నెమలి

నెమలి (ఆంగ్లం : Peacock) భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడావాటి ఈకలు ఉంటాయి.

నెమలి
పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: Galliformes
కుటుంబం: Phasianidae
జాతి: Pavo, Afropavo
జాతులు

పావో క్రిస్టేటస్
పావో మ్యూటికస్
ఆఫ్రోపావో కాంగోలెన్సిస్

మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, పరమశివుని కుమారుడయిన సుభ్రమణ్యుడు నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు. నేమలి పించాలను సరకస లో వాడుతారు

ఆహారం

నెమలి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను మరియూ కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తాయి.[1][2]

జాతులు

కాంగో నెమలి (ఆఫ్రోపావో కాంగోలెన్సిస్) - ఇది మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది.

భారత నెమలి (పావో క్రిస్టేటస్) - ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత మరియు శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.

ఆకుపచ్చ నెమలి (పావో మ్యూటికస్) - ఇది తూర్పు మయన్మారు నుండి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ జాతి నెమలి వేటవలన మరియు నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటం వలన అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అంతరిస్తుందని భావిస్తున్న ఆకుపచ్చ రంగు నెమలి ఐదు వేరు వేరు జాతుల సమ్మేళనం, కానీ ప్రస్తుతం వీటిని ఒకే జాతికి చెందిన మూడు ఉప జాతులుగా వర్గీకరించారు.

నివశించే ప్రదేశాలు

నెమలి ఎక్కువగా గడ్డిమైదానాలలో నివసిస్తుంటాయి.

పించం - ఈకలు

మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.

ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.

నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపిస్తాయి.[3]

ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.

ప్రవర్తన

దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.[4] అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే వీటి నుండి ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.

సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పసుపక్షాదులతో అంతత్వరగా కలవవు.

జతకట్టడం

జతకట్టుటకు సిద్దపడుతున్న మగ నెమలి అరుపును వినండి.నెమళ్ళు ఎక్కువగా గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి.నెమళ్ళ గుంపును ఇంగ్లీష్ లో పార్టీ party అంటారు

హిందూ పురాణాలలో

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.