నర్మదా నది
నర్మదా లేదా నేర్‌బుడ్డా మధ్య భారత దేశము గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర మరియు దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు తపతి నది మరియు మహి నది. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణుల పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య మరియు సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్ను చేరుతున్నది. నర్మద మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది.

| నర్మదా | |
| రేవా నది, శాకర్ణి నది | |
| నది | |
![]() జబల్పూరు వద్ద నర్మదా నదీ తీరం | |
| దేశం | భారతదేశం |
|---|---|
| ఉపనదులు | |
| - ఎడమ | బుర్హనేర్ నది, బంజర్ నది, షేర్ నది, శక్కర్ నది, దూధీ నది, తవా నది, గంజల్ నది, ఛోటా తవా నది, కుండీ నది, గోయ్ నది, కర్జన్ నది |
| - కుడి | హిరన్ నది, టెండోని నది, బర్నా నది, కోలార్ నది, మన్ నది, ఊరి నది, హత్నీ నది, ఒర్సాంగ్ నది |
| Source | నర్మదా కుండ్ |
| - స్థలం | అమర్ కంటక్, మధ్య ప్రదేశ్ |
| - ఎత్తు | 1,048 m (3,438 ft) |
| - అక్షాంశరేఖాంశాలు | 22°40′0″N 81°45′0″E |
| Mouth | ఖంబట్ సంధి (అరేబియా సముద్రం) |
| - location | భారూచ్ జిల్లా, గుజరాత్ |
| - ఎత్తు | 0 m (0 ft) |
| - coordinates | 21°39′3.77″N 72°48′42.8″E |
| పొడవు | 1,312 km (815 mi) సుమారు |
![]() నర్మదా నది ప్రవాహపు ప్రాంతాన్ని, ముఖ్య ఉపనదులను, పరీవాహక ప్రాంతాన్నీ సూచించే పటం.
| |

