నిభానుపూడి
నిభానుపూడి , కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.
| నిభానుపూడి | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() నిభానుపూడి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.297559°N 80.978819°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 928 |
| - పురుషుల సంఖ్య | 463 |
| - స్త్రీల సంఖ్య | 465 |
| - గృహాల సంఖ్య | 249 |
| పిన్ కోడ్ | 521157 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
17వ శతాబ్దంలో, డక్కన్ పరిపాలనా కాలంలో, విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే ఆనాటి ముస్లిం సేనాధిపతి నిభాన్ సాహెబ్, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలోని ఈ గ్రామానికి అప్పట్లో గుర్రాలపై వచ్చి, విడిది ఏర్పాటుచేసుకొని చుట్టుప్రక్కల గ్రామాల భూములనుండి పన్నులు వసూలుచేసేవారని చెబుతారు. కాలక్రమేణా ఈ గ్రామం పేరు నిభానుపూడిగా మారినది. నిభాన్ ఇక్కడ ఒక మసీదు కట్టించగా, అతడి సహాయకుడు సఫ్దర్ ఖాన్ మరియు అతడి బంధువుల కుటుంబాలు ఇక్కడ స్థిరపడినవి. ఇలా ముస్లిం కుటుంబాలతోపాటు, వ్యవసాయ కూలీలుగా వలస వచ్చిన ఎస్.సి.లు గూడా ఈ గ్రామములో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇలా రూపుదిద్దుకున్న ఈ గ్రామములో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో, మిలిటరీ అధికారులు ఈ గ్రామానికి వచ్చి, ఎత్తుగా బలంగా ఉన్న కొందరు యువకులను సైన్యంలోనికి తీసుకొని వెళ్ళటంతో, దేశ రక్షణ దళాలలోకి ఈ గ్రామస్తుల ప్రవేశం మొదలైనదని భావించవచ్చు. కాలక్రమేణా ఎక్కడ దేశసైనికుల కొరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించినా ఈ గ్రామస్థులు వెళ్ళటం పరిపాటిగా మరినది. 1939లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం, 1962లో జరిగిన చైనాతో యుద్ధం, 1965లోని పాకిస్థానుతో యుద్ధం, అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్నవారు ఇక్కడివారే కావటం గమనార్హం. దేశరక్షణదళంలో నాటినుండి నేటి వరకు, సుమారు 40 నుండి 80 మంది వరకు పనిచేయగా, వీరిలో ఖలీల్ రెహమాన్, లెఫ్టినెంటు కల్నలుగా హోదానుపొంది, రాష్ట్రపతి నుండి సన్మానం పొంది గ్రామానికే గర్వకారణంగా నిలిచారు. సుబేదర్ మేజర్ దాసి వెంకటేశ్వరరావు హ్యారీ కెప్టెనుగా, అబ్దుల్ హమీద్, ఎం.డి.అన్సారీలు సుబేదార్లుగా పనిచేసారు. 1947లో స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (తండ్రి=జియ ఉల్ రెహమాన్), అబ్దుల్ సమద్ మరియు అబ్దుల్ అజీజ్ లు పాల్గొనడం గమనార్హం. 1939 లో జరిగిన యుద్ధంలో అబ్దుల్ అజీజ్ వీరమరణం పొందినారు. వెరిని ఆదర్శంగ తీసికొని మరికొందరు ఇప్పటికీ సైన్యంలో ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు పోలీసుశాఖలో ఎస్.ఐ. మరియు కానిస్టేబుల్స్ గా సుమారుగా 20 మంది పనిచేయుచూ, ప్రజాసేవకు అంకితమవడం విశేషం. అందుకే ఈ గ్రామంలో ఏ ఇంటిలో చూసినా, దేశమాత సేవలో మ వంశం నుండి ఒకరున్నారని గర్వంగా చెబుతారు. [2]
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములోని విద్యాసౌకర్యాలు
మండల పరిష;త్తు ప్రాథమిక పాఠశాల.
మండల పరిష;త్తు ఉర్దూ ప్రాథమిక పాఠశాల.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జూలైలోలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి దాసరి నిర్మల సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అరిశె రామారావు ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామములోని ప్రధాన పంటలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 928 - పురుషుల సంఖ్య 463 - స్త్రీల సంఖ్య 465 - గృహాల సంఖ్య 249
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 932.[2] ఇందులో పురుషుల సంఖ్య 469, స్త్రీల సంఖ్య 463, గ్రామంలో నివాస గృహాలు 249 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nibhanupudi". Retrieved 30 June 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[2] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-1; 23వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016, జనవరి-27; 24వపేజీ.
నిభాను పూడి చాల అందమైన ఊరు. మా ఇంటి పేరు అరిశే; నాపేరు విజయశ్రీ.
