దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో

వైశాల్య క్రమంలో ప్రపంచ దేశాల జాబితా ( List of countries and outlying territories by total area) ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో స్వాధిపత్య దేశాలు, స్వతంత్ర పాలనాధికారం కలిగిన అధీన దేశాలు కూడా పరిగణించబడ్డాయి.

వైశాల్యం ప్రకారం దేశాలు

ఇక్కడ "మొత్తం దేశం వైశాల్యం" అంటే దేశంలో భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటి వాటి వైశాల్యం కూడా కలిపి లెక్కించబడింది. దేశంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాలు(సింధు శాఖలు), ఆర్థికంగా దేశానికి పరిమితమైన సముద్రభాగాలు మాత్రం లెక్కవేయలేదు. అలాగే అంటార్కిటికా భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధిపత్యాన్ని కూడా గణించలేదు. Swadesh

గమనిక:

  • భూగోళం మొత్తం ఉపరితల వైశాల్యం 510,065,284 చ.కి.మీ. — అందులో 70.8% అనగా 361,126,221 చ.కి.మీ. నీటి భాగం. మిగిలిన 29.2% అనగా 148,939,063 చ.కి.మీ. నేల.
  • ఐ.రా.స. లెక్కలలో పరిగణించిన స్వపరిపాలన గలిగిన అధీన "దేశాలు" కూడా చూపబడ్డాయి.
  • యూరోపియన్ యూనియన్ అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక "రాజకీయ సమూహం". ఆ ఒప్పందాల కారణంగా ఒక దేశానికి ఉండే లక్షణాలు ఈ సమూహానికి ఉన్నాయి. ఇందులో 27 సభ్య దేశాలున్నాయి. అన్నింటి మొత్తం వైశాల్యం 4,422,773 చ.కి.మీ. ఇది గనుక ఒక దేశమైతే ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద దేశం అవుతుంది.
ర్యాంకుదేశం / ప్రాంతంవైశాల్యం (చ.కి.మీ.)గమనిక
ప్రపంచం148,939,063మొత్తం భూతలం (నేల) మాత్రం
1 రష్యా17,098,2421991లో విడిపోకముందు సోవియట్ యూనియన్ వైశాల్యం 22,402,200 చ.కి.మీ.[1]
2 కెనడా9,970,610మొత్తం ఉపరితల వైశాల్యం 9,984,670 చ.కి.మీ. - Statistics Canada
3,4 (disputed) పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా9,598,0861 9,640,8212చైనా ప్రధాన భూభాగం, హాంగ్‌కాంగ్ (1,099 చ.కి.మీ.), మకావొ (26 చ.కి.మీ.). కలిపి. - తైవాన్, పెంఘు, కిన్ మెన్, మత్సు దీవులు మాత్రం కలపలేదు..

