నత్తం
నత్తం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| నత్తం | |
|---|---|
![]() నత్తం Location in Tamil Nadu | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | విజయాసన పెరుమాళ్ |
| ప్రధాన దేవత: | వరగుణమంగై తాయార్ |
| దిశ మరియు స్థానం: | తూర్పు ముఖము |
| పుష్కరిణి: | అగ్నితీర్థం |
| విమానం: | అగ్నిహోత్రునకు |
| కవులు: | నమ్మాళ్వార్ |
| ప్రత్యక్షం: | విజయకోటి విమానం |
విశేషాలు
ఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడా పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళింగుడి" యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని కీర్తించారు.
సాహిత్యం
శ్లో. శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే:|
నాయక్యా వరగుణమంగై నామ సత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూప:|
విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచ: ప్రియ:|
సుజన సేవిత పాద సరోరుహ: విజయతే ధరణౌ విజయాసన:||
పాశురాలు
పా. పుళిజ్గుడిక్కిడన్దు వరగుణమంగై యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
తెళిన్ద వెన్‌శిన్దై యగజ్కழிయాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
నళిర్‌న్ద శీరులగమ్ మూన్ఱుడన్ వియప్ప; నాజ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
పళిజ్గునీర్ ముగిలిన్ పవళమ్బోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-4
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| విజయాసన పెరుమాళ్ | వరగుణమంగై తాయార్ | అగ్నితీర్థం | తూర్పు ముఖము | కూర్చున్న భంగిమ | నమ్మాళ్వార్ | విజయకోటి విమానం | అగ్నిహోత్రునకు |
మంచిమాట
భక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.
భగవంతుడు ప్రపన్నులను సంతోషింప చేయ ప్రయత్నించును
సూచన
తిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.
చేరే మార్గం
శ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము
