నాగాయలంక
నాగాయలంక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కొడ్ నం. 521 120., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
| నాగాయలంక | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | నాగాయలంక |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ శీలి రాము |
| జనాభా (2001) | |
| - మొత్తం | 9,321 |
| - పురుషుల సంఖ్య | 5,088 |
| - స్త్రీల సంఖ్య | 4,886 |
| - గృహాల సంఖ్య | 2,680 |
| పిన్ కోడ్ | 521 120 |
| ఎస్.టి.డి కోడ్ | 08671 |
| నాగాయలంక | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో నాగాయలంక మండలం యొక్క స్థానము |
|
![]() నాగాయలంక |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.9500°N 80.9167°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | నాగాయలంక |
| గ్రామాలు | 11 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 51,479 |
| - పురుషులు | 26,247 |
| - స్త్రీలు | 25,232 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 61.58% |
| - పురుషులు | 67.26% |
| - స్త్రీలు | 55.71% |
| పిన్ కోడ్ | 521120 |
గ్రామ చరిత్ర
పూర్వము నాగాయలంక ఒక దట్టెమయిన అటవి ప్రదేశం'
గ్రామం పేరు వెనుక చరిత్ర
నాగయ్య అనే వ్యక్తి ద్వారా గ్రామానికి ఆ పేరు వచ్చింది.
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
నాగాయలంక, కోడూరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్:- గుంటూరు 19 కి.మీ
గ్రామములోని విద్యా సౌకర్యాలు
మారుతీ పాలిటెక్నిక్
బి.సి.బాలికల వసతిగృహం
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
ఈ పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ తలశిల ప్రభాకరరావు, ఈ పాఠశాలలో చదివే విద్యార్థుల సౌకర్యార్ధమై, పాఠశాల ఆవరణలో ఒక భోజనశాల ఏర్పాటు కొరకు, 40 లక్షల రూపాయలను వితరణగా అందజేసినారు. ఈ భవన నిర్మాణం 2015,జూన్-29వ తేదీ నాడు ప్రారంభించారు. ఈ భోజనశాల (ఆడిటోరియం) లో, ఒకేసారి 1000 మందితో సమావేశం నిర్వహించేటందుకు వీలుగా ఉండును. [11]
విద్యభారతి
ఆంగ్ల మాధ్య పాఠశాల.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
- ఈ కేంద్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో, రికార్డుస్థాయిలో 165 ప్రసవాలు నిర్వహించారు. దీనితోపాటు ఆసుపత్రి సిబ్బంది కుటుంబసంక్షేమ కార్యక్రమాలలో చేసిన కృషికి గుర్తింపుగా, జిల్లాస్థాయిలో పురస్కారం లభించింది. 2015-16 సంవత్సరంలో ఇప్పటికి 49 ప్రసవాలు చేసారు. ఈ సంవత్సరం, వీరి లక్ష్యం=200. [12]
- ఈ కేంద్రంలో ఆయుష్ ఆధ్వర్యంలో నడిచే హోమియో వైద్యశాల ఉంది.
గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం
ఈ గ్రామములో 15,000 మందికి దాహార్తిని తీర్చే రక్షిత మంచినీటి చెరువు ఉంది.
