నితిన్

నితిన్ (జ: 1983 మార్చి 30) ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.[1] అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

నితిన్
జననంనితిన్ కుమార్ రెడ్డి
మార్చి 30, 1983
నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసంహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లునితిన్
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2002–ఇప్పటివరకూ

సినిమా కెరీర్

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ లను అతని అభిమాన నటులు. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.

ఒక రోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.[1]

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విశేషాలు
2002జయంవెంకట్దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు
2003దిల్శీను
2003సంబరంరవి
2004శ్రీ ఆంజనేయంఅంజి
2004సైపృథ్వి
2005అల్లరి బుల్లోడురాజు,
మున్నా
ద్విపాత్రాభినయం
2005ధైర్యంశీను
2006రామ్రామ్
2007టక్కరితిరుపతి
2008ఆటాడిస్తాజగన్
2008విక్టరీవిజయ్
2008హీరోరాధాకృష్ణ
2009ద్రోణద్రోణ
2009అగ్యాత్సుజల్హిందీ సినిమా
2009రెచ్చిపోశివ
2010సీతారాముల కళ్యాణం లంకలోచంద్ర
2011మారోసత్యనారాయణ మూర్తి
2012ఇష్క్రాహుల్
2013గుండె జారి గల్లంతయ్యిందేకార్తిక్
2013కొరియర్ బాయ్ కళ్యాణ్కళ్యాణ్
2014హార్ట్ అటాక్వరుణ్
2014చిన్నదాన నీ కోసంనితిన్
2016"అ ఆ"ఆనంద్
2017"లై"

2018 || "శ్రీనివాస కల్యాణం ||

మూలాలు

  1. "ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 March 2017. Retrieved 30 March 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.