దేవదాస్ కనకాల

దేవదాస్ కనకాల ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగినవారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు.

దేవదాస్ కనకాల
దేవదాస్ కనకాల
జననందేవదాస్ కనకాల
యానాం శివారులోని కనకాల పేట
వృత్తిటీవీ నటుడు.
ప్రసిద్ధితెలుగు సినిమా నటులు
మతంహిందూ మతము
పిల్లలుకుమారుడు:రాజీవ్ కనకాల, కోడలు:సుమ
కుమార్తె: శ్రీలక్ష్మి కనకాల, అల్లుడు: పెద్ది రామారావు
తండ్రికనకాల తాతయ్య నాయుడు
తల్లిమహలక్షమమ్మ.

జననం

1945లో జూలై 30 న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా చేసారు. మరియు తల్లి మహలక్షమమ్మ. తోబుట్టువులు తనతో కలిపి ఎనమండుగురులో తనే పెద్దవాడు.

చదువు - ఉద్యోగం

విశాఖపట్టణం లోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు.

వివాహం - పిల్లలు

1971 నవంబరు 21న లక్ష్మీదేవి కనకాల తో దేవదాస్ కనకాల ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు (రాజీవ్ కనకాల), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ సుమ తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావు తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.[1]

ఇతరములు

కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ సీత కథ లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా చలిచీమలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే.

దూరదర్శన్ కోసం వీరు దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది మొదలగు సీరియల్స్ విశేష ప్రజాధరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దుతున్నారు.

నటించిన సినిమాలు

దర్శకత్వం వహించిన చిత్రాలు

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి. "నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల". Retrieved 24 May 2017.
  2. డైలీహంట్. "దేవదాస్ మాట! .. శరత్కాలం". m.dailyhunt.in. Retrieved 24 May 2017.
  3. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్. "ఆంధ్రసచిత్ర వార పత్రిక". www.pressacademyarchives.ap.nic.in. Retrieved 13 July 2017.

ఇతర లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.