దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు.

దుర్గాబాయి దేశ్‌ముఖ్
జననంజూలై 15, 1909
రాజమండ్రి
మరణంమే 9, 1981
వృత్తిన్యాయవాది, సంఘసేవ
ప్రసిద్ధులుఆంధ్ర మహిళా సభ
మతంహిందూమతం
జీవిత భాగస్వామిసి.డి.దేశ్‌ముఖ్
తల్లిదండ్రులు
  • రామారావు (తండ్రి)
  • కృష్ణవేణమ్మ (తల్లి)

దుర్గాబాయి దేశ్ ముఖ్

దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు ఒక ప్రత్యేక సామాజిక కార్యకర్త అని పేరు. ప్రముఖంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆంధ్ర ప్రదేశ్లో ఆమె రాజమండ్రి, జూలై 15, 1909 న జన్మించింది. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి స్నాతక పట్టా పొందింది.తర్వాత న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది. ఆమె భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు.దుర్గాభాయి దేశముఖ్ ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకురాలు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క ప్రణాళికా సంఘం సభ్యురాలు.

బాల్యం మరియు చదువు

1909వ సంవత్సరం జూలై 15వ తేదీన రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించేవారు.బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.

arun== డాక్టరేట్‌ == రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్ర్తీ అభ్యున్నతి కోసం ఎన లేని కృషి చేస్తున్నాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.durgabhai deshmukh salute by deeraj lucky lucky

ఆమె స్ధాపించినవి

ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.

స్వాతంత్ర్య పోరాటం

దుర్గాబాయి 1909లో రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు జన్మించారు. ఈమె బాల్యంనుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు. చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్య్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు.

దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘీక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది.ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనంఅను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది.1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది.

స్వాతంత్ర్యం తర్వాత

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న చోటు చేసుకుంది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (Central Social Welfare Board - సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు.

అవార్డులు

స్మరణ

రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహం
  • కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది.
  • ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

మరణం

చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడ్డ దుర్గాబాయి...1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు.

వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.