నందుర్బార్
నందుర్బార్ మహారాష్ట్ర రాష్ట్రములోని వాయువ్య మూలన ఉన్న ఖాందేష్ ప్రాంతములోని ఒక జిల్లా. జిల్లా ముఖ్యపట్టణము నందుర్బార్. జిల్లా 5055 కి.మీ² మేర వ్యాపించి ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 13,11,709. అందులో 15.45% పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. నందుర్బార్ పట్టణము నుండి 30 కి.మీల దూరములో సుజ్లాన్ ఎనర్జీ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సామర్థ్యం కల గాలిమరల ఫార్మును నెలకొల్పుతున్నారు. ఇది ప్రపంచములోనే అతిపెద్ద గాలిమరల సముదాయము. ఇక్కడ స్థానికంగా గాలిమరల టవర్లను మరియు బ్లేడ్లను తయారుచేసేందుకు సుజ్లాన్ ఒక నిర్మాణసంస్థను నెలకొల్పింది.
| ?నందుర్బార్ మహారాష్ట్ర • భారతదేశం | |
![]() మహారాష్ట్రలో నందుర్బార్ జిల్లా యొక్క స్థానం | |
![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 21.228°N 74.1422°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 5,055 కి.మీ² (1,952 చ.మై) |
| ముఖ్య పట్టణము | నందుర్బార్ |
| తాలూకాలు | 1.షాహదా,2.నందుర్బార్,3.నవపూర్,
4.తలోదా,5.అక్కల్‌కువా,6.అక్రానీ |
| [[:వర్గం:{{{district}}} జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా • జనసాంద్రత • ఆడ-మగ నిష్పత్తి • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
13,09,135 (2001 నాటికి) • 260/కి.మీ² (673/చ.మై) • 975 • 46.63% • 55.11% • 37.93% |
| కోడులు • టెలిఫోను |
• +91-2564 |
| ISO abbreviation | IN-MH-NB |
| వెబ్‌సైటు: nandurbar.nic.in | |
తాలూకాలు
జిల్లాలో ఆరు తాలూకాలున్నవి. అవి అక్కల్‌కువా, అక్రానీ మహల్ (ధడ్‌గావ్ అని కూడా పిలుస్తారు. తలోదా, షాహదా, నందుర్బార్ మరియు నవపూర్. జిల్లాలో ఒక లోక్‌సభ నియోజకవర్గము ఉంది. అది నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గము. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ధూలే జిల్లాకు చెందిన సక్రి మరియు షిర్‌పూర్ నియోజకవర్గాలు కూడా భాగంగా ఉన్నాయి. జిల్లాలో నాలుగు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అక్కల్‌కువా, షాహదా, నందుర్బార్ మరియు నవాపూర్. నందుర్బార్ ప్రాథమికంగా ఆదివాసులుండే ప్రాంతం.
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to నందుర్బార్. |

