న్యాయం కావాలి
| న్యాయం కావాలి (1981 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
| కథ | డి. కామేశ్వరి నవల "కొత్తమలుపు" |
| తారాగణం | శారద , చిరంజీవి, రాధిక, జగ్గయ్య |
| సంగీతం | చక్రవర్తి |
| సంభాషణలు | సత్యానంద్ |
| నిర్మాణ సంస్థ | శ్రీక్రాంతి చిత్ర |
| భాష | తెలుగు |
నటీనటులు
- రాధిక ... భారతీదేవి (నూతన పరిచయం)
- చిరంజీవి ... సురేష్ కుమార్
- కొంగర జగ్గయ్య ... లాయర్ దయానిధి (సురేష్ తండ్రి)
- శారద ... లాయర్ శకుంతల
- అల్లు రామలింగయ్య ... టైప్ ఇన్స్టిట్యూట్ ఓనర్
- తులసి ... బేబి తులసి
- చాట్ల శ్రీరాములు ... విశ్వనాధం (భారతి తండ్రి)
- పి.జె.శర్మ ... జడ్జి
- టెలిఫోన్ సత్యనారాయణ ... గెస్ట్ హౌస్ ఓనర్
- పుష్పలత ... సావిత్రి (భారతి తల్లి)
- అత్తిలి లక్ష్మి ... పద్మావతి (సురేష్ కుమార్ తల్లి)
- బేబీ రోహిణి ... సరోజ (బేబి రోహిణిగా)
- హలం ... క్లబ్ డాన్సర్ గా
- ఫటాఫట్ జయలక్ష్మి ... జయలక్ష్మి (సురేష్ భార్య)
సాంకేతికవర్గం
- దర్శకత్వం : ఎ.కోదండరామిరెడ్డి
- కథ: డి.కామేశ్వరి
- మాటలు: సత్యానంద్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: లోక్‌సింగ్
- నృత్యాలు: తార
కథ
బెంచి గుమాస్తా విశ్వనాథం కూతురు భారతి చూడముచ్చటగా ఉంటుంది. లాయర్ దయానిధి కొడుకు సురేష్ ఆ అమ్మాయిని చూసి, వెంటబడి, ప్రేమించినట్లు నటించి, ఆ అమ్మాయి చేత ప్రేమింపజేసుకుంటాడు. అతడిది నిజమైన ప్రేమ అని నమ్మిన భారతి అతడికి మనసుతో పాటు తనువు కూడా అర్పిస్తుంది. తల్లిదండ్రుల మాటలను కూడా లెక్కచేయదు. నెలతప్పుతుంది. తీరా పెళ్లిమాట ఎత్తితే సురేష్ నవ్వేస్తాడు. ప్రేమ వేరని, పెళ్లి వేరని అంటాడు. భారతి లాయర్ దయానిధి వద్దకు వెళ్ళి నిలదీస్తుంది. దయానిధి ఆమెను అవమానిస్తాడు. అబార్షన్ చేయించుకోమని తండ్రి ఇచ్చిన సలహాను భారతి త్రోసిపుచ్చుతుంది. తనను మోసం చేసిన సురేష్‌ను కోర్టుకు ఈడ్చి నవ్వులపాలు చేయాలని నిశ్చయించుకుని లాయర్ శకుంతల దగ్గరకు వెళుతుంది. లాయర్ శకుంతల భారతి తరఫున కోర్టులో వాదిస్తున్న సమయంలో ఒక కొత్త సంగతి బయటపడుతుంది[1].
పాటలు
- అమ్మో నాకు భయం
- ఈరోజే ఆదివారము
- బుడి బుడి బిడియంగా
- న్యాయం కావాలి స్త్రీలకు న్యాయం జరగాలి
మూలాలు
- వి.ఆర్. (24 May 1981). "చిత్రసమీక్ష: న్యాయం కావాలి". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 68, సంచిక 50). Retrieved 11 February 2018.
బయటిలింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
