నగరి

నగరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1]. నగరి చిత్తూరు జిల్లాలోని ముఖ్యపట్టణం తిరుపతి 51 కి.మి దూరములో ఉంది. ఈ గ్రామము.[1]లో కరిక మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవత ఇతిహాస గజేంద్ర మోక్షం కథ ఇక్కడ జరిగినదని విష్ణువు ఇక్కడే గజ రాజుని మకరం బారి నుండి రక్షించాడనీ చెబుతారు. ఇక్కడ ఉన్న మాణిక్య స్వామి దేవాలయంలో ప్రత్యేకముగా జరిగే ఉత్సవాలు కంచి గరుడ సేవ, కనుమ, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవములు.

పట్టణ చరిత్ర

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. వీరాస్వామయ్య తాను విడిది చేసిన బుగ్గగుడి క్షేత్రం, పుత్తూరు పట్టణాలకు మధ్య ఈ నగరి మీదుగా ప్రయాణించారు. ఆ ప్రయాణంలో నగరి వద్దనే కొండ కనుమ దాటాలని ఆయన వ్రాశారు. నగరి పేట స్థలం (పట్టణం అని అర్థం) అని వర్ణించారు. ఆ పట్టణంలో 1830 నాటికే బాటసారులకు అవసరమైన అన్ని సామాన్లు కొనదొరికేవని తెలిపారు. ఆయన ప్రయాణం చేసే సమయంలో వెంకటేశ నాయుడి కుమారుడు గొప్ప సత్రము కట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు [2].


మూలాలు

బయటి లింకులు

నగరి గురించి తి.తి.దే. వారి సైటు నుండి

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.