దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి (GDP) అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.

2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. మూలం: IMF (ఏప్రిల్ 2007)

ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.

క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ విదేశీ మారక ద్రవ్యం విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్థిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్థిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

ర్యాంకుదేశంతలసరి
నామినల్ జిడిపి ($)
అంచనా
మొదలైన తేదీ
1 లక్సెంబోర్గ్ నగరం87,9552005
2 నార్వే72,3062005
3 మొనాకో67,0002005
4 కతర్62,9142005
5 ఐస్‌లాండ్54,8582005
6 ఐర్లాండ్52,4402005
7 స్విట్జర్‌లాండ్51,7712006
8 డెన్మార్క్50,9652005
9 అమెరికా సంయుక్త రాష్ట్రాలు44,1902006
10 స్వీడన్42,3832006
11 నెదర్లాండ్స్40,5712006
12 ఫిన్లాండ్40,1972005
13 యునైటెడ్ కింగ్‌‌డమ్39,2132005
14 ఆస్ట్రియా38,9612006
15 కెనడా38,9512006
16 బెల్జియం37,2142006
17 ఆస్ట్రేలియా36,5532004
18 ఫ్రాన్స్35,4042006
19 జర్మనీ35,2042006
20 జపాన్34,1882005
21 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్33,3972003
22 ఇటలీ31,7912005
23 కువైట్31,0512004
24 బ్రూనై30,2982004
25 సింగపూర్29,9172005
యూరోపియన్ యూనియన్29,4762006
26 స్పెయిన్27,7672006
27 గ్రీస్27,6102005
28 హాంగ్‌కాంగ్27,4662006
29 న్యూజిలాండ్24,9432005
30 సైప్రస్23,6762006
31 బహ్రయిన్21,4472005
32 ఇస్రాయెల్20,3992005
33 బహామాస్18,9172003
34 స్లొవేనియా18,6102005
35 పోర్చుగల్18,4652005
36 దక్షిణ కొరియా18,3922006
37 రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)15,4822005
38 ట్రినిడాడ్ & టొబాగో15,3552002
39 మాల్టా15,2932005
40 సౌదీ అరేబియా14,7152004
41 చెక్ రిపబ్లిక్13,8482006
42 ఒమన్13,8462004
43 ఎస్టోనియా12,2032005
44 బార్బడోస్12,1542005
45 సెయింట్ కిట్స్ & నెవిస్11,7412003
46 ఆంటిగువా & బార్బుడా11,6852005
47 హంగేరీ11,3402004
48 స్లొవేకియా10,1582005
49 క్రొయేషియా9,5582005
50 సీషెల్లిస్9,0512005
51 పోలండ్8,8902004
52 చిలీ8,8642005
53 లిథువేనియా8,6102005
54 లాత్వియా8,5502005
55 లిబియా8,4302004
56 మెక్సికో8,0662005
57 ఈక్వటోరియల్ గునియా7,8022001
58 బోత్సువానా6,8692005
59 రష్యా6,8562006
60 వెనిజ్వెలా6,7362001
61 గబాన్6,527N/A
62 లెబనాన్6,1102004
63 ఉరుగ్వే6,0072005
64 మలేషియా5,7182005
65 బ్రెజిల్5,7172005
66 సెయింట్ లూసియా5,6502001
67 రొమేనియా5,6332006
68 అర్జెంటీనా5,4582005
69 టర్కీ5,4082005
70 దక్షిణ ఆఫ్రికా5,3842005
71 పనామా5,2112000
72 మారిషస్5,1292006
73 కజకస్తాన్5,1132004
74 గ్రెనడా4,9892003
75 కోస్టారీకా4,8582005
76 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్4,3602001
77 తుర్క్‌మెనిస్తాన్4,2802004
78 సెర్బియా4,2202004
