దానవులు

దానవులు కశ్యపునికి దనువు యందు పుట్టిన వారును వారి సంతతివారును. అందు ముఖ్యులు అయోముఖుఁడు, ఏకచక్రుఁడు, పులోముఁడు, కపిలుఁడు, అంధకుఁడు (కొ. అడిదానవుఁడు), అరిష్టుఁడు, అరుణి, అనుతావకుడు, ద్విమూర్ధ్నుడు, శంబరుడు, హయగ్రీవుడు, విభావసుడు, శంకుశిరస్సు, స్వర్భానుడు, వృషపర్వుడు, విప్రచిత్తి (ఇతనికి సింహికయందు పుట్టిన కొడుకులు రాహువు, కేతువు), వాతాపి, ఇల్వలుఁడు, నముచి, రెండవ స్వర్భానుఁడు, కాలనాభుఁడు, వక్త్రయోధి, త్ర్యంశుడు, శల్యుఁడు, నభుడు, నరకుడు, పులోముఁడు, ఖసృముడు, రెండవ అంధకుఁడు, ధూమ్రకేతువు, విరూపాక్షుడు, దుర్జయుడు, వైశ్వానరుడు, రెండవ తారకుడు. ....................పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.