నెప్పల్లి
నెప్పల్లి, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 245., ఎస్.టీ.డీ. కోడ్ = 08676.
| నెప్పల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కంకిపాడు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ కొణతం గిరిధర్ |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,949 |
| - పురుషుల సంఖ్య | 948 |
| - స్త్రీల సంఖ్య | 1,001 |
| - గృహాల సంఖ్య | 602 |
| పిన్ కోడ్ | 521245 |
| ఎస్.టి.డి కోడ్ | 08676 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు
నెప్పల్లి ఉయ్యూరుకు ఆరు కి.మీ దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. మండల పరిషత్తు ఆదర్శ ప్రాధమిక పాఠశాల:- ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదివిన పోతురాజు శ్రావ్య అను విద్యార్ధిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ఆరవ చదువుటకు ఎంపికైనది. ఈమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. [5]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
పోస్ట్ ఆఫీసు.
గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం
కృష్ణా నది పై విజయవాడ వద్ద గల ప్రకాశం బ్యారేజి నుండి మొదలై కుడి కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణగా వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది.
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొణతం గిరిధర్ సర్పంచిగా టాస్ ద్వారా ఎన్నికైనారు. [2]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శివాలయం
ఇక్కడి "శివాలయం"లో అమ్మవారి దసరా ఉత్సవములు, సుమారు 65 సంవత్సరముల నుండి, ఈ ఊరిలో, అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు హరికథ, బుర్రకథ, కోలాటము వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం
ఈ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-2వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహింవ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. తమ గ్రామములో పంటలు బాగా పండాలనీ, గ్రామం సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని కోరుకున్నారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
ఇక్కడ వ్యవసాయం ముఖ్య జీవనాధారం.
గ్రామ ప్రముఖులు
ఈ ఊరు ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు.
గ్రామ విశేషాలు
ఈ గ్రామములో "స్వచ్ఛభారత్' కార్యక్రమం బాగా అమలుచేస్తున్నారు. ఒక సంవత్సరం లోపల గ్రామస్థులు 100% మరుదొడ్ల కార్యక్రమంలో సఫలీకృతులు కావడానికి విశేషకృషి చేస్తున్నారు. [3]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,949 - పురుషుల సంఖ్య 948 - స్త్రీల సంఖ్య 1,001 - గృహాల సంఖ్య 602
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1801.[2] ఇందులో పురుషుల సంఖ్య 881, స్త్రీల సంఖ్య 920, గ్రామంలో నివాస గృహాలు 478 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Neppalli". Retrieved 19 June 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
బయటి లింకులు
[2] ఈనాడు విజయవాడ; 2013,జూలై-28; 19వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-11; 21వపేజీ. [4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,మార్చి-3; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,జూన్-30; 1వపేజీ.