంటిది. పలాస జీడిపప్పు గురించి వినని వారు ఆంధ్ర రాష్ట్రమున బహు కద్దు అని చెప్పటము అతిశయోక్తి కాదు. నిజానికి పలాస జీడిపప్పు పశ్చిమ బెంగాల్, ఒడిషా వారికి కూడా సుపరిచితం. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాకంతటికి పెద్ద స్టేషను. ఇది ఖుర్దా డివిజన్ లో అతి ఎక్కువ లాభాలు సముపార్జించిన స్టేషను.

పలాస మరియు కాశీబుగ్గలిని జంట పట్టణాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎరుగుదురు. అనేక సంవత్సరాలుగ నగర పంచాయితిగా ఉన్న ఈ పట్టణాలు ఈ మధ్యనే ఉమ్మడి మున్సిపాలిటిగా అవతరించాయి. అనేక తర్జన భర్జనల పిదప మున్సిపాలిటిని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిగా వ్యవహరిస్తున్నారు. పాలబుగ్గ అన్న పేరుకి కొంత ఊతమొచ్చినప్పటికి, ఆ పేరు నిలదొక్కుకొలేక పోయింది. నిజానికి కాశీబుగ్గకి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉన్నది, పల్లి వీధి అవతల వున్న గుడిలో ఒక బుగ్గ ఉన్నదని అందున నీరు కాశీ నుంచి వచ్చునని నానుడి.

ప్రధాన భాష తెలుగు అయ్యినప్పటికి ఒరియా కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. తెలుగు బడులతో సమానంగా ఒరియా బడులు కూడా ఉన్నాయి. పలాస సొంపేట శాసనసభ పరిధిలో వుంటే కాశీబుగ్గ టెక్కలి శాసనసభ పరిధిలో ఉంది. ఈ విధముగా రెండు నియోజకవర్గముల కోలాహలము ఒకే పట్టణంలో చూడవచ్చు. కొన్ని కాశీబుగ్గ పొస్టల్ వీధులు సొంపేట శాసనసభ పరిధిలో ఉన్నాయి, ఎన్నికల సమయమున ఈ వీధులవారికి రెండు నియోజకవర్గములవారి హోరు పరిపాటి. ఈ పలాస పది సంవత్సరముల ముందు ఒక పెద్ద గ్రామము. జీడిపరిశ్రమ ఇక్కడ బాగా వ్రుద్దిచెంది. జనాభా పెరగడము వలన పట్నము వాతావరణము నెలకొని ఉండేది. 1995 వరకూ ఇది గ్రామపంచాయతీగా పరిగణించబడేది. తరువాత దీన్ని 22-11-1996 తేదీన నగరపంచాయతీగా ఏర్పాటుచేసారు. ఆదాయవనరులు పెరగడము వలన, జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21వార్డులుండేవి. ప్రస్తుతము 2007 నవంబరు నాటికి :

జనాభా = 59,899 (2001 సెన్సెస్ ప్రకారము 49,899.)
వార్డులు = 25.
పని = జీడి పరిశ్రమ సుమారు 160 ప్రోసెసింగు యూనిట్స్ కలవు, సుమారు 15,000 కూలీలు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.