దానం

దానం (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత (Donor) అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు మరియు సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం మరియు వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.

బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, రాజా రవివర్మ చిత్రం.

దాతృత్వం

ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానె వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.[1]

రక్త దానం

రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.

అవయవ దానం

కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు.

అన్న దానం

ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

కన్యాదానం

కన్యాదానం :వివాహంలో పెళ్ళికూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం.వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానంగా కూడా పేరుగాంచింది.

పురాణాలలో దానం

  • వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
  • బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
  • శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
  • కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
  • ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు

ఆస్తి దానం

అపాత్రదానం

ప్రధాన వ్యాసం అపాత్రదానం

మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

మూలాలు

  1. సాక్షి16.9.2010
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.