ధనూరాశి

Disambiguation

ధనూరాశి వారి గుణగణాలు

ధనూరాశి వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, విద్యలపట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి వింటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల అందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగిఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండీ సహాయము చేయ లేదన్న నింద భరించవలసి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకు ఏమి చేయలేక పోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్య లేరు. ఆత్మీయుల ప్రతిభా పాతవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించ లేరు. వారిని ఏ విధముగా ందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వర్గము వారితోనె బద్ధ వైరము ఏర్పడుతుంది. వారు మిమ్మలను ఆర్ధికముగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉనాయి అన్న వీరి భావన చెతకాని తనముగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా మీరు ఆదర్శముగా ఉండాలని విరు భావిస్తారు. మితో మమ్చిగావ్యవహరించి పనులు సాధించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించ లేని విషయముగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్ఠలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనము కొరకు ప్రాధెయ పడరు. ధనమె విరి చుట్టూ తిరగాలని అనుకుంటారు.ాద మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చుస్తారు. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలి వెస్తారు. స్వంత వారిని రక్షించే ప్రయత్నము చెయ్యరు. ఏ విషయములో అతిగా కలుగ చెసుకోరు. వీరి మాత దిక్కరిమ్చిన వారిని జీవిత కాలము శత్రులుగా భావిస్తారు. ఆత్మీయ బమ్ధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసు కోవడము ఇబ్బందిని కలిగిస్తాయి. వీరి సిద్ధాంతాల కారణంగా స్వమ్త వారు కొంత కాలము దూరము ఔతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహొదర, సహోదరీ వర్గానికి చెసే సహాయము విపరీతాలకు దారి తిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనూరాశి వారు మారక వారి సిద్ధామ్తాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎమ్పిక ఔతారు. సమాజములో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు, సేవ ఎమ్దరికో ఆదర్శము ఔతాయి. అందరికీ మంచి చెస్తారు దాదాపు అందరికీ మంచి ఔతారు. స్వమ్త వారికి మంచి చేసే అవకాసము ఉండదు కనుక వరికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చి దిద్దడములో విఫలము ఔతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశా కాలములో కళత్రముతో విబేధాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

ధనూరాశి కొన్ని జ్యోతిష విషయాలు

ధనస్సు రాశి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభరాశి, ద్విస్వభావ రాశి, అధిక శబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశి, రాత్రి వేళ బలము కల రాశి, పృష్టోదయ రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమ పరిమాణం కలిగిన రాశి, క్షత్రియ రాశిగా వ్యవహరిస్తారు. అల్ప సంతానం, ప్రకృతి ఉష్ణ ప్రకృతి, కాలపురుషుని శరీర భాగంలో తొడ భాగం, కపిల వర్ణం, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ గ్రహానికి అధిపతి గురువు. ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్ఛ, నీచాలను పొందదు.

  • ఈ రాశిలో నిరయన రవి దిసెంబర్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు.
  • ఈ రాశి విద్యాలయాలు, న్యాయస్థానములు, ధర్మస్థాపనలు, చర్చీలు, మసీదులు, శరణాలయాలు, సత్రములు మొదలైన దైవీక విద్యా సంబంధిత ప్రదేశాలను సూచిస్తుంది.
  • ఈ రాశి ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, మతభోదకులను మొదలైన వారిని సూచిస్తుంది.
  • ఈ రాశిలో జన్మించిన వారు పొడగరులుగా, వినయ సంపన్నత, పెద్దల ఎడ గౌరవ భావం, మంచి మైత్రీ భావం, శీఘ్రకోపం, ఉపన్యాసకులు, ఉపన్యాసకులుగా ఉంటారు.
  • ఈ రాశి వారికి పద మూడవ సంవత్సరంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.
  • ఈ రాశి జాతీయంగా కలకత్తా, గాంగ్ టక్, జోటార్ ఘాట్, డార్జిలింగ్, ఆలిపూర్, కృష్ణసాగర్, సాహిబ్ గాం, సిల్లి గురి, చుంచూరు మొదలైన ప్రదేశాలను సూచిస్తుంది.
  • ఈ రాశి అంతర్జాతీయంగా అస్ట్రేలియా, అరేబియా, అవిగ్నాస్, ఫిలిక్స్, హంగేరి, ఈటలీ, కొలోగ్న్, మొరాలియా, లిగూరియా, మడగాస్కర్, ఫ్రాన్స్ మొదలైన దేశాలను సూచిస్తుంది.
  • ఈ రాశి కీళ్ళ వాతం, వాతం, ఊపిరితిత్తుల వ్యాధి, నడుము నొప్పి, ఎముకలు చిట్లుట మొదలైన రోగములకు కారకత్వం వహిస్తుంది.

వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.