పఠాన్ కోట

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో పఠాన్ కోట (పంజాబీ: ਪਠਾਣਕੋਟ ਜ਼ਿਲ੍ਹਾ) జిల్లా ఒకటి. ఈ జిల్లా 2011 జూలై 27న రూపొందించబడింది.

పఠాన్ కోట్ జిల్లా
ਪਠਾਣਕੋਟ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా

Location in Punjab, India
భౌగోళికాంశాలు: 32.266814°N 75.643444°E / 32.266814; 75.643444
Country India
Stateపంజాబు
జిల్లాPathankot
పేరు పెట్టబడినదిen:Pathania Rajputs fortress
HeadquartersPathankot
ప్రభుత్వం
  సంస్థState Goverenment
భాషలు
  అధికారికPunjabi (Gurmukhi)
  Regionalపంజాబీ
  ఇతరఇంగ్లీష్
సమయప్రాంతంIST (UTC+5:30)
145001145001
వాహన రిజిస్ట్రేషన్PB35

భౌగోళికం

పఠాన్ కోట షివాలిక్ పాదపర్వతం వద్ద ఉంది. జిల్లా పాకిస్థాన్ దేశానికి చెందిన నరోవల్ జిల్లాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అంతేకాక జిల్లా సరిహద్దులలో హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కాంగ్రా, జమ్మూ మరియు కాశ్మీర్ లోని కతుయా జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా బియాస్ మరియు రవి నదులు ప్రవహిస్తున్నాయి.

చరిత్ర

పఠాన్‌కోట్ పాటియాలా రాజపుత్రులు పాలించిన నుర్పూర్ రాజాస్థానానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ముగల్ చరిత్రకారులు దీనిని పైథన్ (ప్రతిష్ఠానపురం ) అనేవారు. రాజా వాదుదేవ్ కాలంలో (1580-1613) లో రాజధాని పఠాన్‌కోట నుండి ధమేరికి తరలించబడింది.[1][2] సిఖ్ఖుల 12 మంది మిస్లులలో ఒకరైన కంహైయామిస్ల్ ఈ ప్రాంతాన్ని 1781-1796 వరకు పాలించాడు. తరువాత గుజ్రంవాలాకు చెందిన రంజిత్ సింగ్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1849 వరకు ఇది సిఖ్ఖుల ఆధీనంలో ఉంది. తరువాత ఇది బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. జిల్లాలోని ధరివాల్, జపువాల్ మరియు గురుదాస్ నంగల్ గ్రామాలు సిఖ్ఖుల చరిత్రతో సంబంధితమై ఉన్నాయి.

ప్రస్తుత జిల్లా

పఠాన్‌కోట్ మునుపు గురుదాస్పూర్ జిల్లాలో భాగంగా ఉంది. 2011 జూలై 27న ఇది పంజాబు రాష్ట్రంలో 22వ జిల్లాగా ఏర్పాటు చేయబడింది. [3][4] పఠాన్‌కోట్ 2 విభాగాలుగా (పఠాన్‌కోట్ మరియు ధర్ కలన్ విభజించబడింది. అదనంగా 2 తాలూకాలుగా విభజించబడింది. నార్‌కోట్ జైమల్ సింగ్ మరియు బమియల్ [4] జిల్లాలో ప్రస్తుతం 421 గ్రామాలు ఉన్నాయి. జిల్లాకు కేంద్రంగా పఠాన్‌కోట్ ఉంది. ఇది సైనికుల నగరంగా పేరు పొందింది.

ప్రముఖులు

పేరువృత్తి
మాస్టర్ మోహన్ లాల్రవాణా మంత్రి
దేవ్ ఆనంద్నటుడు
తేజి గ్రోవర్కవయిత్రి

మూలాలు

  1. The Princely and Noble Families of the Former Indian Empire: Himachal Pradesh V. 1 By Mark Brentnall, Indus Publishing, p. 350
  2. History of the Panjab Hill States By J. Hutchison, J.P. Vogel, Asian Educational Services, p. 213
  3. Naveen S. Garewal (27 July 2011). "Eye on urban voter, Fazilka, Pathankot made districts". The Tribune, Chandigarh. Retrieved 23 January 2012.
  4. News services (28 July 2011). "The state gets Fazilka and Pathankot districts". Indian Express. Retrieved 23 January 2012.

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.