పచ్చిపులుసు
కావలసిన పదార్థములు
(ఇద్దరికి సరిపడా సూచించబడ్డవి)
- నువ్వులు - 50 గ్రా
- వేరుశెనగపప్పు - 50 గ్రా
- జీలకర్ర - తగినంత
- కరివేపాకు - తగినంత
- పచ్చిమిరపకాయలు - రెండు
- ఉల్లి - ఒకటి
- కొత్తిమీర - తగినంత
- ఉప్పు - తగినంత
- కారం - తగినంత
- చక్కెర లేదా బెల్లం - తగినంత
- చింతపండు - తగినంత
తయారు చేయు విధానం
ముందుగా, నువ్వులు, వేరుశెనగపప్పు, జీలకర్ర మరియు కరివేపాకును విడివిడిగా వేయించుకొని, అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కావలసినంత (అన్నంలో పులుసులాగా కలుపుకొనేంతగా) చింతపండు పులుసును కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


