పన్ను (ఆర్థిక వ్యవస్థ)

పన్ను (Tax) అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.

పన్నులలో రకాలు

వన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు.

ప్రత్యక్ష పన్నులు

వ్యక్తులు మరియు సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని అంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.

  • ఆదాయపు పన్ను (Income Tax)
  • ఆస్తి పన్ను (Property Tax)
  • వృత్తి పన్ను (Professional Tax)
  • సంపద పన్ను (Wealth Tax)

పరోక్ష పన్నులు

పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.