నసీరుద్దీన్ షా

నసీరుద్దీన్ షా (జులై 20 1949 లేదా 1950 ఆగస్టు 16[1] ఒక ప్రముఖ భారతీయ నటుడు, మరియు దర్శకుడు. ఆయన మూడు నేషనల్ అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. నటనా రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

నసీరుద్దీన్ షా
2011 లో నసీరుద్దీన్ షా
జననంనసీరుద్దీన్ షా
(1949-07-20) 1949 జూలై 20
or (1950-08-16) 1950 ఆగస్టు 16
బారాబంకీ, ఉత్తరప్రదేశ్
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, పర్యావరణవేత్త
క్రియాశీలక సంవత్సరాలు1972–ప్రస్తుతం
పేరుతెచ్చినవికర్మ (సినిమా),మీర్జా గాలిబ్ (1989) ది పర్ఫెక్ట్ మర్డర్, ఎ వెన్స్ డే, సర్ఫరోష్, ఖుదా కేలియే, మాన్ సూన్ వెడ్డింగ్, మసూమ్,జిందా భాగ్, ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జెంటిల్మన్, ఇక్బాల్
మతంఇస్లాం
జీవిత భాగస్వామిపర్వీన్ మురాద్ (మనారా సిక్రీ - చనిపోయింది)
రత్నా పాఠక్ (1982–ప్రస్తుతం)
పిల్లలుహీబా షా
ఇమాద్ షా
వివాన్ షా
బంధువులుజమీరుద్దీన్ షా (సోదరుడు)
దీనా పాఠక్ (అత్త)
సుప్రియా పాఠక్ (మరదలు)
మహమ్మద్ ఆలీ షా (మేనల్లుడు)
పురస్కారాలుపద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారం, జాతీయ సినిమా పురస్కారం
సంతకం
దస్త్రం:Naseeruddin Shah Signature.jpg

జీవిత విశేషాలు

నసీరుద్దీన్ షా ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ అనే ఊళ్ళో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన 19వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ సేనాధిపతి జాన్ ఫిషాన్ ఖాన్ వంశంలో జన్మించాడు. జాన్ ఫిషాన్ మొట్ట మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నాడు. అంతేకాక 1857 లో జరిగిన మొదటి సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంలో ఆంగ్లేయులకు సహకరించాడు.[2] సెయింట్ ఆన్సెల్మ్ అజ్మీర్ పాఠశాలలో షా తన ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత నైనిటాల్ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదివాడు. 1971 లో ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందాడు.

షా బాలీవుడ్ పరిశ్రమలోనే కాక, సమాంతర సినిమాలోనూ విజయవంతం అయ్యాడు. అంతర్జాతీయ సినిమాల్లో కూడా నటించాడు. ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జెంటిల్మన్ అనే సినిమాలో ఆయన పోషించిన కెప్టెన్ నీమో ఆయనకు పేరు తెచ్చిన పాత్ర.

ఆయన అన్న రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ప్రస్తుతం ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సిలర్. జమీరుద్దీన్ షా కొడుకు మహమ్మద్ ఆలీ షా ఒక నటుడు.[3]

మూలాలు

  1. Shah, Naseeruddin (2014). And then one day: A memoir. Hamish Hamilton. p. 1. ISBN 978-0670087648.
  2. Obituary of Idries Shah, The Independent (London) of 26 November 1996.
  3. "Bbuddah Hoga Terra Baap – Audience Reviews .. Must Watch .. :) | NG". Naachgaana.com. Retrieved 22 October 2012.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.