నర్మద (జిల్లా)
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ...నర్మదా జిల్లా (గుజరాతీ: નર્મદા જીલ્લો) ఒకటి. రాజ్పిప్ల పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,755 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 5,90,379. జిల్లాలోని 10.44% నగరప్రాంతంలో నివసిస్తున్నారు. నర్మదా (జిల్లా) ఉత్తర సరిహద్దులో వదోదరాజిల్లా, తూర్పు సరిహద్దులో మహారాష్ట్ర రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో తపిజిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో భారూచ్ జిల్లాలు ఉన్నాయి.[1] 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా నర్మదా జిల్లా అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో డాంగ్స్ జిల్లా మరియు పోర్‌బందర్ జిల్లాలు ఉన్నాయి.[2]

చరిత్ర
1997 అక్టోబరు 2 లో వదోదర జిల్లాలోని తిలక్వాడా తాలూకా మరియు భారూచ్ జిల్లాలోని నాందాద్, దెదియాపద మరియు సగ్బర తాలూకాలను కలిపి నర్మదా జిల్లా రూపొందించబడింది.[3]
విభాగాలు
- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : నాందాద్, సగ్బరా, దెదియపద, తిలక్వాడా మరియు గరుడేశ్వర్.
ఆర్ధికం
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నర్మదా జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 590,379,[2] |
| ఇది దాదాపు. | సోలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
| అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[6] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 528వ స్థానంలో ఉంది..[2] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 214 [2] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.77%.[2] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 960:1000 [2] |
| జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
| అక్షరాస్యత శాతం. | 73.29%.[2] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- "About District". Narmada District Panchayat.
- Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
line feed character in|quote=at position 16 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Wyoming 563,626
line feed character in|quote=at position 8 (help)
