దివిసీమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న మరియు సారవంతమైన ద్వీపం దివిసీమ.


భౌగోళిక స్థితి
దివిసీమ పులిగడ్డ(అవనిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది, ఇక్కడ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలవగా మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు, ఇది రేపల్లె మరియు పులిగడ్డను కలుపుతుంది. దివిసీమలో కూచిపూడి, మొవ్వ, సంగమేశ్వరం, నాగాయలంక, కోడూరు, హంసలదీవి, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం, ఘంటసాల గుర్తించదగ్గ ప్రదేశాలు.
ప్రముఖులు
- పింగళి వెంకయ్య - స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
- మండలి వెంకటకృష్ణారావు - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు మరియు గాంధేయవాది.
- ఘంటసాల వెంకటేశ్వరరావు - ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.
- వేటూరి సుందరరామ్మూర్తి - సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత.
- పసుపులేటి కన్నాంబ - ప్రసిద్ధ రంగస్థల నటి మరియు గాయని.
- మండలి బుద్ధ ప్రసాద్ - ప్రముఖ రాజకీయ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని.
- Kunapareddy Naga Chenchaiah (only person to receive the Vikram Sarabhai Award in South India)
- Myneni Hariprasada Rao (scientist)
- Simhadri Satyanarayana [politician]
- Ambati Brahmanaiah [Politician]
- Chandra Rajeswararao [Politician]
- Challapalli Raja [Politician]
- Purama Sridhar Babu(Diviseema Parirakshana Samithi)
- Naani [Actor]
- SriKanth [Actor]
- Venkat [Actor]
- Kanumuri Pirati [Business Tycoon]
- Simhadri Ramesh Babu [Politician]
ఉప్పెన
- ప్రధాన వ్యాసం 1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను
ఈ ప్రాంతం నవంబరు 19, 1977 లో ఒక పెద్ద తుఫానుకు గురై మానవ జీవితాల సహా అపూర్వ నష్టాన్ని చవిచూసి ప్రపంచవ్యాప్త వార్తలకెక్కింది. ఈ సహజసిద్ధమైన విపత్తు ఫలితంగా 10,000 మంది ప్రజలు మరణించి ఉంటారని, అలాగే 10,00,000 జంతువులు మరణించి ఉంటాయని అంచనా వేశారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం కృషి చేశాయి.[1] "Dviseema"