నికెలు

నికెల్,  28Ni
సాధారణ ధర్మములు
కనిపించే తీరుlustrous, metallic, and silver with a gold tinge
ప్రామాణిక అణు భారం (Ar, standard)58.6934(4)[1]
ఆవర్తన పట్టికలో నికెల్
-

Ni

Pd
కోబాల్ట్నికెల్రాగి
పరమాణు సంఖ్య (Z)28
గ్రూపుగ్రూపు 10
పీరియడ్పీరియడ్ 4
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ar] 3d8 4s2 or [Ar] 3d9 4s1 (see text)
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 16, 2 or 2, 8, 17, 1
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1728 K (1455 °C, 2651 °F)
మరుగు స్థానం3186 K (2913 °C, 5275 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)8.908 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు7.81 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
17.48 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
377.5 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.07 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1783 1950 2154 2410 2741 3184
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4[2], 3, 2, 1[3], -1 mildly basic oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.91
అయనీకరణ శక్తులు
  • (more)
పరమాణు వ్యాసార్థంempirical: 124 pm
సమయోజనీయ వ్యాసార్థం124±4 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం163 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం ముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
Speed of sound thin rod4900 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం13.4 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత90.9 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం69.3 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంferromagnetic
యంగ్ గుణకం200 GPa
షేర్ గుణకం76 GPa
బల్క్ గుణకం180 GPa
పాయిసన్ నిష్పత్తి0.31
మోహ్స్ కఠినత్వం4.0
వికర్స్ కఠినత్వం638 MPa
బ్రినెల్ కఠినత్వం700 MPa
CAS సంఖ్య7440-02-0
చరిత్ర
ఆవిష్కరణAxel Fredrik Cronstedt (1751)
మొదటి సారి వేరుపరచుటAxel Fredrik Cronstedt (1751)
నికెల్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
58Ni 68.077% >7×1020 y (β+β+) 1.9258 58Fe
59Ni trace 7.6×104 y ε - 59Co
60Ni 26.223% Ni, 32 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
61Ni 1.14% Ni, 33 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
62Ni 3.634% Ni, 34 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
63Ni syn 100.1 y β 0.0669 63Cu
64Ni 0.926% Ni, 36 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
Decay modes in parentheses are predicted, but have not yet been observed

మౌలిక సమాచారం

నికెల్ఒక రసాయనిక మూలకం. మూలకాల ఆవర్తన పట్టికలో సమూహం (group )10, D బ్లాకు,4 వ పెరియడునకు చెందిన లోహం.దీనియొక్క పరమాణు సంఖ్య28. కొద్దిగా బంగారుపు ఛాయకలిగిన వెండి లా తెల్లగా మెరిసే మూలక లోహం. నికెల్ ఒక పరివర్తన మూలకం. ఇది దృఢమైనది, పలకలు, తీగలుగా సాగే స్వభావమున్నది.నికెల్ లోహం పెద్ద ముక్కలుగా, ముద్దగా ఉన్నప్పటి కన్న పుడిగా, ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగినప్పుడు ఎక్కువ చార్యాశీలత కనపరచును.

చరిత్ర

క్రీ.పూ.3500 సంవత్సరాల నాటికే ఉల్కాపాత జనితమైన సహజ నికెల్-ఇనుము మిశ్రమఖనిజాన్ని వాడినట్లు తెలుస్తున్నది. ఆనాటి, ప్రస్తుతం సిరియాగా పిలవబడే ప్రాంతంలో దొరికిన కంచు వస్తువులలో 2% వరకు నికెల్ లోహం ఉన్నది[4]. చైనాలోని లిఖిత వ్రాతప్రతులలో వ్రాసినదాని ప్రకారం తెల్లరాగి (రాగి-నికెల్ మిశ్రమ ధాతువు, చైనాలో బై టోంగ్, baitong అంటారు ) ని క్రీ.పూ .1700-1400 మధ్య కాలంలో వాడినట్లు తెలుస్తున్నది. 17 వ శతాబ్దిలో ఈ తెల్లరాగిని బ్రిటన్‌కు ఎగుమతి చేసినట్లు తెలుస్తున్నది. అయితే 1822 వరకు ఇది ఒక ప్రత్యేక లోహమని తెలియరాలేదు[5].

