దీవెన

పవిత్రత్వము, ఆధ్యాత్మిక విముక్తి, దైవ సంకల్పం, లేదా ఒక ఆశ లేదా ఒకరి ఆమోదముతో ఎంతో కొంత ప్రేరేపించబడటాన్ని దీవెన అంటారు. వ్యక్తులు, దీవెన అదృష్టాన్నిచ్చే మార్గం అనుకుంటారు. కొన్నిసార్లు మతాచారులు దేవుడు వారిని మంచిగా చూడాలని కోరుకుంటారు, లేదా ప్రజలే దేవుడిని మంచిగా దీవించమని కోరుకుంటారు. పూజారులు మతమరమైన వస్తువులను పవిత్రమైనవిగా మార్చేందుకు కూడా ఆశీర్వదిస్తారు.

దీవెనను ఆశీర్వాదం అని కూడా అంటారు. దీవెనను ఆంగ్లంలో బ్లెసింగ్ అంటారు.

బ్లెసింగ్ పద చరిత్ర

ఆధునిక ఆంగ్ల భాషా పదం బ్లెస్ పాత ఇంగ్లీష్ పదం బ్లెసెన్ (క్రీ.శ.950 నాటి నార్తంబ్రియన్ మాండలికంలో భద్రపరచబడిన) నుండి ఉద్భవించింది. ఈ పదం ఇంకా 830 ముందు ప్రోటో జర్మనిక్ వారు ఉపయోగించిన బ్లెడ్ సియన్ పదం నుండి, 725 మరియు 1000 నాటి ఆంగ్లో సాక్సాన్ అన్యమత, జెర్మేనిక్ అన్యమతత్వ కాలంలో ఉపయోగించిన బ్లెట్ సియన్ నుండి ఉద్భవించింది. మొత్తం మీద వీటి అర్థం పవిత్రమైనదిగా లేదా పరిశుద్ధమైనదిగా చేయడానికి ఒక ఆచారములా త్యాగం చేయడం. ఈ పదం బ్లడ్ (రక్తం) అనే పదంతో సంబంధం కలిగి ఉంటుంది.

క్రైస్తవీకరణ అనువాద ప్రక్రియలో బైబిల్ యొక్క అనువాదాన్ని పాత ఇంగ్లీషులోకి మార్చు సమయంలో లాటిన్ పదం మంచిపలుకు పలకడం ద్వారా మంచి ఫలితం అని అర్థానిచ్చే బెనిడిసిరే అనే పదం నేటి పదం యొక్క ఆధునిక అర్థంగా ప్రభావితమై ఉండవచ్చు.

దీవెనలు

  1. అవిఘ్నమస్తు
  2. కళ్యాణమస్తు
  3. తథాస్తు
  4. విజయోస్తు
  5. శ్రీరస్తు
  6. శుభమస్తు
  7. దీర్ఘాయుష్మాన్భవ
  8. ఆయురారోగ్యప్రాప్తిరస్థు
  9. అష్టైశ్వర్యాభివృధిరస్థు
  10. సుపుత్రప్రాప్తిరస్థు

ఇవి కూడా చూడండి


బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.