దిగువ దిబాంగ్
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రలోని 17 జిల్లాలలో దిగువ దిబాంగ్ జిల్లా ఒకటి. దేశంలో అత్యల్పజనసాధ్త్రత కలిగిన జిల్లాలలో ఇది 10వ స్థానంలో ఉంది. [2]
| Lower Dibang Valley జిల్లా | |
|---|---|
| Arunachal Pradesh జిల్లాలు | |
![]() Arunachal Pradesh రాష్ట్రంలో Lower Dibang Valley యొక్క స్థానాన్ని సూచించే పటం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | Arunachal Pradesh |
| ముఖ్యపట్టణం | Roing |
| జనాభా (2011) | |
| • మొత్తం | 53,986[1] |
| జనగణాంకాలు | |
| • అక్షరాస్యత | 70.4%[1] |
| • లింగ నిష్పత్తి | 919[1] |
చరిత్ర
1980లో లోహిత్ జిల్లాలోని కొంతభూభాగం వేరిచేసి దిబాంగ్ లోయ జిల్లా రూపొందించబడింది.[3]2001 డిసెంబరు 16న దిబాంగ్ లోయ జిల్లా దీబాంగ్ లోయ జిల్లా మరియు దిగువ దిబాంగ్ లోయ జిల్లాగా విభజించబడింది.[3]
భౌగోళికం
దిగువ దిబాంగ్ లోయ జిల్లా కేంద్రంగా రోయింగ్. 2001 డిసెంబరున ఈ జిల్లా రూపొందించక ముందు అనిని జిల్లా కేంద్రంగా ఉందెది.[4]
విభాగాలు
దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- డంబక్ మరియు రోయింగ్. ఇవి రెండు అరుణాచల్ ఈస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగ ఉన్నాయి. [5]
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 53,986, [1] |
| ఇది దాదాపు. | సెయుంట్ కిట్స్ మరియు నెవిస్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
| అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
| 640 భారతదేశ జిల్లాలలో. | 630వ స్థానంలో ఉంది.[1] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 14 [1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 7.01%.[1] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 909:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే. | |
| అక్షరాస్యత శాతం. | 70.38%.[1] |
| జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
దిగువ దిబాంగ్ లోయ జిల్లా ఇడు మిష్మి మరియు ఆది, సినో-టిబెటన్ (అంతరించిపోతున్న భాధలలో ఒకటి) భాషలు వాడికలో ఉన్నాయి.[7]
వృక్షజాలం మరియు జంతుజాలం
దిగువ దిబాంగ్ జిల్లా వన్యమృగాలతో సుసంపన్నమై ఉంది. ఈ అరణ్యాలలో మిష్మి టాకిన్, రెడ్ గోరల్, ఏనుగులు, అడవి నీటి దున్న మరియు మౌంట్జాక్ వంటి వన్యమృగాలు ఉన్నాయి. స్క్లటర్ మోనల్, బ్లిత్స్ ట్రాగోపన్, రుఫోర్స్ - నెక్డ్ హార్న్‌బిల్, బెంగాల్ ఫ్లోరికన్, వైట్ - వింగ్డ్ వుడ్ డక్ వంటి పక్షులు ఉన్నాయి.[8] సైన్సు ప్రపంచానికి సరికొత్త ప్రాణి అయిన మిష్మి హిల్స్ జైంట్ ఎగిరే ఉడుత " పెటౌరిస్టా మిష్మింసిస్ " ఈ ప్రాంతంలో కనిపిస్తుంది.[9] 1980లో దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో 282 చ.కి.మీ వైశాల్యంలో " మెహయో విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటుచేయబడింది.[10]
మూలాలు
- "District Census 2011". Census2011.co.in.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- Law, Gwillim (25 September 2001). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- Official Website of the Lower Dibang Valley District
- "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Saint Kitts and Nevis 50,314 July 2011 est.
line feed character in|quote=at position 22 (help) - M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
- Choudhury, Anwaruddin (2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
- Choudhury,Anwaruddin (2009).One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
- Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011.

