పండు
ఫలాలు లేదా పండ్లు (జర్మన్: Früchte, ఫ్రెంచ్, ఆంగ్లం: Früits, స్పానిష్: Frutas ) చెట్టు నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పడుతుంది.

ఫలాలు రకాలు
అనృత ఫలాలు (False fruits)
ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్లో పుష్పాసనం, జీడిమామిడిలో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు.
నిజ ఫలాలు (True fruits)
నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. నిజఫలాలు మూడు రకాలు. [1]
సరళ ఫలాలు (Simple fruits)
ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు. సరళ ఫలాలలోని ఫలకవచ స్వభావాన్ని బట్టి రెండుగా విభజించారు.
.jpg)
- కండగల ఫలాలు (Fleshy fruits) : ఈ ఫలాలలో ఫలకవచం పక్వస్థితిలో గుజ్జుగాగాని, రసయుతంగాగాని తయారవుతుంది. దీనిలో మూడు స్పష్టమైన పొరలుంటాయి. అవి- వెలుపలి వైపున ఉండే బాహ్యఫలకవచం (Epicarp), మధ్యలో ఉండే మధ్యఫలకవచం (Mesocarp), లోపలి వైపు ఉండే అంతఃఫలకవచం (Endocarp). వివిధ రకాల ఫలకవచ స్వభావం ఎక్కువ వైవిధ్యతను చూపిస్తుంది.
- మృదుఫలం లేదా బెర్రి (Berry) : ఇది ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని అండాశయంనుంచి ఏర్పడి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండే ఒక కండగల ఫలం. బాహ్యఫలకవచం పలుచగా ఉండి, మధ్య, అంతఃఫలకవచాలు సంయుక్తంగా గుజ్జును ఏర్పరుస్తాఅయి. ఉదా: స్ట్రాబెర్రి, వంగ, టమాటో, అరటి.
- పోమ్ (Pome) : ఈ కండగల ఫలం ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని నిమ్న అండాశయం నుంచి ఏర్పడి, కండ కలిగిన పుష్పాసం చేత ఆవరించబడి ఉంటుంది. ఉదా: ఆపిల్.
- పెపో (Pepo) : ఇది కుకుర్బిటేసి కుటుంబపు ముఖ్య లక్షణం. ఈ ఫలం త్రిఫలదళ సంయుక్త అండకోశంలోని ఏకబిలయుత, నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. బాహ్యఫలకవచం గట్టి పొరవంటి పుష్పాసనంతో సంయుక్తమై ఫలం చుట్టూ పెచ్చులాగా ఏర్పడుతుంది. మధ్యఫలకవచం గుజ్జులాగా ఉంటుంది. అంతఃఫలకవచం మెత్తగా ఉంటుంది. అనేక విత్తనాలు ఫల కుడ్యం లోపలి తలంపై అమర్చబడి ఉంటాయి. ఉదా: దోస, గుమ్మడి.
- హెస్పరీడియమ్ (Herperidium) : ఇది రూటేసి కుటుంబానికి చెందిన అతి ముఖ్యమైన కండగల ఫలం. ఇది బహుఫలదళ సంయుక్త అండకోశంలోని బహుబిలయుత, ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. దీనిలో విత్తనాలు మధ్యన ఉండే అక్షం మీద ఉంటాయి. ఫలకవచం 3 పొరలుగా విభేదన చెంది ఉంటుంది. వెలుపలగా చర్మలమైన, తైల గ్రంథులు ఉన్న బాహ్యఫలకవచం ఉంటుంది. మధ్యఫలకవచం పలుచగా, తెల్లని దూదిలాగా గాని, నారతో కూడిన పొరలాగా గాని ఉండి బాహ్యఫలకవచంతో సంయుక్తమై ఉంటుంది. అంతఃఫలకవచం అనేక గదులుగా విభజించబడి, వాటిల్లో రసయుత కేశాలు (ముత్యాలు) ఉంటాయి. ఉదా: నిమ్మజాతి పండ్లు.
- టెంకగల ఫలం (Drupe) : ఇది ఒకే విత్తనం ఉన్న కండగల ఫలం. ఇది ఏక లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని ఏకబిలయుత, ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. అంతఃఫలకవచం గట్టిగా టెంకగాలా ఉండటం ఈ ఫలం ప్రధాన లక్షణం. ఉదా: మామిడి, కొబ్బరి. మామిడిలో బాహ్యఫలకవచం చర్మిలంగాను, మధ్యఫలకవచం రసభరితంగా, కొద్దిగా పీచుతో గుజ్జులాగా తినడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కొబ్బరిలో బాహ్యఫలకవచం చర్మిలంగాను, మధ్యఫలకవచం పీచులాగా ఉంటాయి. అంకురచ్ఛదం తినవలసిన భాగం.