79 డొమినికా కామన్వెల్త్4,1812005
80 సూరీనామ్4,0812002
81 బెలిజ్4,0282005
82 బల్గేరియా3,9952006
83 జమైకా3,9522005
84 బెలారస్3,8082005
85 డొమినికన్ రిపబ్లిక్3,6532004
86 ఫిజీ3,4542000
87 అల్జీరియా3,4132005
88 పెరూ3,3742005
89 థాయిలాండ్3,1362005
90 నమీబియా3,0841994
91 మేసిడోనియా3,0592005
92 ఇరాన్3,0462005
93 ఈక్వడార్2,9872001
94 టునీషియా2,9822004
95 అల్బేనియా2,8992001
96 కొలంబియా2,8882005
97 మాల్దీవులు2,8642004
98 అంగోలా2,7582000
99 ఎల్ సాల్వడోర్2,6192005
100 జోర్డాన్2,5442005
101 బోస్నియా & హెర్జ్‌గొవీనియా2,5332005
102 గ్వాటెమాలా2,5082004
103 కేప్ వర్డి2,3712003
104 అజర్‌బైజాన్2,3362005
105 స్వాజిలాండ్2,3012004
106 ఉక్రెయిన్2,2742005
107 టోంగా2,1892005
108 కాంగో రిపబ్లిక్2,1472004
109 చైనా పీపుల్స్ రిపబ్లిక్2,0012006
110 సమోవా1,9592005
111 అర్మీనియా1,8892004
112 మొరాకో1,8862004
113 జార్జియా (దేశం)1,7792004
114 వనువాటు1,7371999
115 ఫిలిప్పీన్స్1,6452003
116 సిరియా1,6402005
117 ఈజిప్ట్1,4892005
118 పరాగ్వే1,4832002
119 శ్రీలంక1,3552004
120 ఇండొనీషియా1,3452005
121 భూటాన్1,2542004
122 హోండూరస్1,2132001
123 గయానా1,1472002
124 బొలీవియా1,1252004
125 మంగోలియా1,0812005
126 సూడాన్1,0372005
127 జిబౌటి నగరం1,028N/A
128 భారత దేశం1,0212007
129 కామెరూన్1,0022004
130 మాల్డోవా9572005
131 ఐవరీ కోస్ట్9392005
132 జాంబియా9222003
133 మారిటేనియా9212004
134 నికారాగ్వా9082003
135 పాకిస్తాన్8302005
136 సెనెగల్7742005
137 నైజీరియా7702003
138 వియత్నాం7232004
139 పాపువా న్యూగినియా7082000
140 చాద్7072004
141 యెమెన్6932005
142 కెన్యా6812003
143 లెసోతో6791996
144 సొలొమన్ దీవులు6492005
145 కొమొరోస్6422003
146 కిరిబాతి6302004
147 బెనిన్6252002
148 ఉజ్బెకిస్తాన్6052005
149 ఘనా602N/A
150 సోమాలియా600N/A
151 లావోస్5832004
152 కిర్గిజిస్తాన్5422005
153 హైతీ5282004
154 కంబోడియా5032005
155 మాలి4851990
156 సావొటోమ్ & ప్రిన్సిపె4742004
157 జింబాబ్వే4722000
158 బంగ్లాదేశ్4512004
159 బుర్కినా ఫాసో4512001
160 తజకిస్తాన్4412004
161 మొజాంబిక్3642005
162 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్3552004
163 తూర్పు తైమూర్3502004
164 టోగో3502001
165 గినియా3472005
166 నేపాల్3392003
167 ఆఫ్ఘనిస్తాన్3352005
168 టాంజానియా3352001
169 గాంబియా3252006
170 ఉగాండా3162005
171 మడగాస్కర్2992005
172 నైజర్2742004
173 రవాండా2612005
174 సియెర్రా లియోన్2542004
175 ఎరిట్రియా2442005
176 మయన్మార్2302003
177 గినియా-బిస్సావు1871997
178 లైబీరియా1852006
179 మలావి1712006
180 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్1442004
181 ఇథియోపియా902007
182 బురుండి902007

Source

  • International Monetary Fund, World Economic Outlook Database, ఏప్రిల్ 2007: Countries, EU(27) GDP/pop.

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.