నర్సీపట్నం

నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]. సముద్రపు ఒడ్డున లేక పోయినా ఈ ఊరు పేరు చివర 'పట్నం' ఉండటం గమనార్హం. ఈ ఊరు తప్ప తూర్పు కోస్తాలో ఉన్న 'పట్నాలు' అన్నీ సముద్రపుటొడ్డున ఉన్నవే.నర్సీ పట్నం నుండే ఎటు వెళ్ళినా ఏజన్సీ యే వస్తుంది కాబట్టి 'గేట్ వే ఆఫ్ ఏజన్సీ'గా పిలవబడుతూ ఉంది. చారిత్రక విషయంలో పట్నం లోని పోలీస్ స్టేషను 1922 ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టడం అదే పోలీస్ స్టేషను ఇప్పటికి గుర్తుగా ఉంది. పెద్దగా మార్పులు చేయ లేదు. బ్రిటిష్ కాలం నాటి తాలుకా ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ లు చారిత్రక చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. సివిల్ సర్వెంట్స్ గా ఉన్న అనేక మంది ప్రసిద్దులకు ప్రారంభం ఇక్కడే కావడంతో సివిల్ సర్వెంట్స్ పై ఉపమన్యు చటర్జీ వ్రాసిన ఇంగ్లీష్ ఆగస్టు నవలను సినిమా తీయడం ఇక్కడే జరిగింది.

నర్సీపట్నం రోడ్ రైల్వేస్టేషను

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.నర్సీపట్నం ఊరికి, నర్సీపట్నం రోడ్డు రైలు స్టేషనుకూ దరిదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ రెవెన్యు డివిషనల్ ఆఫీసు ఉండేది. అందుకని మద్రాసు-హరా రైలు మార్గంలో వెళ్ళే మెయిలుబండి నర్సీపట్నంరోడ్డు స్టేషనులో తప్పకుండా ఆగేది. ప్రస్తుతం ఒక బస్సు కాంప్లెక్స్ ఉంది.

శాసనసభ నియోజకవర్గం

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 91,612 - పురుషులు 44,655 - స్త్రీలు 46,957

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.