- శుష్క ఫలాలు (Dry fruits) :
- శుష్క విదారక ఫలాలు (Dry dehiscent fruits)
- శుష్క అవిదారక ఫలాలు (Dry indehiscent fruits)
- శుష్క భిదుర ఫలాలు (Dry schizocarpic fruits)
సంకలిత ఫలాలు (Aggregate fruits)
ఒకే పుష్పంలోని బహుఫలదళ అసంయుక్త అండకోశంలోని అండాశయాల నుంచి ఏర్పడే నిజఫలాలు. ప్రతిఫలదళంలోని అండాశయం ఒక చిరుఫలంగా (Fruitlet) అభివృద్ధి చెందుతుంది. ఈ చిరుఫలాలన్నీ ఒకే పుష్పవృంతం మీద సంకలితం చెంది (గుమిగూడి) ఒక సంకలిత ఫలాన్ని ఏర్పరుస్తాయి. ఉ. సీతాఫలం
సంయుక్త ఫలాలు (Compound fruits)

పుష్పవిన్యాసం, దాని అనుబంధ భాగాలు మొత్తం ఒకే ఫలంగా అభివృద్ధి చెందితే దాన్ని 'సంయుక్త ఫలం' అంటారు. అన్ని పుష్పాల నుంచి ఏర్పడే ఫలాలన్నీ కలసిపోయి, పక్వదశలో ఒకే ఫలంగా మారతాయి. ఇవి రెండు రకాలు.
- సోరోసిస్ : కంకి పుష్పవిన్యాసం నుంచిగాని, స్పాడిక్స్ నుంచిగాని లేదా కాట్ కిన్ పుష్పవిన్యాసం నుంచిగాని ఏర్పడుతుంది. ఉ. పనస, మల్బరీ, అనాస, సరుగుడు.
- సైకోనస్ : ఇది హైపన్ థోడియమ్ పుష్పవిన్యాసం నుంచి ఏర్పడే సంయుక్త ఫలం. దీనిలో పుష్పవిన్యాసవృంతం కండ కలిగిన గిన్నె వంటి నిర్మాణంగా ఏర్పడి, చూడడానికి ఒక ఫలంగా కనబడుతుంది. దీనిలోపలి అంచులలోని స్త్రీ పుష్పాలు ఫలాలుగా ఏర్పడతాయి. ఈ ఫలాలు ఎఖీన్ ల రూపంలో ఉంటాయి. ఉ. పైకస్ జాతులు
ఉపయోగాలు
ఆహార పదార్ధాలు
- చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు.
- పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు.
- కొన్ని పండ్లనుండి తీసిన ఫలరసం పానీయంగా తాగుతాము. ఉదా: నిమ్మ రసం, ఆపిల్ రసం, ద్రాక్ష రసం.
- కొన్నింటినుండి ఆల్కహాల్ తయారుచేస్తారు. ఉదా: విస్కీ, బ్రాందీ మొదలైనవి.[2]
- చాలా వరకు కూరగాయలు వృక్షశాస్త్రం ప్రకారం పండ్లు. ఉదా: టొమాటొ, గుమ్మడి, దోస మొదలైనవి.[3]
- ఆలివ్ పండ్ల నుండి ఆలివ్ నూనె తీస్తారు.
- ఆపిల్ పండ్లనుండి వినేగార్ తయారుచేస్తారు.
- కొన్ని మసాలా దినుసులు బెర్రీ మృదుఫలాలు ఉదా: మిరియాలు.[4]
నేను
ఇతరమైనవి
- నల్లమందు ఫలాల నుండి నల్లమందు మరియు మార్ఫిన్ తయారుచేస్తారు.[5]
- నారింజ తొక్కల రసాన్ని బొద్దింకలను తరమడానికి వాడతారు.[6]
- చాలా రకాల పండ్లనుండి ప్రకృతి సిద్ధమైన రంజనాలు తయారుచేస్తారు. ఉదా: చెర్రీ, మల్బరీ .[7]
- ఎండబెట్టిన దోస జాతి పండ్లనుండి నీటి జగ్గులు, పక్షి గూళ్ళు, సంగీత వాద్యాలు, కప్పులు, పాత్రలుగా ఉపయోగిస్తారు.
- కొబ్బరిపీచు నుండి బ్రష్ లు, తివచీలు, పరుపులు మొదలైనవి తయారుచేస్తారు.
- కొబ్బరిపెంకు నుండి కప్పులు, సంగీత వాద్యాలు, పక్షి గూళ్ళు తయారుచేస్తారు.[8]
పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టడం స్థానే ఇథలీన్‌ను ఉపయోగించడం సురక్షితమని భావిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- Delebecque, François; Rodríguez Fischer, Cristina (2014). Frutas, flores, hortalizas y pequeños bichitos. Art Blume, S.L. ISBN 978-8498017755.
- McGee. On Food and Cooking. pp. Chapter 7: A Survey of Common Fruits.
- McGee. On Food and Cooking. pp. Chapter 6: A Survey of Common Vegetables.
- Farrell, Kenneth T. (November 1 1999). Spices, Condiments and Seasonings. Springer. pp. pp. 17-19. ISBN 0-8342-1337-0. Check date values in:
|date=(help)CS1 maint: Extra text (link) - Booth, Martin (June 12 1999). Opium: A History. St. Martin's Press. ISBN 0-312-20667-4. Check date values in:
|date=(help) - Cothran, James R. (November 1 2003). Gardens and Historic Plants of the Antebellum South. University of South Carolina Press. pp. pp. 221. ISBN 1-57003-501-6. Check date values in:
|date=(help)CS1 maint: Extra text (link) - Adrosko, Rita J. (June 1 1971). Natural Dyes and Home Dyeing: A Practical Guide with over 150 Recipes. Courier Dover Publications. ISBN 0-486-22688-3. Check date values in:
|date=(help) - "The Many Uses of the Coconut". The Coconut Museum. Retrieved 2006-09-14.