ప్రస్తుతం నికెలైన్, లేదా నికోలైట్ అనబడు ఎర్రని ముడిఖనిజాన్ని మధ్య జర్మనీ లోని Erzgebirge ప్రాంతంలో గుర్తిం చినప్పుడు, దానిని రాగి ఖనిజంగా భావించారు.దానినుండి 1751 లో బారోన్ ఆక్సిల్ ఫ్రెడ్రిక్ క్రాంస్ట్ద్ ( Axel Fredrik Cronstedt) ఈ ముడి ఖనిజం నుండి రాగిని ఉత్పత్తి చెయ్యటానికి ప్రయత్నించగా, తెల్లటి లోహం ఉత్పత్తి అయ్యినది. అనుకున్నదానికి భిన్నంగా వేరే లోహం ఉత్పన్నం కావటంతో దానికి జర్మనీపురాణ దయ్యం పేరు కాప్రోనికెల్ అనేపేరు ఈ కొత్త లోహనికి పెట్టాడు[6].కావున Axel Fredrik Cronstedtనే నికెల్ ను కనుగొన్న రసాయన శాస్త్రవేత్తగా భావించాలి.

భౌతిక ధర్మాలు

ఇనుము, కోబాల్ట్, గాడోలీనియం తరువాత అయస్కాంత ప్రభావిత ధర్మాలుకలిగిన నాలుగవ మూలకం ఇది.ఈ లోహం యొక్క క్యూరీ (curie) యొక్క ఉష్ణోగ్రత 355C, అనగా ఈ ఉష్ణోగ్రత దాటినతరువాత నికెల్ అయస్కాంత ప్రభావితం కాదు[7].పరమాణువు యొక్క పరమాణు వ్యాసార్థం 0.124 nm.అణు అమరిక ముఖ కేంద్రీయ ఘనాకృతిలో ఏర్పది, దీని అల్లికఅభీష్టపరిమాణం (lattice parameter) 0.352 nm లు ఉండును. నికెల్ పరావర్తక మూలకాల వర్గానికి చెందిన దృఢమైన, రేకులుగా సాగే గుణమున్న లోహం.గది ఉష్ణోగ్రత వద్ద, నికెల్ నెమ్మదిగా ఆక్సీకరణ చెందు స్వభావం కలిగి యున్నది. పెద్ద ముక్కలుగా ముద్దగా ఉన్నప్పుడు ఉపరితలంపై ఆక్సైడ్ పూత కప్పి ఉండటం వలన ఆక్సిజన్‌తో చర్య నెమ్మదిగా జరుగును. ఆక్సైడ్ పూత కలిగియున్నప్పటికి, ఈలోహం ఆక్సిజన్‌తో రసాయనిక చర్యలో కాస్త చురుకుగానే పాల్గోనును.

మూలకం యొక్కమూల ధర్మాలు

లక్షణంవిలువ
భౌతిక స్థితిఘనస్థితి
సంకేత అక్షరంNi
పరమాణుసంఖ్య28
పరమాణు ద్రవ్యరాశి58.6934 amu
ద్రవీభవన స్థానము1453.0 °C
మరుగుస్థానం2732.0 °C
ప్రోటానులు/ఎలక్ట్రానుల సంఖ్య28
న్యూట్రానుల సంఖ్య31
వర్గికరణపరివర్తక లోహం
సాంద్ర్తత,20°Cవద్ద8.902 గ్రాం/సెం.మీ3
రంగుతెలుపు
స్పటీకనిర్మాణంఘనాకృతి

విద్యుత్కణం(electron)విన్యాసం

నికెల్ పరమాణువు రెండు ఎలెక్ట్రాన్ విన్యాసాలను[Ar] 3d8 4s2, మరియు [Ar] 3d9 4s1 కలిగి యున్నది.ఈ రెండు కూడా సమాన శక్తిస్థాయి కలిగిఉన్నవి.[Ar]అను సంకేతం ఆర్గాన్ వంటి నిర్మాణము కలిగి ఉండటాన్ని సూచిస్తున్నది.రసాయన శాస్త్ర పాఠ్యాంశాలలో నికెల్ పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని [Ar]4S2 3d8 లేదా Ar] 3d84s2గా చూపించడం జరుగుతున్నది[8].

ఐసోటోపులు

స్వాభావికంగా లభ్యమయ్యే నికెల్ మూలకం 5 స్థిరమైన ఐసోటోపులను కలిగియున్నది.అవి ; 58Ni, 60Ni, 61Ni, 62Ni and 64Ni .ఇందులో 58Ni అనునదిసమృద్దిగా లభిస్తున్నది (68.07% ). 62Ni ఐసోటోపు 56Fe, 58Fe ల కన్న ఎక్కువ పరమాణుకేంద్రీయ బంధశక్తి కలిగియున్నది.18 రకాల రేడియో ఐసోటోపుల గుర్తింపు కూడాజరిగింది. వీటిలో 59Ni యొక్క అర్ధజీవితం 76,000 సంవత్సరాలు, 63Ni యొక్క అర్ధజీవితం 100.1 సంవత్సరాలు, 56Ni యొక్క అర్ధజీవితం 6.077 రోజులు.

