నవరత్నములు
రాళ్ళకు సంబంధితమైనవి ఈ నవరత్నాలు.
నవరత్నములు, అర్థము
నవరత్నములు అనగా తొమ్మిది రత్నములు అని అర్థము. ప్రాచీనకాలములో రాళ్ళలో తొమ్మిది పేరు గాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు. కాలక్రమములో, నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమయిన సమూహాలకు లేదా వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడటము మొదలుపెట్టారు.
మరిన్ని
విక్రమాదిత్యుని నవరత్నాలు
ప్రాచీన భారతదేశ చరిత్రలో నవరత్నములు అనగానే గుర్తుకు వచ్చేది, చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని తొమ్మండుగురు కవులు. వీరు నవరత్నములుగా కీర్తింపబడ్డారు. వీరు,
- ధన్వంతరి
- క్షపణకుడు
- అమరసింహుడు
- శంకభట్టు
- వేతాళభట్టు
- ఘటకర్పరుడు
- వరాహమిహిరుడు
- వరరుచి
- కాళిదాసు వీరందరిలోనూ పేరెన్నికగన్నవాడు.
అక్బరు నవరత్నాలు
- అబుల్ ఫజల్ - అక్బర్ ప్రధాన సలహాదారుడు, మరియు అక్బర్ నామా గ్రంథ రచయిత.[1]
- ఫైజీ - అక్బర్ ఆస్థాన కవి.
- తాన్ సేన్ - సాంప్రదాయక ప్రసిద్ధ సంగీతకారుడు.
- బీర్బల్ - వైతాళికుడు.
- రాజా తోడర్‌మల్- అక్బరు యొక్క ఆర్థిక మంత్రి.
- రాజా మాన్‌సింగ్- కఛ్వా రాజపుత్రుడు, జైపూర్ కు చెందిన అంబర్ రాజు. అక్బర్ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.
- అబ్దుల్ రహీమ్ ఖాన్ ఎ ఖానా- అక్బర్ అంగరక్షకుడు, పెంచి పోషించిన వాడు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన బైరం ఖాన్ యొక్క కుమారుడు.
- ఫకీర్ అజియుద్దీన్ - అక్బర్ ఆధ్యాత్మిక సలహాదారుడు.
- ముల్లా దోపియాజా - సలహాదారుడు.
ఆధునిక నవరత్నములు
భారత ప్రభుత్వము ప్రభుత్వరంగములో అత్యధిక ఉత్పాదన, పనితనము గల తొమ్మిది సంస్థలను నవరత్నములు గా వ్యవహరించినా, కాలక్రమములో వాటి సంఖ్యను తొమ్మిదిని మించి పెంచటం వల్ల ఇక వాటిని నవరత్నములు అని వ్యవహరించటములో అర్థము లేదు.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.