గ్రామ పంచాయితీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ శీలి రాము, 111 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.[2] ఈ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం శిధిలావస్థకు చేరడంతో, నూతన భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిదులు మంజూరయినవి. దీనిలో 13.5 లక్షలు ప్రభుత్వ నిధులు, 1.5 లక్షలు పంచాయతీ నిధులు, మిగతా 5 లక్షలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు. ఈ నిధులతో నూతన భవన నిర్మాణం చేపట్టినారు. [22]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
ఈ గ్రామంలో వేంచేసియున్న తలశిలవారి గంగానమ్మ జాతరమహోత్సవాలు. 2014,మే-25 ఆదివారం, 26 సోమవారం, రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయం వద్ద జాతర నిర్వహించి, అనంతరం అమ్మవారి ఘటాలతో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి తెల్లవార్లూ, అమ్మవారిని అశ్వవాహనంపై ఊరేగించారు. సోమవారం ఉదయం పోతురాజుస్వామివారికి చద్ది నైవేద్యం, గంగానమ్మ తల్లికి పాలపొంగళ్ళు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన తలశిల వంశస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. [3]
శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక జాతర మహోత్సవం, 2014, జూలై-19 శనివారం నాడూ మరియూ 20వ తేదీ ఆదివారం నాడు, ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించగా, స్వామివారి ఘటాలకు అడుగడుగునా వార పోయుచూ మహిళలు స్వాగతం పలికినారు. ఆదివారం నాడు ఆలయం వద్ద చద్ది నైవేద్యాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9 గంటల నుండి, భక్తులు పెద్ద సంఖ్యలో చద్ది నైవేద్యాలతో ఆలయానికి తరలివచ్చి, స్వామివారికి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. [4]
శ్రీ ప్రసన్న గణపతి ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక నవరాత్రులు, 58 సంవత్సరాల నుండి, ప్రతి సంవత్సరం 18 నుండి 23 రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసే నవరాత్రి పందిరిలో, ప్రతి నిత్యం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐకమత్యంతో నిర్వహించెదరు. ఈ పందిరి ఎంతోమంది హరికథా భాగవతార్లకు, బుర్రకథ కాళాకారులకూ ప్రోత్సాహానిచ్చుచూ ముందుకు సాగుచున్నది. రాష్ట్రంలోనే ప్రముఖ హరికథా విద్వాంసులైన శ్రీ అమ్ముల విశ్వనాథం, శ్రీ కడలి వీరదాసు, శ్రీమతి ఎం.లలితకుమారి, శ్రీ కోట సచ్చిదానందశాస్త్రి తదితరులు నాగాయలంక పందిరిలో తమ హరికథా గానాన్ని అందించడం గౌరవంగా భావించెదరు. బుల్లితెర, సినిమాల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ, నేటికీ ఇక్కడ నిర్వహించే హరికథ, బుర్రకథలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. వీటికితోడు, సామూహిక కుంకుమపూజలు, సామూహిక సరస్వతీ వ్రతాలు, అనఘాష్టమి వ్రతాలు మొదలగు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పందిరిలో ప్రతి నిత్యం జరగడం ఇక్కడి ప్రత్యేకత. [5]&[14]
శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం
- ఈ అలయం నాగాయలంకలో, కృష్ణానది ఒడ్డున వేంచేసియున్న రామపాదక్షేత్రంలో ఉంది.
- ఈ అలయంలో, 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు కార్తీకమాస పూజలను పునఃప్రారంభించారు. [7]
- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణం, 2016,మే-21వ తేదీ శనివారం, వైశాఖ పౌర్ణమినాడు కన్నులపండువగా నిర్వహించారు. [19]
శ్రీ రామపాద క్షేత్ర ఆలయాలు
నాగాయలంక లాంచీలరేవద్ద ఉన్న శ్రీ రామపాద క్షేత్రంలోని ఈ పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం, 50 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టబోవు పనులకు, 2015,నవంబరు-20వ తేదీ శుక్రవారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు:- [15]
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
ఈ ఆలయ ప్రాంగణంలో, శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి జీవ శిల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు ప్రారంభమైనవి. సాయంత్రం 6 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణలమధ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి అంకురార్పణ చెసినారు. ఈ సందర్భంగా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో, 10 మంది వేదపండితులు, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అజస్ర దీపారాధన, రక్షాబంధనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 10వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు అగ్నిమథనంతో శాంతిహోమం, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. మహిళలు స్వామివారిని జాలాధివాసానికి ఊరేగింపుగా తీసుకొనివెళ్ళినారు. 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ
శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం
శ్రీ శివనాగరాజస్వామివారి ఆలయం
నాగాయలంక మండలపరిధిలోని మర్రిపాలెం-నంగేగడ్డ శివారు, శివనాగపురంలో వేంచేసియున్న ఈ ఆలయ 24వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని, 2015,మే నెల-14వ తేదీ గురువారంనాడు, శివపార్వతీ కళ్యాణం, వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [8]
శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆలయం
నాగాయలంక గ్రామములోని సబ్బినేనివారి ఇలవేలుపు శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పటాలను నాగాయలంకలో గ్రామోత్సవం నిర్వహించి, ఆదివారం రాత్రి, సబ్బినేనివారి గృహాలనుండి, అమ్మవారి సారెలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పలువురు సబ్బినేని కుటుంబీకులు పాల్గొన్నారు. [9]
శ్రీ దుర్గామాత ఆలయం
ఈ ఆలయం స్థానిక లాంచీల రేవు వద్ద ఉంది.
ఏకలవ్యుని విగ్రహం
నాగాయలంక గ్రామములో, 2017,జూన్-29న ఏకలవ్యుని విగ్రహం ఆవిష్కరించినారు. [23]
గ్రామంలోని ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
నాగాయలంక ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, మత్స్య సాగు మీద అధారపడి జీవిస్తున్నారు.