నికెల్ లోహం యొక్క స్థిర ఐసోటోపుల పట్టిక[9]

నామమాత్ర
ద్రవ్యరాశి
కచ్చితమైన ద్రవ్యరాశిప్రకృతి సిద్ధమైన లభ్యత%రసాయనిక స్థితిసత్తువ
54Niఆక్సైడ్95+
58Ni57.9353462 (16)68.0769లోహం, ఆక్సైడ్, సల్ఫైడ్99+
60Ni59.9307884 (16)26.2231లోహం, ఆక్సైడ్95 - 99+
61Ni60.9310579 (16)1.1399లోహం, ఆక్సైడ్, సల్ఫైడ్89 - 94+
62Ni61.9283461 (16)3.6345లోహం96 - 98+
64Ni63.9279679 (17)0.9256లోహం, ఆక్సైడ్84 - 98+

రేడియో ఐసోటోపులు

18 రకాల రేడియో ఐసోటోపుల గుర్తింపు కూడాజరిగింది.క్రింద కొన్ని రెడియో ధార్మికత కలిగిన ఐసోటోపుల వివరాల పట్టిక పొందుపరచబడినది[10]

రెడియో
ఐసోటోపు
ద్రవ్యరాశిఅర్ధజీవితంక్షయ విధానంకేంద్రక వడి
56Ni55.942146.08 రోజులుEC to 56Co0
57Ni56.93980035.6 గంటలుEC to 57Co3/2
59Ni58.93435176,000 సంవత్సరాలుEC to 59Co3/2
63Ni62.929673100సంవత్సరాలుβ- to 63Cu1/2
65Ni64.9300882.517 గంటలుβ- to 65Cu5/2
66Ni65.9291254.6 గంటలుβ- to 66Cu0

లభ్యత

భూమి పై సల్ఫరు మరియుఇనుముతో కలసి పెంటా లామ్డైట్ (pentlandite) లోను, సల్ఫరుతో కలిసి మిల్లెరైట్ (millerite, ఆర్సెనిక్తో కలిసి నికేలిన్ (nickeline) ఖనిజాలలో లభిస్తుంది.అలాగే ఆర్సెనిక్, సల్ఫరులతో కలిసి గాలేనా (galena) అను ఖనిజంలోను లభిస్తుంది[11]. నికెల్ ఇనుప ఉల్కపాతంలో కామసైట్ (kamacite, టేనైట్ (taenite) మిశ్రమ దాతువుగా ఉంటుంది.

భారిస్థాయిలో గనులలో లభించు ముడిఖనిజం రెండురకాల నిల్వలు మొదటిది లాటేరైట్స్ ఇవి నికేలి ఫేర్రాస్ ముడి ఖనిజాలైన లిమోనైట్ (limonite: (Fe, Ni) O (OH) మరియు గార్నిరైట్ garnierite (a hydrous nickel silicate) : (Ni, Mg)3Si2O5 (OH). రెండవ రకం సల్ఫైడ్ నిల్వలు.ఈ రకంలో ప్రధానమైన ముడిఖనిజం పెంట్లనడితే పెంటలామ్డైట్ (pentlandite: (Ni, Fe) 9S8)

ఆర్థిక పరంగా నికెల్ ను అధిక ప్రమాణంలో కలిగిన ఇనుప ఖనిజం లిమోనైట్ (limonite) ఈ ఖనిజ అధిక పరిమాణంలో కెనడా (సుడ్బురి ప్రాంతం, ఉల్కాపాత కారణంగా ఏర్పడినదనిభావన, ఫసిపిక్లోని న్యూ కేలడోనియా, రష్యా లోని నోర్సిల్క్ ఉన్నాయి. భూమిలోపల ఇనుముతో కుడి లభిస్తుంది.నికెల్ లోహము సూపర్ నోవాలలో కేంద్రకాల సంయోగసమయంలో విశ్వంలో ఆవిర్భవించాయి.

ఉత్పత్తి

నికెల్ లోహాన్ని కనుగొన్న పిమ్మట, మొదట నికెల్‌ను అరుదుగా లభించే కుప్రోనికెల్ (Kupfernickel) నుండి తయారు చేసేవారు.1824 నుండి కోబాల్ట్ బ్లూ నుండి ఉప ఉత్పత్తిగా తయారు చెయ్యడం మొదలైనది. మొదటగానార్వే, నికెల్ లోహాన్ని అధికమొత్తంలో కలిగిన పైర్హో టైట్ (pyrrhotite ) ఖనిజంనుండి 1848 లో ఉత్పత్తి చెయ్యడం ప్రారంభించినది .

