ధమ్మపదం
బౌద్ధ ధర్మ గ్రంథ సంపుటి అయిన త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం. ఈ గ్రంథము నాలుగు వందల ఇరవై మూడు గాథలలో బుద్ధుని బోధనలు సంక్షిప్త రూపములో ఉంది. ఈ గ్రంథము పూర్తిగా పద్యరూపంలో ఉంది. బుద్ధుని బొధనలు సమాన్య ప్రజలకు అర్ధమయ్యె విధంగ సరళమైన శైలిలో ఈ పద్యాలు ఉంటాయి. ముఖ్యంగా తెరవాద శాఖకు చెందిన బౌద్ధ మతవాదులు ఈ గ్రంథములోని పద్యాలు వేరు వేరు సందర్భాల్లో బుద్ధుడు స్వయంగా పలికినవని భావిస్తారు [1].
త్రిపిటకాలు బుద్ధుని కాలములోని సామాన్య జన బాహుళ్యానికి అర్ధమయ్యే పాళీ భాషలో రాయబడినవి. త్రిపిటకాలలో మొదటిదైన[2] సుత్తపిటకంలో బుద్ధుని ఉపదేశాలను, సంభాషణలను ఏర్చికూర్చారు[3]. సుత్తపిటకం దీఘనికాయ, మజ్జిమనికాయ, సంయుత్తనికాయ, అంగుత్తారనికాయ, ఖుద్దకనికాయ అనే ఐదు నికాయాలు ఉంది. ధమ్మపదం, ఖుద్దకనికాయానికి చెందిన పదిహేను గ్రంథాలలో[4] ఒకటి. ఈ గ్రంథంలో నాలుగు వందల ఇరవై మూడు పద్యాలు ఇరవై ఆరు వర్గాలలో ఉన్నాయి.
వర్గాలు
| 1. | యమక వర్గం |
| 2. | అప్రమాద వర్గం |
| 3. | చిత్త వర్గం |
| 4. | పుష్ప వర్గం |
| 5. | బాల వర్గం |
| 6. | పండిత వర్గం |
| 7. | అర్హత వర్గం |
| 8. | సహస్ర వర్గం |
| 9. | పాప వర్గం |
| 10. | దండ వర్గం |
| 11. | జరా వర్గం |
| 12. | ఆత్మ వర్గం |
| 13. | లోక వర్గం |
| 14. | బుద్ధ వర్గం |
| 15. | సుఖ వర్గం |
| 16. | ప్రియ వర్గం |
| 17. | క్రోధ వర్గం |
| 18. | మల వర్గం |
| 19. | ధర్మస్థ వర్గం |
| 20. | మార్గ వర్గం |
| 21. | ప్రకీర్ణక వర్గం |
| 22. | నిరయ వర్గం |
| 23. | నాగ వర్గం |
| 24. | తృష్ణా వర్గం |
| 25. | భిక్షు వర్గం |
| 26. | బ్రాహ్మణ వర్గం |
మూలాలు
- ""The Dhammapada: The Buddha's Path of Wisdom", translated from the Pali by Acharya Buddharakkhita, with an introduction by Bhikkhu Bodhi". Access to Insight. 29 August 2011. Retrieved 13 November 2013.
- "Sutta Pitaka". The Dhamma Encyclopedia. 28 August 2010. Retrieved November 13, 2013.
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- "Khuddaka Nikaya". Encyclopædia Britannica Online. 2013. Retrieved November 13, 2013.
