నాసిర్ జంగ్ మీర్ అహ్మద్
నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ హైదరాబాద్ రాజ్యానికి పరిపాలకుడు. ఆయన నిజాం-ఉల్-ముల్క్ రెండవ కుమారుడు. 91 సంవత్సరాల వయసులో తన తండ్రి మరణించాకా జరిగిన వారసత్వ పోరాటాల్లో పాల్గొని తక్తును ఎక్కారు. క్రీ.శ.1748 నుంచి 1750 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు.
వారసత్వ యుద్ధం
నిజాం-ఉల్-ముల్క్ మరణించాకా హైదరాబాద్ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సాయం తీసుకుని తన మేనల్లుడు ముజఫర్ జంగ్ తో సంఘర్షణ పడ్డారు. ఫ్రెంచి వారి మద్దతుతో సంఘర్షించిన ముజఫర్ జంగ్ ను నాసిర్ జంగ్ ఓడించి బందీని చేశారు.
మరణం
1748లో గెలిచి పరిపాలన చేపట్టినా రెండు సంవత్సరాలు తిరిగేసరికల్లా హత్యకు గురై మరణించారు.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.