వినియోగం

ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అగుచున్న నికెల్ లోహంలో 46 %ను నికెల్ ఉక్కు తయారుచేయుటకు,34 %ను ఇనుమేతర మిశ్రమ ధాతువులను, సూపర్ మిశ్రమ ధాతువులను తయారు చేయుటలో, 14%ను ఎలక్టో ప్లేటింగు పరిశ్రమలలో,6%ను ఇతర రంగాలలో వినియోగిస్తున్నారు.నికెల్‌ను పలురకాల పరిశ్రమలలో పలురకాల వస్తువుల, పరికరాల ఉత్పత్తిలో విరివిగా వినియోగిస్తున్నారు.స్టైయిన్‌లెస్ స్టీలు, అల్నికో అయస్కాంతాలు, నాణేలు, రిచార్జబుల్ బ్యాటరీలలో, ఎలక్ట్రికల్ గిటారు తీగెలు, మైక్రోపోను కాప్సుల్స్, మరియు ప్రత్యేకమైన మిశ్రమ ధాతువులు చెయ్యుటకు ఉపయోగిస్తారు. గాజుకు పచ్చరంగు చాయను ఇవ్వటానికి కలుపుతారు.నికెల్‌ను ఇంకా రాగి, క్రోమియం, అల్యూమినియం, సీసం, కోబాల్ట్, వెండి, బంగారం వంటి లోహాలలో కుడా మిశ్రమం చేయుదురు.

ప్రపంచ ఉత్పత్తిలో 60%ను నికెల్ స్టీల్సు (తుప్పుపట్టిని ఉక్కు:stainless steel), తయారీలో వాడుచునారు.నూనెల పరిశ్రమలలో నూనెలను వనస్పతి లేదా హైడ్రోజనేసను చెయ్యుటకు నికెల్ ను ఉత్ప్రేరకంగా వాడెదరు.నికెల్ సమ్మెలన రూపంలో పారిశ్రామికంగా పలు ప్రయోజనాలు కలిగి యున్నది. గది ఉష్ణోగ్రత వద్ద, నికెల్ నెమ్మదిగా ఆక్సీకరణ చెందు స్వభావం కలిగి యున్నందున, చరిత్రా పరంగా దీనిని ఇనుము, ఇత్తడి వంటి లోహాల ఆక్సికరణను నివారించుటకై వాటి ఉపరితలం పై నికెల్ లోహాన్ని పలుచని పొరగా పూతగా పూసే వారు. అలాగే కొన్ని లోహాలను తయారుచేయు నప్పుడు, ఉదాహరణకు సత్తు వెండి (German silver ) వాటికి వెండి వంటి నునుపైన ఉపరితలం రావటానికి మిశ్రమ దాతువుగా కలుపుతారు.ఇప్పటికి 6% నికెల్ లోహాన్ని లోహాల ఉపరితల క్షయికరణ నను నివారణకై నికెల్ ప్లెటింగుగా వాడుచున్నారు.

19 వ శతాబ్ది నుండి నికెల్ ను నాణేల తయారీలో మిశ్రమ దాతువుగా వాడటం ప్రారంభంఅయ్యినది.

ఇవికూడా చూడండి

చిత్రమాలిక

బయటి లంకెలు

మూలాలు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  2. M. Carnes; et al. (2009). "A Stable Tetraalkyl Complex of Nickel(IV)". Angewandte Chemie International Edition. 48: 3384. doi:10.1002/anie.200804435.CS1 maint: Explicit use of et al. (link)
  3. S. Pfirrmann; et al. (2009). "A Dinuclear Nickel(I) Dinitrogen Complex and its Reduction in Single-Electron Steps". Angewandte Chemie International Edition. 48: 3357. doi:10.1002/anie.200805862.CS1 maint: Explicit use of et al. (link)
  4. Rosenberg, Samuel J (1968). Nickel and Its Alloys. National Bureau of Standards.
  5. McNeil, Ian (1990). "The Emergence of Nickel". An Encyclopaedia of the History of Technology. Taylor & Francis. pp. 96–100. ISBN 978-0-415-01306-2.
  6. Weeks, Mary Elvira (1932). "The discovery of the elements: III. Some eighteenth-century metals". Journal of Chemical Education. 9: 22. Bibcode:1932JChEd...9...22W. doi:10.1021/ed009p22.
  7. Kittel, Charles (1996). Introduction to Solid State Physics. Wiley. p. 449. ISBN 0-471-14286-7.
  8. G.L. Miessler and D.A. Tarr, "Inorganic Chemistry" (2nd ed., Prentice–Hall 1999) p.38
  9. "Nickel Isotopes". tracesciences.com. http://www.tracesciences.com/ni.htm.
  10. "Nickel: isotope data". webelements.com. http://www.webelements.com/nickel/isotopes.htm. Retrieved 2015-04-4.
  11. National Pollutant Inventory – Nickel and compounds Fact Sheet. Npi.gov.au. Retrieved on April 4, 2015.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.