న్యాయవాది

న్యాయవాది ని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు. న్యాయస్ధానంలో కక్షి (వాది), ప్రతికక్షి (ప్రతివాది) దారుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున ఒకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది. ఇతనిని ప్లీడరు, వకీలు, అడ్వకేటు అని కూడా పిలుస్తారు. వ్యాజ్యాలు రెండు రకాలు. ఒకటి సివిల్, మరొకటి నేరసంబంధమైన క్రిమినల్. సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని, నేరాలకు సంబందించిన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ న్యాయవాది అంటారు.

న్యాయవాది
19 వ శతాబ్దం లో ఫ్రెంచ్ చిత్రకారుడు గీసిన "న్యాయవాదుల చిత్రం"
వృత్తి
పేర్లు Attorney, counselor (counsel), solicitor, barrister, advocate
వృత్తి రకం
Profession
కార్యాచరణ రంగములు
Law, business
వివరణ
సామర్థాలు Analytical skills
Critical thinking skills
Knowledge of the law
Proficiency in legal research and legal writing
విద్యార్హత
see Professional requirements
ఉపాథి రంగములు
Courts, government, private sector, NGOs, legal aid
సంబంధిత ఉద్యోగాలు
Judge, Prosecutor, Law clerk, Law professor

న్యాయవ్యాధి పట్టబద్రుడై వుండి (బి.ఎ; బి.కాం; బి.ఎస్సి), న్యాయశాస్త్రంలో (LLB నందు) కూడా పట్టభడద్రుడైవుండాలి. గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి, చట్టంలోని విషయముల పట్ట పూర్తి అవగాహన వుండాలి. మంచి వాదన పటిమ వుండాలి. బార్ ఆసోసొయేసనులో సభ్యత్వముండాలి. న్యాయవాదులకు డ్రస్‍కోడ్‍ ఉంది. తెల్లచొక్కా మీద తెల్ల ప్యాంటు ధరించి, పైన నల్లకోటు ధరించాలి.

సివిల్ వ్యాజ్యాలు
ఉదా: భూతగాదాలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, ఆర్థిక మోసం, కుటుంబతగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
క్రిమినల్ (నేరపూరితం) 
ఉదా: ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం, ప్రాణహాని కల్గించడం, దోపిడి, గాయ పరచి దొంగలించడం, దొంగతనం, మాదకద్రవాల అమ్మకం, దొంగనోట్ల మార్చుట, గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసుల క్రిందికి వస్తాయి.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.