గ్రామములో జన్మించిన ప్రముఖులు
- మండలి బుద్ధ ప్రసాద్
- కీ.శే.కావూరి వెంకటరామయ్య:- వీరు ఉపాధ్యాయులుగా పనిచేయుచూనే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. వీరి సతీమణి శ్రీమతి కావూరి సావిత్రమ్మ కృషి గూడా అమోఘం. ఆ ఉద్యమంలో మహిళలను కలుపుకొని ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అంతటి పోరాటం చేసి గూడా ఆమె ఎలాంటి ప్రచారాన్నీ కోరుకోలేదు. [13]
- తలశిల ప్రభాకరరావు:- ఈ గ్రామంలో జన్మించిన వీరు, స్వశక్తితో వ్యాపరవేత్తగా ఎదిగి, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పలు వ్యాపారాలు నిర్వహించుచూ, ఎంతోమందికి జీవనోపాధి కలిగించుచున్నారు. వీరు రెండుదశాబ్దాల క్రితమే గ్రామాన్ని వీడినా స్వగ్రామంపై మక్కువతో, గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినారు. మొదటగా గ్రామంలోని పాఠశల ఆవరణలో 45 లక్షలు వెచ్చించి ఒక అడిటోరియం నిర్మించుచున్నారు. ఇదిగాక, తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రామములో ఏర్పాటు చేయుచున్న కళ్యాణమంటపం నిర్మాణానికి తన నాయనమ్మ, తాతయ్యల పేరుమీద 32 లక్షల రూపాయలను విరాళంగా అందజేసినారు. [18]
గ్రామ విశేషాలు
- దివిసీమలో నాగాయలంక ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం.
- శ్రీ మేడా శివనాగప్రసాదు :- నాగాయలంక గ్రామానికి చెందిన వీరు, గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన బ్యాండ్ మింటను పోటీలకు మ్యాచ్ కంట్రోలరుగా, విశ్లేషకుడిగా వ్యవహరించారు. తాజాగా ఈయన 2015,ఫిబ్రవరి-25 నుండి నెదర్లాండు దేశంలో నిర్వహించే డచ్-జెర్మన్ ఓపెన్ పోటీలకు విశ్లేషకుడిగా నియమింపబడినారు. [7]
- శ్రీ తలశిల జనార్ధనరావు :- ఈ గ్రామానికి చెందిన వీరు రాజమండ్రి, నాగాయలంక ప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. హైదరాబాదులోని మియపూర్ కేంద్రంగా పనిచేయుచున్న "ధర్మపురి క్షేత్ర ట్రస్ట్ బోర్డ్" అను సంస్థ, వీరికి కర్షకరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలనుండి 108 మంది రైతులను ఈ పురస్కారానికి ఎంపికచేయగా, వారిలో శ్రీ జనర్ధనరావు ఒకరు. ఈ పురస్కారాన్ని వీరికి, మాజీమంత్రి శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు మరియు ట్రస్టీ శ్రీమతి జి.సత్యవేణిల చేతులమీదుగా అందించారు. [16]
- సబ్బినేని మేఘన :- నాగాయలంక గ్రామానికి చెందిన శ్రీ సబ్బినేని శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నంలోని ఎన్.టి.టి.పి.ఎస్.లో ఎ.డి.యి.గా విధులు నిర్వహించుచున్నారు. వీరి కుమార్తె మేఘన, క్రికెట్టులో శిక్షణ పొంది ఆ క్రీడలో రాణించుచున్నది. తాజాగా ఈమె ఇంటర్ స్టేట్ మీట్ లో పాల్గొని తన ప్రతిభతో ఐదు సెంచరీలు చేసి, భారత మహిళా క్రికెట్టు జట్టులో స్థానం సంపాదించింది. ఇంతవరకు వి.స్నేహదీప్తి మరియు ఆర్.కల్పన అను ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారత మహిళా క్రికెట్టు జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈమె, ఆ ఘనత సాధించిన మూడవ క్రీడాకారిణి. [20]
- శ్రీ మండవ వెంకటరామయ్య ఛారిటబుల్ ట్రస్ట్ :- శ్రీ మండవ బాబూరావు, ఈ ట్రస్ట్ అధ్యక్షులు. ఈ ట్రస్ట్ తరఫున వీరు ఈ గ్రామంలో వేసవికాలంలో, 11 సంవత్సరాల నుండి వరుసగా చలివేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇంతేగాక వీరు ఈ గ్రామాభివృద్ధికోసం పలు సేవాకార్యక్రమాలను నిర్వహించుచున్నారు. [21]
- మత్స్య వనరుల కేంద్రం గుంటూరు కృష్ణా జిల్లాల మత్స్యకారులకు ప్రయోజనకారిగా ఉండేటందుకు వీలుగా నాగాయలంకలోని పడవల రేవువద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేసేటందుకు అధికారులు ప్రతిపాదనలు పంపినారు. ఈ కేంద్రానికి తరచుగా పెద్ద బోట్లు వస్తున్న విషయాన్ని పరిగణనలోనికి తీసికొని ఇక్కడ జలవనరుల కేంద్రాన్ని మరియు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావించుచున్నారు. పడవలరేవు సమీపంలోనే ఐస్ పరిశ్రమలు, కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ఏరాటై ఉన్నందున మినీ హర్బర్ తరహాలో ఈ రెండు కేంద్రాలను ఏర్పాటుచేయాలని భావించుచున్నారు. [24]