1 వివాదంలో ఉన్న భాగాలు మినహాయించి.
2 కాని చైనా అధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గం ఇందులో కలుపబడ్డాయి. ఈ ప్రాంతాలను తమ దేశానికి చెందినవని భారత దేశం) చెబుతుంది. తైవాన్ మినహాయించబడింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు9,629,09150 రాష్ట్రాలు, వాషింగ్టన్ డి.సి., ఇండియన్ రిజర్వేషన్ లు కలిపి.
5 బ్రెజిల్8,514,877వివిధ దీవులు కలిపి. . వీటి మొత్తం వైశాల్యం 365 చ.కి.మీ. (ప్రధాన భూభాగంలో 0.003% కంటే తక్కువ).
6 ఆస్ట్రేలియా7,741,220లార్డ్ హోవార్డ్, మకారీ దీవులు కలిపి. అంటార్కిటికా లోని 6,119,818 చ.కి.మీ. పై తాము చెప్పుకొనే అధికారాన్ని మినహాయించి..
7 భారత దేశం3,166,4141 3,287,26321 భారత దేశం అధీనంలో లేని కొన్ని వివాద భాగాలు మినహాయించి. (ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గభాగం, ఆజాద్ కాష్మీర్, మరి కొన్ని ఉత్తర భాగాలు) – అయితే చైనా తమవని చెప్పుకొనే అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ టిబెట్ మాత్రం ఈ భారత వైశాల్యంలో గణించబడింది. ). Census India.
2లో వివాద భూభాగాలు కలుపబడ్డాయి. ఆసియాలో రెండవ పెద్ద దేశం
8 అర్జెంటీనా2,780,400ఫాక్‌లాండ్ దీవులు, దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు, అంటార్కిటికా ప్రాంతం మాత్రం ఇందులో కలుపలేదు..
9 కజకస్తాన్2,724,900
10 సూడాన్2,505,813ఆఫ్రికాలో అతిపెద్ద దేశం
11 అల్జీరియా2,381,741ఆఫ్రికాలో రెండవ పెద్ద దేశం
12 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్2,344,858ఆఫ్రికాలో మూడవ పెద్ద దేశం
13 గ్రీన్‌లాండ్2,175,600డెన్మార్క్లో స్వపరిపాలన గల దేశం.
14 సౌదీ అరేబియా2,149,690
15 మెక్సికో1,958,201మెక్సికో-అమెరికా యుద్ధానికి ముందు వైశాల్యం (1846లో) 3,258,201 చ.కి.మీ.[2]
16 ఇండొనీషియా1,904,569
17 లిబియా1,759,540
18 ఇరాన్1,648,195
19 మంగోలియా1,564,116
20 పెరూ1,285,216
21 చాద్1,284,000
22 నైజర్1,267,000
23 అంగోలా1,246,700
24 మాలి1,240,192
25 దక్షిణ ఆఫ్రికా1,221,037వివిధ దీవులు కలిపి (Prince Edward Islands, Marion Island,).
26 కొలంబియా1,138,914కొలంబియా గణాంకాల లెక్క ప్రకారం 1,141,748 - నికరాగ్వాతో వివాదంలో ఉన్న భాగాలు కలిపితే.
27 ఇథియోపియా1,104,300
28 బొలీవియా1,098,581
29 మారిటేనియా1,025,520
30 ఈజిప్ట్1,001,449హలాబ్ త్రికోణం కలిపి.
31 టాంజానియా945,087మాఫియా, పెంబా, జాంజిబార్ దీవులు కలిపి.
32 నైజీరియా923,768
33 వెనిజ్వెలా912,050గుయానా ఎస్క్విబా కలిపితే 1,075,945 చ.కి.మీ. (29వ స్థానం).
34 నమీబియా824,292
35 మొజాంబిక్801,590
36 పాకిస్తాన్796,0951 880,25421 వివాద భాగాలు మిన్ాయించి.
2 కాని పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీరు భూభాగం (పాకిస్తాన్ ఆక్రమిత కాష్మీరు అనబడేది) కలిపి. .
37 టర్కీ783,562
38 చిలీ756,096వివిధ దీవులు కలిపి (Easter Island, Isla de Pascua,Rapa Nui, Isla Sala y Gómez).
39 జాంబియా752,618
40 మయన్మార్676,578
41 ఆఫ్ఘనిస్తాన్652,090
42 సోమాలియా637,657
43 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్622,984
44 ఉక్రెయిన్603,700పూర్తిగా యూరోప్‌కు చెందినవాటిలో అతిపెద్ద దేశం.
45 మడగాస్కర్587,041
46 బోత్సువానా581,730
47 కెన్యా580,367
48 ఫ్రాన్స్551,500మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ మాత్రం. ఓవర్సీస్ ప్రాంతాలు మినహాయించి. అన్నీ కలిపితే 674,843 చ.కి.మీ. అవుతుంది.
