నల్లమల అడవులు

నల్లమల (ఆంగ్లం : The Nallamalais) (సాహిత్యపరంగా."నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల్ల శ్రేణి) ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదుజిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా మరియు కడప జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది మరియు పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి నల్లమల కొండలు అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు మరియు గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.[1]. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.[2]. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.

నల్లమలై కొండలు
నల్లమల
Range
The Nallamalas near Bogada. The remains of the Dorabavi Viaduct are also seen.
దేశం భారతదేశం
Provinces/States ఆంధ్ర ప్రదేశ్
Highest point భైరానీ కొండ (శిఖరేశ్వరం)
 - ఎత్తు 3,047 ft (929 m)
 - ఆక్షాంశరేఖాంశాలు 15°40′41″N 78°47′10″E
పొడవు 90 mi (144.84 km), ఉత్తర-దక్షిణ
Period ప్రోటోజోయిక్
గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు
కడపవైఎస్ఆర్ జిల్లా జిల్లాలో నల్లమల అడవులు

భూగర్భ శాస్త్రము

నల్లమల శ్రేణులలోని రాళ్ళు కడప జిల్లాలో దాదాపు 20,000 అడుగుల మందాన్ని కలిగివున్నవి.[3]. ఈ రాళ్ళలో ప్రాథమికమైనది క్వార్‌జైట్, ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో ఉంది. సాండ్ స్టోన్ కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.[2]

వాతావరణం

ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా, వెచ్చని మరియు వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. సరాసరి వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే.ను కలిగి ఉన్నాయి. ఈ అడవుల వర్షపునీరు గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి.

భౌగోళికం మరియు నేల ఉపయోగం

ఈ కొండలు దాదాపు అడవులతో నిండివున్నాయి. ఈ అడవులలో వృక్షసంపదను పెంచలేకపోవడానికి కారణ నీటి కొరత. వ్యవసాయం దాదాపు కనుమరుగు. కొన్ని పల్లెటూర్లవద్ద వ్యవసాయం కానవస్తుంది. ఈ అటవీ ప్రాంతం శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది.[4].

మానవ జీవనం

నీటికొరత కారణంగా జనజీవనం అత్యల్పం. ఈ ప్రాంతంలో నగరాలు పట్టణాలు వెలవక పోవడానికి కారణం ఇదే. ఈ ప్రాంతంలో కంభం పట్టణం పెద్దది.

ఈ ప్రాంతంలో అటవిక తెగలు : చెంచులు నివసిస్తున్నారు.

రవాణా

నల్లమల అడవులలో రైల్వేలైను

రాష్ట్ర ప్రధాన రహదారి విజయవాడ-గుంతకల్లు పోతున్నది. దక్షిణ మధ్య రైల్వే ఈ కొండల మార్గం గుండా పోతున్నది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి కూడా ఈ అడవుల పశ్చిమ భాగం నుంచి వెళుతుంది.

రాజీవ్ అభయారణ్యం

నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరప్ అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.[5] 2009 సెప్టెంబర్ 2 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి రాజశేఖరరేడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.అయిదుగురు ప్రముఖుల ప్రాణాలు బలిగొన్న రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలో నల్లమల అడవుల్లో ఉంది.హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి పావురాలగుట్ట మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది. [[దస్త్రం:Srisailam Tiger reserve sign board.jpg|thumbnail|శ్రీశైలం టైగర్ రిజర్వ్ సూచన kurnool to guntur

__SUB_LEVEL_SECTION_6__

ప్రధాన సంఘటనలు

  • గతంలో కొందరు శివస్వాములు శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోతే హెలికాప్టర్ ద్వారా గాలించారు.
  • 2004 లో నక్సలైట్లు ( మావోయిస్టులు ) ను చర్చలకు ప్రభుత్వం పిలిస్తే ఈ అడవుల్లోనుంచే వచ్చారని చెబుతారు.
  • సెప్టెంబర్ 2, 2009న ఉదయం గం.9.35 ని.లకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.[6] హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన పావురాలగుట్ట (చింతగుండం) ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.ఇక్కడ ఒక భారీ స్మారక స్తూపాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీర్మానించింది.

చూడదగ్గ ప్రదేశాలు

  • శ్రీశైలం : కృష్ణా నది ఒడ్డున గల శ్రీశైలం ప్రాజెక్టు.
  • శ్రీశైల క్షేత్రం
  • గుండ్ల బ్రహ్మేశ్వర శిఖరం. జలపాతం. నెమలిగుండం. ఒంకారమ్. రుద్రకోడూరు. పావురాలగుట్ట (చింతగుండం)
  • ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్ళే మార్గములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత నేత డా:వైయస్ రాజశేకరరెడ్డి గారి జ్ఞాపకార్ధం నల్లకలువ గ్రామానికి సమీపంలో వైయస్ఆర్ స్మృతివనాన్ని నిర్మించినది ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశము

చిత్ర మాలిక

ఇవీ చూడండి

పాద పీఠికలు

  1. Google Earth
  2. http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_352.gif
  3. http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&_udi=B6VBP-4PYP76S-2&_user=10&_rdoc=1&_fmt=&_orig=search&_sort=d&view=c&_acct=C000050221&_version=1&_urlVersion=0&_userid=10&md5=ea1dd8438e3952865906a9f66118e761
  4. Kenneth Anderson: The Call of the Wild; The Black Panther of Sivanipalli
  5. సాక్షి దినపత్రిక, తేది. 03-09-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 04-09-2009
__SUB_LEVEL_SECTION_16__
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.