నరసరావుపేట
నరసరావుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన పట్టణం.[1]
| నరసరావుపేట | |
| — పట్టణం — | |
![]() ఇస్కన్, నరసరావుపేట |
|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | గుంటూరు |
| మండలం | నరసరావుపేట |
| ప్రభుత్వము | |
| - మున్సిపల్ చెర్మెన్ | నాగవరపు సుబ్బరాయగుప్త |
| వైశాల్యము [2] | |
| - మొత్తం | 7.65 km² (3 sq mi) |
| జనాభా (2011)[1] | |
| - మొత్తం | 1,17,489 |
| పిన్ కోడ్ | 522601 |
| ఎస్.టి.డి కోడ్ | 08647 |
పట్టణ చరిత్ర
ఈ గ్రామం పేరు తొలుత అట్లూరు. 1797లో జమీందారు పెదగుండారాయణిం, తన కోట నిర్మాణం చేపట్టడంతో, అట్లూరు గ్రామ నిర్మాణానికి పడిన పునాది... అంచెలంచెలుగా 1915లో పురపాలక సంఘం ఆవిర్భావానికి దారితీసింది. అట్లూరుగా మొదలైన ప్రస్థానం "నరసింహారావుపేట"గా కొనసాగి, నరసరావుపేట"గా వాసికెక్కినది. నాటి కుగ్రామమే నేడు సకల సదుపాయాల పేటగా మారింది.[2]
సమీప గ్రామాలు
- గురవాయపాలెం,
- ఇస్సపాలెం
- రావిపాడు,
- లింగంగుంట్ల,
- కేసనపల్లె,
- జొన్నలగడ్డ
సమీప మండలాలు
రవాణా సౌకర్యాలు
ఈ పట్టణం మొత్తం రోడ్డు పొడవు 157.08 km (97.60 mi). [10] నరసరావుపేట బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ద బస్సులు నడుపుతున్నాయి. నరసరావుపేట రైల్వే స్టేషన్ నల్లపాడు-నంద్యాల విభాగంలో ఉంది.నరసరావుపేట రైల్వే స్టేషనును దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజెన్లో నిర్వహించబడుతుంది.
విద్యా సౌకర్యాలు
- యస్.యస్. & యన్ కళాశాల
- శ్రీమతి. కాసు రాఘవమ్మ & బ్రహ్మానందరెడ్డి కళాశాల
- నందమూరి బసవతారకం కళాశాల.
- ఎస్.వి.పి.ఎన్.సి.& కె.ఆర్. ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా సంస్థ. (డి.ఎడ్.కళాశాల), పల్నాడు రోడ్.
- కృష్ణవేణి డిగ్రీ కాలేజీ,
- కృష్ణవేణి ఇంజినీరింగ్ కాలేజీ ఫర్ విమెన్.
- మేదరమెట్ల అంజమ్మ & మస్తానరావు బీ.ఈ.డీ. కాలేజీ
సాగు/త్రాగునీటి సౌకర్యం
పట్టణానికి త్రాగు నీరు సమీపంలోని శాంతి నగర్ మంచినీటి చెఱువు నుండి పంపిణి జరుగుతుంది.నాగార్జున సాగర్ కుడి కాల్వ నుండి మంచినీటి చెఱువుకు సాగు నీరుతో నింపుతారు.
దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు
- త్రికోటేశ్వర స్వామి దేవాలయం:ఇక్కడకి సమీపంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి దేవాలయం12 కి మీల దూరంలో ఉంది. ఆ అలయంలో శివుడు త్రికొటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు.కొండ పైకి వెళ్ళే దారిలో మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి ఉంది.కొండ మీద గొల్లభామ గుడి ఉంది.పెద్ద శివుని విగ్రహం ఉంది. ప్రతి శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది.యెన్నొ ప్రభలు వస్తాయి.
- శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం:స్థానిక పాతూరులో, 11వ శతాబ్దిలో ప్రతిష్ఠించిన ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు, 2014,ఫిబ్రవరి-28న శిలాన్యాసం చేసి, ప్రారంభించారు. 2015 లో పూర్తి చేయాలని నిశ్చయించారు. ఈ ఆలయ శిల్పకళలో ద్రావిడ, చోళ రీతులకు విశిష్టస్థానం ఉంది. దేశంలోని పురాతన ఆలయాలన్నీ ఆయా శైలిలోనే నిర్మించారు. పూర్తిగా రాతితో ఆలయనిర్మాణం చేస్తున్నారు. అందుకుగాను బెంగళూరులో స్తంభాలు, ఇతర శిలలను తయారుచేస్తున్నారు. తెలుపు, గ్రే వర్ణాలు మిళితంగా ఉండే గ్రానైటు రాతిని నిర్మాణంలో ఉపయోగించుచున్నారు. ఆలయం పునాదులనుండి పైకప్పు వరకు రాతితోనూ, ఆపైన విమానశిఖరం తదితర నిర్మాణాలను సిమెంటుతోనూ తయారు చేస్తారు. పైకప్పు వరకు 15 పొరలుగా నిర్మాణం చేపట్టినారు. ఆలయం ఎత్తు 42 అడుగులు, పొడవు 52 అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం పైకప్పు వేసే స్థాయికి నిర్మించారు. కిటికీలు, ఆలయ రాతిగోడలకు అమర్చిన స్తంభాలు శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతున్నవి. తమిళనాడుకి చెందిన దేవాలయ నిర్మాణ నిపుణులు 10 మంది వరకు, ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్దేశించిన నియమాలు పాటించుచూ నిర్మాణం చేస్తున్నారు.[3]
- శ్రీ రాధా గోవిందచంద్ర మందిరం (ఇస్కాన్ మందిరం): స్థానిక బరంపేటలోని ఈ మందిరంలో, 2015,సెప్టెంబరు-21వ తేదీ సోమవారంనాడు, రాధారాణి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అ రోజున రాథారాణి నిజపాద దర్శనం, ఉదయం 8-30 నుండి రాత్రి వరకు, అనుమతించారు. సంవత్సరానికి ఒకరోజు మాత్రమే రాధారాణి నిజపాద దర్శనానికి అనుమతించడంతో, అ రోజున భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి విచ్చేసి, రాధాకృష్ణులను దర్శించుకున్నారు. మద్యాహ్నం భక్తులకు సంపూర్ణ ప్రసాద వితరణ చేసారు.
- శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ విజయ చాముండేశ్వరీ దేవస్థానం.
- శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగస్వామివారి ఆలయం.
- శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం.
- శ్రీ ఆయ్యప్పస్వామివారి ఆలయం సత్తెనపల్లి వెళ్లు రహదారిలో ఉంది.ఆలయం ముఖద్వారంతో నిర్మించారు.
- శ్రీ ప్రసన్నఆంజనేయస్వామివారి దేవాలయం.(బరంపేట).1932 నిర్మించబడింది.
పట్టణ ప్రముఖులు
- కొండా వెంకటప్పయ్య, (ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)
- అన్నాప్రగడ కామేశ్వరరావు, (ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)
- కాసు బ్రహ్మానంద రెడ్డి, (మాజీ ముఖ్యమంత్రి)
- నల్లపాటి వెంకట్రామయ్య, (ఆంధ్రరాష్ట తొలి శాసన సభాపతి)
- కోడెల శివప్రసాదరావు, (ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొలి శాసనసభాపతి)
- అనిసెట్టి సుబ్బారావు, (స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు సినిమా రచయిత)
- కె. వి. కె. రామారావు, సీనియర్ జర్నలిస్టు.
- ఏల్చూరి విజయరాఘవరావు, (ప్రముఖ సంగీతకారుడు
- నారాయణం నరసింహమూర్తి, (ప్రముఖ పర్యవరణ వేత్త)
- చిలకలపూడి సీతారామాంజనేయులు, (ప్రముఖ రంగస్థల,సినిమా నటుడు)
- ఏల్చూరి సుబ్రహ్మణ్యం (ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు)
- కోలవెన్ను రామకోటీశ్వరరావు, (ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)
- జొన్నలగడ్డ శ్రీరామమూర్తి, (సంగీత కళాకారుడు)
- కడియాల వేణుగోపాల్, (ఫిజియోథెరపీ నిపుణులు)
- నార్ల మారుతిబాబు, (రాజకీయ నాయకుడు)
పట్టణ విశేషాలు
- నరసరావుపేటను పలనాడుకు ముఖద్వారంగా అభివర్ణించారు. జిల్లా లోని నాలుగు రెవెన్యూ డివిజను కేంద్రాలలో ఇది ఒకటి. ఇది రెవిన్యూ మండలానికి కేంద్రం. వాణిజ్యకేంద్రంగా, విద్యా కేంద్రంగా జిల్లాలో ప్రముఖమైన స్థానం పొందింది. రాష్ట్ర రాజకీయాలకు ప్రసిద్ధి.
- ఈమధ్యనే పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలు (200 ఏళ్ళు) జరుపుకుంది.
- భారతదేశంలోకెల్లా పెద్ద లోక్‌సభ నియోజక వర్గాలలో నరసరావుపేట ఒకటి.
- నరసరావుపేట పురపాలక సంఘం, శత సంవత్సర వేడుకలను, 2015,డిసెంబరు -11,12,13 తేదీలలో జరిగాయి.[4]
మూలాలు
- "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- "Basic Information of Municipality". Municipal Administration & Urban Development Department. Government of Andhra Pradesh. Retrieved 20 June 2015.
- ఈనాడు గుంటూరు రూరల్; 2014,సెప్టెంబరు-21; 20వపేజీ
- "Narasaraopet Municipality 100 Years Celebrations in Guntur on 11,12,13th Dec".