49 యెమెన్527,968ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ కలిపి.
50 థాయిలాండ్513,115
51 స్పెయిన్505,992చిన్న చిన్నవైన 17 స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగాలు కలిపి.
52 తుర్క్‌మెనిస్తాన్488,100
53 కామెరూన్475,442
54 పాపువా న్యూగినియా462,840
55 స్వీడన్449,964గోట్లాండ్, ఓలాండ్ కలిపి.
56 ఉజ్బెకిస్తాన్447,400
57 మొరాకో446,550పశ్చిమ సహారా మినహాయించి.
58 ఇరాక్438,317
59 పరాగ్వే406,752
60 జింబాబ్వే390,757
61 నార్వే385,155ఓవర్సీస్ విభాగాలు అయిన స్వాల్‌బార్డ్, జాన్ మేయెన్ కలిపి; బూవెట్ దీవి మినహాయించి. (అంటార్కిటికాలో నార్వే చెప్పుకునే భూభాగం కలిపితే ఇది 8వ పెద్ద దేశం అవుతుంది.).
62 జపాన్377,873వివిధ దీవులు కలిపి (Ryukyu Islands, Nansei Islands, Daito Islands, Ogasawara Islands, (Bonin Islands), Minami Torishima (Marcus Island), Okino-Torishima, Volcano Islands (Kazan Islands); దక్షిణ కురిల్ దీవులు మినహాయించి..
63 జర్మనీ357,022
64 కాంగో రిపబ్లిక్342,000
65 ఫిన్లాండ్338,145ఆలాండ్ కలిపి.
66 వియత్నాం331,689
67 మలేషియా329,847
68 ఐవరీ కోస్ట్322,463
69 పోలండ్312,685
70 ఒమన్309,500
71 ఇటలీ301,318
72 ఫిలిప్పీన్స్300,000
73 ఈక్వడార్283,561గలపఅగోస్ దీవులు కలిపి.
74 బుర్కినా ఫాసో274,000
75 న్యూజిలాండ్270,534వివిధ దీవులు కలిపి (Antipodes Islands, Auckland Islands, Bounty Islands, Campbell Island, Chatham Islands,Kermadec Islands) ; అయితే రోస్ డిపెండెన్సీ, టోకెలావ్ దీవులు మినహాయించి.
76 గబాన్267,668
77 పశ్చిమ సహారా266,000ఇందులో ఎక్కువ భాగం మొరాకో మిలిటరీ ఆక్రమణలో ఉంది.
78 గినియా245,857
79 యునైటెడ్ కింగ్‌‌డమ్242,900మినహాయించినవి: క్రౌన్ డిపెండెన్సీలు (768 చ.కి.మీ.), the 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు (17,027 చ.కి.మీ.), బ్రిటిష్ అంటార్కిటిక్ భూభాగం (1,395,000 చ.కి.మీ.).
80 ఉగాండా241,038
81 ఘనా238,533
82 రొమేనియా238,391
83 లావోస్236,800
84 గయానా214,969
85 బెలారస్207,600
86 కిర్గిజిస్తాన్199,900
87 సెనెగల్196,722
88 సిరియా185,180 183,885గోలాన్ హైట్స్ కలిపితే 185,180 చ.కి.మీ.
89 కంబోడియా181,035
90 ఉరుగ్వే175,016
91 సూరీనామ్163,820
92 టునీషియా163,610
93 నేపాల్147,181
94 బంగ్లాదేశ్143,998
95 తజకిస్తాన్143,100
96 గ్రీస్131,957
97 నికారాగ్వా130,000కొలంబియాతో వివాదం ఉన్న San Andrés y Providencia islands మినహాయించి.
98 ఉత్తర కొరియా120,538
99 మలావి118,484
100 ఎరిట్రియా117,600బద్మె ప్రాంతం కలిపి.
101 బెనిన్112,622
102 హోండూరస్112,088
103 లైబీరియా111,369
104 బల్గేరియా110,912
105 క్యూబా110,861కెరిబియన్ ప్రాంతంలో క్యూబా అతిపెద్ద, ఎక్కువ జనాభా గల దేశం
106 గ్వాటెమాలా108,889
107 ఐస్‌లాండ్103,000
108 దక్షిణ కొరియా99,538
109 హంగేరీ93,032
110 పోర్చుగల్91,982అజోరెస్, మదీరా దీవులు కలిపి.
111 ఫ్రెంచ్ గయానా90,000ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
112 జోర్డాన్89,342
113 సెర్బియా88,361కొసొవో కలిపి[3]
114 అజర్‌బైజాన్86,600స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నఖిచేవన్,నగొర్నొ-కరబఖ్ కలిపి.
115 ఆస్ట్రియా83,858
116 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్83,600
117 చెక్ రిపబ్లిక్78,866
118 పనామా75,517
119 సియెర్రా లియోన్71,740
120 ఐర్లాండ్70,273
121 జార్జియా (దేశం)69,700అబ్‌ఖజియా, దక్షిణ ఓస్సెషియా కలిపి
