నిలాత్తింగళ్ తుండత్తాన్

నిలాత్తింగళ్ తుండత్తాన్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

నిలాత్తింగళ్ తుండత్తాన్
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: నిలాత్తిజ్గళ్ తుండత్తాన్
ప్రధాన దేవత: వేరొరు వన్ఱిల్లా తాయార్
దిశ మరియు స్థానం: పశ్చిమ ముఖము
పుష్కరిణి: చంద్రపుష్కరిణి
విమానం: పురుష సూక్త విమానము
కవులు: కలియన్
ప్రత్యక్షం: రుద్రుడు

విశేషాలు

సాహిత్యం

శ్లో. నిలాత్తింగళ్ తుండనామ నగరే రుచిరాకృతా
  నిలాత్తింగళ్ తుండ నాథ శ్చంద్ర పుష్కరిణీయుతే
  పురుషసూక్త విమాన మధిశ్రితో వరుణ దిగ్వదనస్థితి శోభిత:
  సదృశ శూన్య లతా నయన ప్రియో లసతి రుద్రసుత:కలిజిన్నుత:||

పాశురాలు

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
  నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
  ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
  ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
  కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
  కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
  పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
  పెరుమానున్ తిరువడియే పేణినేనే
  తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నిలాత్తిజ్గళ్ తుండత్తాన్ వేరొరు వన్ఱిల్లా తాయార్ చంద్రపుష్కరిణి పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ కలియన్ పురుష సూక్త విమానము రుద్రునకు

మంచిమాట

దుర్గతి

ప్రణవమందలి మధ్యమాక్షరము (ఉ) యొక్క అర్థము (అనన్యార్హ సంబంధము) తెలిసియు ధనవంతులను ఆశ్రయించుచున్నారే!తిరుమంత్రము లోని మధ్యమపదము (నమ:) యొక్క అర్థము (రక్ర్యరక్షక సంబంధము) తెలిసియు తమరక్షణకై తాము ప్రయత్నించు చున్నారే! తిరుమంత్రము లోని తృతీయ పదము (నారాయణాయ) అర్ధము (భోక్త్యభోగ్య సంబంధము) తెలిసియు తామే భోక్తలమని భావించుచున్నారే! ఏమి! ఈ సంసారుల దుర్గతి.

-తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్.

చేరే మార్గం

ఇది పెద్ద కంచిలో గల దివ్యదేశము. ఈ సన్నిధి ఏకాంబరేశ్వరుని ఆలయములో గలదు. పుష్కరిణి కానరాదు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.