నియోబియం

నియోబియం 41వ మూలకం. ఇది ఇంతకు ముందు కొలంబియం (Cb) గా ప్రస్తుతం నియోబియం (Nb) గా గుర్తింపబడుతుంది. ఇది మృదువుగా, బూడిద రంగులో, తీగలుగా సాగుగల గుణమున్న లోహము. ఇది పైరోక్లోర్ అనే ఖనిజంలో లభిస్తుంది. పైరోక్లోర్ ఖనిజం నుండి నియోబియం మరియు కొలంబైట్ లాంటి వాణిజ్యపరమయిన ధాతువులను తీయవచ్చు. గ్రీకు పురాణాల్లోని టాంటలస్ కూతురయిన నియోబ్ నుండి ఈ పేరును గ్రహించడం జరిగింది. నియోబియం ఎన్నో భౌతిక మరియు రాసాయనిక విషయాల్లో టాంటలం అనే మరో మూలకంతో చాలా సారూప్యత కలిగి ఉండటం వలన ఈ రెండిటినీ పక్కన పక్కన పెట్టి భేదాలు చూడటం కష్టం. 1801 లో చార్లెస్ హాట్చెట్ అనే ఆంగ్ల రసాయనశాస్త్రజ్ఞుడు టాంటలంతో సారూప్యత కలిగిన ఒక మూలకాన్ని కనుగొని, దానికి కొలంబియం అని నామకరణం చేసాడు. 1809లో మరో ఆంగ్ల రసశాస్త్రవేత్త విలియం హైడ్ వొలాస్టన్ టాంటలం మరియు కొలంబియం ఒకటే అని తప్పుడు అభిప్రాయానికి వచ్చాడు. 1846లో జెర్మన్ రసాయన శాస్త్రవేత్త హెయిన్రిచ్ రోజ్ టాంటలం ముడిలోహాల్లో రెండవ మూలకం ఉందనీ, అది నియోబియం అని నామకరణం చేసాడు. 1864 మరియు 1865 లో కొన్ని వరుసగా జరిగిన పరిశోధనల్లో తేలిందేమిటంటే నియోబియం మరియు కొలంబియం ఒకటే అనీ (టాంటలం కాకుండా), దాదాపు ఒక శతాబ్దం పాటూ రెండు పేర్లూ మార్చి మార్చి వాడబడ్డాయి. 1949లో అధికారికంగా నియోబియం అనే పేరు ధృవపడినప్పటికీ, అమెరికాలోని మెటలర్జీ (లోహశాస్త్ర) విభాగం వారు కొలంబియం అనే వాడుతున్నారు. ఇరవయ్యో శతాబ్ది మొదటికిగానీ వాణిజ్యపరంగా నియోబియం వాడుకలోకి రాలేదు. బ్రెజిల్ నియోబియం మరియు ఫెర్రోనియోబియం (అనబడే నియోబియం మరియు ఇనుము యొక్క లోహమిశ్రం) ఖనిజాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. గ్యాస్ పైప్లైన్లలో వాడే స్టీల్లో నియోబియాన్ని వాడతారు. అధిక ఉష్ణోగ్రతల్లో నిలదొక్కుకోవడం వలన జెట్ మరియు రాకెట్ ఇంజన్లలో నియోబియాన్ని వాడతారు. ఎంఆర్ఐ స్కానర్లలో నియోబియంతో పాటు టిటానియం మరియు టిన్ కలిగిన మిశ్రలోహాన్ని వాడతారు. ఇంకా వెల్డింగ్, న్యూక్లియర్ పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, న్యూమిస్మాటిక్స్ (నాణేలు), మరియు ఆభరణాల పరిశ్రమలలో నియోబియం వాడబడుతుంది. తక్కువ విషపూరితంగా ఉండటం మరియు ఆనోడైజేషన్ పిదప రంగు మారే అవకాశం ఉండటం వలన ఆఖరి రెండు ఉపయోగాల్లో ఎక్కువగా వాడబడుతుంది.

నియోబియం,  41Nb
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/nˈbiəm/ (ny-OH-bee-əm)
కనిపించే తీరుgray metallic, bluish when oxidized
ప్రామాణిక అణు భారం (Ar, standard)92.90637(2)[1]
ఆవర్తన పట్టికలో నియోబియం
V

Nb

Ta
జిర్కోనియంనియోబియంమాలిబ్డెనం
పరమాణు సంఖ్య (Z)41
గ్రూపుగ్రూపు 5
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d4 5s1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 12, 1
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం2750 K (2477 °C, 4491 °F)
మరుగు స్థానం5017 K (4744 °C, 8571 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)8.57 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
30 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
689.9 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ24.60 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2942 3207 3524 3910 4393 5013
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు5, 4, 3, 2, -1
(mildly acidic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.6
పరమాణు వ్యాసార్థంempirical: 146 pm
సమయోజనీయ వ్యాసార్థం164±6 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం బోడీ సెంట్రెడ్ క్యూబిక్ (bcc)
Speed of sound thin rod3480 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం7.3 µm/(m·K)
ఉష్ణ వాహకత53.7 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం152 n Ω·m (at 0 °C)
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం105 GPa
షేర్ గుణకం38 GPa
బల్క్ గుణకం170 GPa
పాయిసన్ నిష్పత్తి0.40
మోహ్స్ కఠినత్వం6.0
వికర్స్ కఠినత్వం1320 MPa
బ్రినెల్ కఠినత్వం736 MPa
CAS సంఖ్య7440-03-1
చరిత్ర
ఆవిష్కరణCharles Hatchett (1801)
మొదటి సారి వేరుపరచుటChristian Wilhelm Blomstrand (1864)
రసాయన మూలకం గా గుర్తించినవారుHeinrich Rose (1844)
నియోబియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
91Nb syn 6.8×102 y ε - 91Zr
91mNb syn 60.86 d IT 0.104e 91Nb
92Nb syn 10.15 d ε - 92Zr
γ 0.934 -
92Nb syn 3.47×107y ε - 92Zr
γ 0.561, 0.934 -
93Nb 100% - (SF) <0.943
93mNb syn 16.13 y IT 0.031e 93Nb
94Nb syn 2.03×104 y β 0.471 94Mo
γ 0.702, 0.871 -
95Nb syn 34.991 d β 0.159 95Mo
γ 0.765 -
95mNb syn 3.61 d IT 0.235 95Nb
Decay modes in parentheses are predicted, but have not yet been observed

చరిత్ర

నామకరణం

విశేషాలు

భౌతిక

రసాయనిక

ఐసోటోపులు

అందుబాటు

ఉత్పత్తి

సమ్మేళనాలు

ఆక్సైడులు, సల్ఫైడులు

హాలైడులు

నైట్రైడ్ మరియు కార్బైడులు

వినియోగం

స్టీల్ ఉత్పత్తిలో

సూపర్ అల్లాయ్

సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్

ఇతర ఉపయోగాలు

ఎలెక్ట్రోసెరామిక్స్

హైపోఅలెర్జనిక్ ఉపయోగాలు

నాణేల తయారీ

ఇతరాలు

జాగ్రత్తలు

మూలాలు

బయటి లింకులు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.