దేవప్రయాగ
దేవప్రయాగ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| దేవప్రయాగ | |
|---|---|
![]() దేవప్రయాగ Location in Uttarakhand, India | |
| భౌగోళికాంశాలు : | 30.146315°N 78.598251°E |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | నీలమేఘ పెరుమాళ్ |
| ప్రధాన దేవత: | పుండరీకవల్లి |
| దిశ మరియు స్థానం: | తూర్పుముఖము |
| పుష్కరిణి: | మంగళతీర్థం |
| విమానం: | మంగళ విమానం |
| కవులు: | పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | భరద్వాజమహర్షికి |
విశేషాలు
ఈ క్షేత్రము హరిద్వారము నుండి హిమవద్గిరికి పోవుదారిలో నున్నది. హరిద్వార్ నుండి ఈక్షేత్రమునకు పోవుమార్గంలోనే హృషీకేశ్ ఉంది. తపోవనము, లక్ష్మణస్వామి సన్నిధి (లక్ష్మణఝూలా) వ్యాసఘాట్-శ్రీసీతారాముల సన్నిధి ఉంది. హరిద్వారము నుండి 100 కి.మీ. దూరములో ఈ కండమెన్ఱుం కడినగర్ క్షేత్రము ఉంది. దీనినే దేవప్రయాగ అంటారు. కోవెలకు వెనుక హనుమాన్ సన్నిధి ఉంది. అలకనందా నది ప్రవహించు దేశము-ఆళ్వార్ కీర్తించిన పెరుమాళ్లను రఘునాథ్‌జీ అంటారు.
సాహిత్యం
శ్లో. శ్రీ మన్మంగళ పుణ్యతీర్థ రుచిరే క్షేత్రే ప్రయాగాభిదే
త్వాలింగ్య ప్రియ పుండరీక లతికాం శ్రీ నీలమేఘో విభు:|
రేజే మంగళ దేవయాన నిలయ:ప్రాగ్వక్త్ర సంస్థానగ:
భారద్వాజ మునీక్షిత: కలిరిపు శ్రీవిష్ణుచిత్త స్తుత:||
పాశురాలు
పా. తజ్గై యై మూక్కుమ్ తమయనై త్తలయుమ్ తడన్దవెన్ దాశరదిపోయ్
ఎజ్గుమ్ తన్ పుకழா విరున్దరశాణ్డ; వెమ్బురుడోత్తమ నిరుక్కై,
కజ్గై కజ్గై యెన్ఱ వాశకత్తాలే; కడువినై కళైన్దిడు కిఱ్కుమ్
కజ్గై యిన్ కఱై మేల్ కైతొழுనిన్ఱ కణ్డమెన్నుమ్ కడినకరే||
పెరియాళ్వార్లు-పెరియాళ్వార్ తిరుమొழி 4-7-1
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| నీలమేఘ పెరుమాళ్ | పుండరీకవల్లి | మంగళతీర్థం | తూర్పుముఖము | నిలచున్న భంగిమ | పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ | మంగళ విమానం | భరద్వాజమహర్షికి |
మంచిమాట
- ఆశ్రయింప వలసిన వానిని అన్నిటిని ఆశ్రయించి భగవంతుని కూడా ఆశ్రయించుట "భక్తి".
- విడువ వలసిన వాటి నన్నింటిని విడచి తనను కూడా విడుచుట "ప్రపత్తి".
చేరే మార్గం
హృషికేశ్ నుండి బదరీమార్గంలో 70 కి.మీ దూరంలోను హరిద్వార్-బదరీ మార్గంలో 95 కి.మీ. దూరంలోను గలదు