122 శ్రీలంక65,610
123 లిథువేనియా65,300
124 లాత్వియా64,600
125 టోగో56,785
126 క్రొయేషియా56,538
127 బోస్నియా & హెర్జ్‌గొవీనియా51,197
128 కోస్టారీకా51,100Isla del Coco కలిపి.
129 స్లొవేకియా49,033
130 డొమినికన్ రిపబ్లిక్48,671Saona Island, ఇతర అధీన భాగాలు కలిపి
131 భూటాన్47,000
132 ఎస్టోనియా45,100బాల్టిక్ సముద్రంలో 1,520 దీవులు .
133 డెన్మార్క్43,094డెన్మార్క్ ప్రధాన భూభాగం మాత్రం. ; డెన్మార్క్ రాజ్యంలోనే ఉన్న గ్రీన్‌లాండ్, ఫారో దీవులు కలిపితే డెన్మార్క్ వైశాల్యం 2,220,093 చ.కి.మీ. (13వ పెద్ద దేశం అవుతుంది.)
134 నెదర్లాండ్స్41,528నెదర్లాండ్స్ ప్రధాన భూభాగం మాత్రం. ; మొత్తం నెదర్లాండ్స్ రాజ్యం వైశాల్యం 42,437 చ.కి.మీ..
135 స్విట్జర్‌లాండ్41,284
136 చైనా రిపబ్లిక్ (తైవాన్) (Taiwan)36,188[4]తైవాన్ అధీనంలో ఉన్న దీవులు కలిపి.
137 గినియా-బిస్సావు36,125
138 మాల్డోవా33,851ట్రాన్స్‌నిస్ట్రియా (Pridnestrovie) కలిపి.
139 బెల్జియం30,528
140 లెసోతో30,355
141 అర్మీనియా29,800నగొర్నొ-కరబఖ్ మినహాయించి.
142 సొలొమన్ దీవులు28,896
143 అల్బేనియా28,748
144 ఈక్వటోరియల్ గునియా28,051
145 బురుండి27,834
146 హైతీ27,750
147 రవాండా26,338
148 మేసిడోనియా]25,713
149 జిబౌటి నగరం23,200
150 బెలిజ్22,966
151 ఇస్రాయెల్22,145 or 20,770వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ ఇందులో కలుపలేదు. గోలన్ హైట్స్ కలిపితే 22,145 అవుతుంది..
152 ఎల్ సాల్వడోర్21,041
153 స్లొవేనియా20,256
154 న్యూ కాలెడోనియా18,575ఫ్రెంచ్ డిపెండెన్సీ.
155 ఫిజీ18,274
156 కువైట్17,818
157 స్వాజిలాండ్17,364
158 తూర్పు తైమూర్14,874
159 బహామాస్13,878
160 మాంటినిగ్రో13,812[5]
161 వనువాటు12,189
162 ఫాక్‌లాండ్ దీవులు12,173యు.కె. ఓవర్సీస్ భూభాగం. Claimed by Argentina. Excludes దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు.
163 గాంబియా11,295
164 కతర్11,000
165 జమైకా10,991
166 లెబనాన్10,400
167 సైప్రస్9,251ఉత్తర సైప్రస్, అక్రోతిరి, ఢెకెలియా కలిపి.
168 పోర్టోరికో8,875అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇన్సులార్ ఏరియా.
169 పాలస్తీనా భూభాగాలు6,020వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ కలిపి (Gaza Strip).
170 బ్రూనై5,765
171 ట్రినిడాడ్ & టొబాగో5,130
172 కేప్ వర్డి4,033
173 ఫ్రెంచ్ పోలినీసియా4,000ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ.
174 సమోవా2,831
175 లక్సెంబోర్గ్ నగరం2,586
176 రియూనియన్2,510ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
177 కొమొరోస్2,235మాయొట్టి (373 చ.కి.మీ.) కలిపి. అలా కలుపకుంటే 1,862 చ.కి.మీ..[6]
178 మారిషస్2,040వివిధ దీవులు కలిపి (Agalega Islands, Cargados Carajos Shoals (Saint Brandon), Rodrigues island).
179 గ్వాడలోప్1,705ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్ - వివిధ దీవులు కలిపి (La Désirade, Marie Galante, Les Saintes, సెయింట్ బార్తెలిమీ, Saint Martin).
180 ఫారో దీవులు1,399డెన్మార్క్ లో స్వపరిపాలన గల ప్రాంతం.
181 మార్టినిక్1,102ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
182 సావొటోమ్ & ప్రిన్సిపె964
183 టర్క్స్ & కైకోస్ దీవులు948యు.కె. ఓవర్సీస్ భూభాగం. Area includes protected waters.
184 నెదర్లాండ్స్ యాంటిలిస్800నెదర్లాండ్స్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం. Bonaire, Curacao, Saba, Sint Eustatius,Sint Maarten కలిపి.
