దేవాలయం
ఇదే పేరుతో విడుదలైన దేవాలయం సినిమా గురించి చూడండి.


దేవళము లేదా దేవాలయము (Temple) మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. 'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.
శ్రీ వైఖానస శాస్త్రము ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము భగవంతుడు అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
చారిత్రికంగా కూడా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి[1].
హిందూ దేవాలయాలు
ఆలయములు అయిదు విధములు
- స్వయంవ్యక్త స్థలములు - భగవంతుడే స్వయముగా అవతరించిన స్థలములు.
- దివ్య స్థలములు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడిన స్థలములు.
- సిద్ధ స్థలములు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించిన స్థలములు.
- పౌరాణ స్థలములు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచిన స్థలములు.
- మానుష స్థలములు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడిన స్థలములు.
దేవాలయ నిర్మాణం
దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి.
దేవాలయ నియమావళి
.jpg)
ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.
- ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
- ఆలయమునకు ప్రదక్షిణము చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
- ఆలయములోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధము పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
- ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
- ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
- ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
- ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
- ఆలయములో ఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు.
- ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
- ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
- ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
- అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
- ఒక చేతితో ప్రణామము చేయరాదు.
- ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.
దేవాలయాలలో రకాలు
- శివుడు స్థాపించబడిన దేవాలయం - శివాలయం.
- విష్ణువు లేదా విష్ణంశ స్థాపించబడిన దేవాలయం - విష్ణాలయం
- శ్రీరాముడు స్థాపించడిన దేవాలయం - రామాలయం
- సూర్యనారాయణమూర్తి స్థాపించబడిన దేవాలయం - సూర్యాలయం
- సుబ్రహ్మణ్య స్వామి స్థాపించబడిన దేవాలయం - సుబ్రమణ్యస్వామి ఆలయం
- వేంకటేశ్వరుడు స్థాపించబడిన దేవాలయం - వేంకటేశ్వరాలయం
వివిధ మతాల దేవాలయాలు
చర్చిలు
క్రైస్తవులు దేవుడైన యెహోవాను ఏసుక్రీస్తు ద్వారా ప్రార్థించే మందిరాన్ని చర్చి అంటారు.
మసీదులు
గురుద్వారాలు
సిక్కు మతస్థులు ప్రార్థించే ప్రదేశాలను గురుద్వారాలు అంటారు.
బౌద్ధారామాలు
బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనాస్థలాలు,ఆలయాలు
రోడ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించాలి/ వేరేచోటుకు తరలించాలి/ క్రమబద్ధీకరించాలి.తమిళనాడులో అత్యధిక సంఖ్యలో 77,450 ప్రార్థనాస్థలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్ (58,253), గుజరాత్ (15వేలు) ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కటి కూడా లేదు.ఆ రాష్ట్రాన్ని అత్యంత నాగరిక రాష్ట్రంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశంసించింది.
కొన్ని ప్రసిద్ధ ఆలయాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో
- చూడండి - వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
- చూడండి - ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా
తక్కిన భారత దేశంలో
- తమిళనాడు, తంజావూరు లోని బృహదీశ్వరాలయం
- ఢిల్లీలోని, బిర్లా మందిరం (ఢిల్లీ)
- అక్షరధామ్
- శివ మందిరం, బెంగుళూరుఅంగ్ కొర్
ఇతర దేశాలలో
- కంబోడియా లోని
వాట్]] దేవాలయం.
ఇవి కూడా చూడండి
మూలాలు, వనరులు
- వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.
బయటి లింకులు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో దేవాలయంచూడండి. |
renuka ellamma temple in ponnala