నాగ శౌర్య

నాగశౌర్య ముల్పూరి భారతీయ సినిమా నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. 2011లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. అతని మొదటి సినిమా "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్". జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను పోషించాడు. తరువాత ఊహలు గుసగుసలాడే మరియు దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో నటించాడు.[1]

నాగ శౌర్య
జననంనాగ శౌర్య ముల్పూరి
22 జనవరి 1989
ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుశౌర్య
జాతితెలుగు
వృత్తినటుడు, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2011–ప్రస్తుతం

వృత్తి

నాగ శౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. ఆయన అనేక సంవత్సరాలుగా విజయవాడలో నివాసమున్నాడు. తరువాత సినిమాలలో నటించాలనే తన కలను నెరవేర్చుకొనుటకు హైదరాబాదుకు మారాడు.[2] ఆయన సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడు.[2]

ఆయన మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు.[3] అప్పుడు ఆయన వారాహి చలన చిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆ ప్రకటనలో అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న శృంగార హాస్య చిత్రం ఊహలు గుసగుసలాడే గూర్చి ఉంది. ఆయన ఆ తన ప్రొఫైల్ ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికి ఆయన ప్రముఖ పాత్ర కోసం ఎంపిక అయ్యాడు.[3] ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన "చందమామ కథలు" చిత్రానికి ఎంపికయ్యాడు. ఆ చిత్రం మొదట విడుదల అయ్యింది.[4]

ఊహలు గుసగుసలాడే విడుదలైన రెండు మాసాల తరువాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు.[2] విశ్లేషకులు ఆయన హాస్యసన్నివేశాలకు సరిపోతాడని అన్నారు.[5] వారు తరువాత సినిమాలకు కచ్చితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.[6] ఆయన మూడవ చిత్రం దిక్కులు చూడకు రామయ్య కూడా శృంగార హాస్య చిత్రం. ఇది త్రిముఖ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో తండ్రి మరియు తనయుడు ఒకే అమ్మాయితో ప్రేమలో పడటం విశేషం.[7] "నాగ శౌర్య కొత్త నటులలో ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు" అని హిందూ పత్రిక వ్యాఖ్యానించింది.[8] ఆ సంవత్సరంలో శౌర్య యొక్క చివరి చిత్రం "లక్ష్మీ రావే మా ఇంటికి".[9] ఆయన తరువాత చిత్రం 2015లో విడుదలైన "జాదూగాడు". తరువాత "అబ్బాయితో అమ్మాయి" చిత్రంలో నటించాడు.

2016 లో ఆయన నీహారికా కొణిదెలతో కలసి ‎గొట్టిముక్కల వెంకట రామరాజు దర్శకత్వంలో ఒక మనసు చిత్రంలో నటించాడు. తరువాత కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరంచలన చిత్రంపాత్రగమనికలు
2011క్రికెట్ గార్ల్స్ అండ్ బీర్విక్రమ్
2014చందమామ కథలురాజుఅతిది పాత్ర
ఊహలు గుసగుసలాడేవెంకటేశ్వర రావు
దిక్కులు చూడకు రామయ్యమదు
లక్ష్మి రావే మా ఇంటికిసాయి
2015జాదూగాడుకృష్ణ
అబ్బయితో అమ్మాయిఅభి
2016కళ్యాణ వైభోగమేశౌర్యా
ఒక మనసుసూర్యా
జో అచ్యుతానందఆనంద్ వర్దన్ రావు
నీ జతలేకఅఖిల్
2017కథలో రాజకుమారిశౌర్య అతిది పాత్రలో
2018 ఛలో
దియా(తమిళం)కృష్ణ పోస్ట్ ప్రొడక్షన్
తెలుగు,తమిళ ద్విభాషా చిత్రం
తొలి తమిళ చిత్రం
కణం
అమ్మమగారిల్లు
నర్తనశాల (2018 సినిమా)

మూలాలు

  1. "Naga Shourya Debut Movie". Retrieved 5 February 2016.
  2. "You need at least 15-20 years to attain stardom : Naga Shaurya". Timesofindia.indiatimes.com. 2014-09-10. Retrieved 2015-04-17.
  3. "Naga Shourya: The newest kid on the block". Deccanchronicle.com. 2014-06-27. Retrieved 2015-04-17.
  4. "Naga Shourya Interview | Oohalu Gusagusalade Hero | Chandamama Kathalu | Avasarala Srinivas - Interviews". CineGoer.net. 2014-06-30. Retrieved 2015-04-17.
  5. "Oohalu Gusagusalade Movie Review". Timesofindia.indiatimes.com. 2014-06-20. Retrieved 2015-04-17.
  6. "Oohalu Gusagusalade Movie Review | oohalu gusagusalaade telugu movie review | Oohalu Gusagusalade Telugu Review". 123telugu.com. 2014-06-20. Retrieved 2015-04-17.
  7. "I want to do more edgy films, says Naga Shaurya". Timesofindia.indiatimes.com. Retrieved 2015-04-17.
  8. Sangeetha Devi Dundoo (2014-10-10). "Dikkulu Choodaku Ramayya: Of messy romances". Thehindu.com. Retrieved 2015-04-17.
  9. "Rajamouli praises Naga Shourya". 123telugu.com. Retrieved 2015-04-17.

ఇతర లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.