185 డొమినికా కామన్వెల్త్751
186 టోంగా747
187 కిరిబాతి726మూడు ద్వీప సమూహాలు కలిపి - Gilbert Islands, Line Islands, Phoenix Islands.
188 మైక్రొనీషియా702Pohnpei (Ponape), Chuuk Islands (Truk), Yap Islands, [Kosrae (Kosaie) కలిపి.
189 బహ్రయిన్694
190 సింగపూర్6832004 ఐ.రా.స. లెక్క. 2006 నాటి లెక్క 704 చ.కి.మీ. Department of Statistics, Singapore.
191 ఐల్ ఆఫ్ మాన్572యు.కె. క్రౌన్ డిపెందెన్సీ.
192 గ్వామ్549అ.సం.రా. unincorporated territory .
193 సెయింట్ లూసియా539
194 అండొర్రా468
195 ఉత్తర మెరియానా దీవులు464Commonwealth in political union with the USA; includes 14 islands including సైపాన్ (Saipan), Rota, and Tinian.
196 పలావు459
197 సీషెల్లిస్455
198 ఆంటిగువా & బార్బుడా442Includes Redonda, 1.6 చ.కి.మీ..
199 బార్బడోస్430
200 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్388
201 వర్జిన్ దీవులు(అ.సం.రా)347Unincorporated, organized territory of the USA.
202 గ్రెనడా344
203 మాల్టా316
204 మాల్దీవులు298
205 కేమెన్ దీవులు264యు.కె. ఓవర్సీస్ భూభాగం.
206 సెయింట్ కిట్స్ & నెవిస్261
207 నియూ260న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం..
208 సెయింట్ పియెర్ & మికెలాన్242ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; 8 చిన్న దీవులు కలిపి (Saint Pierre, Miquelon groups).
209 కుక్ దీవులు236న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం.
210 వల్లిస్ & ఫుటునా దీవులు200ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; (Île Uvéa, Wallis Island, Futuna Island, Alofi Island, ఇంకా 20 చిన్న దీవులు కలిపి).
211 అమెరికన్ సమోవా199అ.సం.రా.లో Unorganized, unincorporated territory; Rose Island, Swains Island కలిపి.
212 మార్షల్ దీవులు181Includes the atolls of Bikini, Enewetak, Kwajalein, మజురో (Majuro), Rongelap, and Utirik.
213 అరుబా180నెదర్లాండ్స్‌ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం.
214 లైకెస్టీన్160
215 బ్రిటిష్ వర్జిన్ దీవులు151యు.కె. ఓవర్సీస్ భూభాగం; జనావాసం ఉన్న 16 దీవులు, జనావాసం లేని 20 పైగా దీవులు కలిపి, Anegada దీవి కలిపి.
216 సెయింట్ హెలినా122యు.కె. ఓవర్సీస్ భూభాగం; డిపెండెన్సీలను మినహాయించి.
217 జెర్సీ బాలివిక్116యు.కె. క్రౌన్ డిపెందెన్సీ.
218 మాంట్‌సెరాట్102యు.కె. ఓవర్సీస్ భూభాగం.
219మూస:Country data Tristan da Cunha Tristan da Cunha98యు.కె. డిపెండెన్సీ సెయింట్ హెలీనా ప్రధాన భూభాగం మాత్రం. అన్ని దీవులూ కలిపితే వైశాల్యం 201 చ.కి.మీ. అవుతుంది.[7]
220 అంగ్విల్లా91యు.కె. ఓవర్సీస్ భూభాగం.
221 అసెన్షన్ దీవి88బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం సెయింట్ హెలీనా కు ఇది .
222 గ్వెర్నిసీ78యు.కె. క్రౌన్ డిపెందెన్సీ; Alderney, Guernsey, Herm, Sark, మరి కొన్ని చిన్న దీవులు కలిపి.
223మూస:Flaయు.కె.gicon శాన్ మారినో నగరం61
224 బెర్ముడా53యు.కె. ఓవర్సీస్ భూభాగం.
225 నార్ఫోక్ దీవులు36ఆస్ట్రేలియాలో స్వపరిపాలన గల ప్రాతం .
226 తువాలు26
227 నౌరూ21
228 టోకెలావ్ దీవులు12న్యూజిలాండ్ భూభాగం.
229 జిబ్రాల్టర్6యు.కె. ఓవర్సీస్ భూభాగం.
230 పిట్‌కెయిర్న్ దీవులు5యు.కె. కాలనీ.
231 మొనాకో1.95[8]
232 వాటికన్ నగరం0.44[9]

వనరులు

మూలాలు

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.