నాగాయలంక మండలంలోని గ్రామాలు
- పెద్దకమ్మవారిపాలెం
- చిన కమ్మవారిపాలెం
- భావదేవరపల్లి
- చోడవరం (నాగాయలంక మండలం)
- ఎదురుమొండి
- ఏటిమొగ
- గణపేశ్వరం
- కమ్మనమోలు
- నాగాయలంక
- నంగేగడ్డ
- పర్రచివర
- టి.కొత్తపాలెము
- తలగడదీవి
- పెదపాలెం(నాగాయలంక)
- వక్కపట్లవారిపాలెం
- బ్రహ్మానందపురం
- సొర్లగొంది
- పుల్లయ్యగారిదిబ్బ
- మర్రిపాలెం(నాగాయలంక)
- సంగమేశ్వరం(నాగాయలంక)
- రేమాలవారిపాలెం
- నాచుగుంట
- ఈలచెట్లదిబ్బ
- గుల్లలమోద
- శివనాగపురం
- డేగలవారిపాలెం
- దిండి(నాగాయలంక)
- బర్రంకుల
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1. | భావదేవరపల్లి | 895 | 3,418 | 1,788 | 1,630 | ||||||
| 2. | చోడవరం (నాగాయలంక మండలం) | 328 | 1,145 | 603 | 542 | ||||||
| 3. | ఎదురుమొండి | 1,815 | 6,482 | 3,353 | 3,129 | ||||||
| 4. | ఏటిమొగ | 1,383 | 4,928 | 2,543 | 2,385 | ||||||
| 5. | గణపేశ్వరం | 1,405 | 5,217 | 2,641 | 2,576 | ||||||
| 6. | కమ్మనమోలు | 1,262 | 4,552 | 2,352 | 2,200 | ||||||
| 7. | నాగాయలంక | 2,680 | 9,974 | 5,088 | 4,886 | ||||||
| 8. | నంగేగడ్డ | 1,113 | 3,899 | 1,903 | 1,996 | ||||||
| 9. | పర్రచివర | 1,185 | 4,122 | 2,086 | 2,036 | ||||||
| 10. | టి.కొత్తపాలెము | 1,746 | 6,492 | 3,266 | 3,226 | ||||||
| 11. | తలగడదీవి | 325 | 1,250 | 624 | 626 | 12. | Tungalavaripalem (east) |
- గణాంకాలు జనాభా (2001) - మొత్తం 51,479 - పురుషులు 26,247 - స్త్రీలు 25,232
వనరులు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Nagayalanka". Retrieved 27 June 2016. External link in
|title=(help) - ఈనాడు కృష్ణా/అవనిగడ్డ ఆగష్టు 1, 2013. 2వ పేజీ.
- 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
వెలుపలి లింకులు
[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-27;2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జులై-23; 3వ≤పేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-15; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-26; 2వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-24; 16వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-15; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-25; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-10; 2వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-30; 1వపేజీ. [12] ఈనాడు కృష్ణా; 2015,జులై-14; 15వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-16; 3వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-16; 3వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-21; 42వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2016,జనవరి-2; 40వపేజీ. [18] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 44వపేజీ. [19] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-22; 2వపేజీ. [20] ఈనాడు అమరావతి; 2016,నవంబరు-2; 10వపేజీ. [21] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మార్చి-27; 2వపేజీ. [22] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-24; 1వపేజీ. [23] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-30; 1వపేజీ. [24] ఈనాడు అమరావతి; 2017,జులై-21; 8వపేజీ.


