దేవి శ్రీ ప్రసాద్

దేవీశ్రీ ప్రసాద్ సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.

దేవిశ్రీ ప్రసాద్
జననంప్రసాద్
(1979-08-02) 1979 ఆగస్టు 2
వెదురుపాక
ఇతర పేర్లుదేవి
మతంహిందూ
తండ్రిసత్యమూర్తి

బాల్యం

ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.

సంగీతం అందించిన చిత్రాలు

సంవత్సరముసినిమా పేరుమూలములు
1999 దేవి
1999నీకోసం
2000 నవ్వుతూ బ్రతకాలిరా
2001 ఆనందం
2002కలుసుకోవాలని
2002ఖడ్గం
2002మన్మథుడు
2002తొట్టి గ్యాంగ్
2002సొంతం
2003 వర్షం
2004 వెంకీ
2004అభి
2004ఆర్య
2004శంకర్ దాదా MBBS
2004మాస్
2004నా అల్లుడు
2004నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2005 బన్నీ
2005 భద్ర
2005 ఒక ఊరిలో
2005 అందరివాడు
2005 ఆరు
2006 పౌర్ణమి
2006 బొమ్మరిల్లు
2006 రాఖి
2007 జగడం
2007 ఆట
2007 శంకర్ దాదా జిందాబాద్
2007 తులసి
2008 జల్సా
2008 రెడీ
2008 కింగ్
2009 కరెంట్
2009 ఆర్య 2
2009 అదుర్స్
2010 నమో వెంకటేశ
2011 Mr.పర్ ఫెక్ట్
2011 100% లవ్
2011 దడ
2011 ఊసరవెల్లి
2012 గబ్బర్ సింగ్
2012 జులాయి
2012 డమరుకం
2012 సారొచ్చారు
2013 మిర్చి
2013 ఇద్దరమ్మాయిలతో
2013 సింగం
2013 ఎవడు
2013 అత్తారింటికి దారేది
2013 బాయ్
2013 1 నేనొక్కడినే
2013 వీరుడొక్కడే
2014లెజెండ్
2014అల్లుడు శీను
2015 S/O సత్యమూర్తి
2015 శ్రీమంతుడు
2015 శివమ్
2015 కుమారి21ఎఫ్
2016 నాన్నకు ప్రేమతో
2016 నేను శైలజ
2016 సర్దార్ గబ్బర్ సింగ్
2016 ఎవడొ ఒకడు"
2016 జనతా గ్యారేజ్
2017 ఖైదీ నెంబర్ 150
2017 రారండోయ్ వేడుక చూద్దాం
2017 నేను లోకల్
2017 డిజె
2017 జయ జానకి నాయక
2017 జై లవ కుశ
2018 రంగస్థలం
2018 భారత్ అను నేను

పురస్కారాలు

బయటి లింకులు

మూలాలు వనరులు 

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.