దగ్గుబాటి రామానాయుడు

డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 - ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు[1].

దగ్గుబాటి రామానాయుడు
జననందగ్గుబాటి రామానాయుడు
జూన్ 6, 1936
ప్రకాశం జిల్లా కారంచేడు
మరణం2015 ఫిబ్రవరి 18 (2015-02-18)(వయసు 78) [1]
హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణముకేన్సర్
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుమూవీ మోఘల్
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
పిల్లలుసురేష్, వెంకటేష్
తండ్రివెంకటేశ్వర్లు
Notes
ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు

వ్యక్తిగత జీవితం

దగ్గుబాటి రామానాయుడు, 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు. రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.

సినిమా జీవితం

కారంచేడులో 'నమ్మిన బంటు' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?' అని అక్కినేని అడికితే, వూరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాత్తుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, వూరు విడచి చెన్నపట్నం చేరుకున్నాడు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. 'అనురాగం' చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చాడు.జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఈ పరిచయాలతోనే ఆయనకు 'నమ్మిన బంటు' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసిన ఆయన మళ్లీ జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకే వేశారు. అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్‌నగర్ చిత్రాన్ని నిర్మించారు.'ప్రేమనగర్' విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు

పురస్కారాలు

పౌర పురస్కారాలు
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణభారతదేశం)

మరణం

చివరి సంవత్సరాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డ రామానాయుడు అదే వ్యాధి వల్ల 18 ఫిబ్రవరి 2015న హైదరాబాద్‌లో మరణించాడు[1]. 2002-03 సమయంలో రామానాయుడికి ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో కొన్నాళ్ళపాటు అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015 సమయంలో మళ్లీ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వైద్యులు చికిత్స చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో 15 ఫిబ్రవరి 2015న మరణించారు.

ఫిల్మోగ్రఫీ

తెలుగు

సంవత్సరంపేరుదర్శకుడుప్రధాన తారాగణం
2015గోపాల గోపాలకిషోర్ కుమార్ పార్ధసానివెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీయ
2014దృశ్యంశ్రీప్రియవెంకటేష్, మీనా
2014భీమవరం బుల్లోడుఉదయ్ శంకర్సునీల్, ఎస్తేర్
2013మసాలాకె. విజయభాస్కర్వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదమ్సీ
2013నేనేం చిన్నపిల్లనా?పి. సునీల్ కుమార్ రెడ్డిరాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్, సంజన
2011ముగ్గురువి. ఎన్. ఆదిత్యనవదీప్, శ్రద్ధ దాస్
2010ఆలస్యం అమృతంచంద్రమహేశ్నిఖిల్, వెంకట్ యాదవ్, అరవింద్ కృష్ణ, మదాలస శర్మ
2009బెండు అప్పారావ్ ఆర్.ఎం.పిఇ.వి.వి. సత్యనారాయణఅల్లరి నరేష్, జివికె యాదవ్, కామ్న జెఠ్మలానీ, మేఘన
2008"కౌసల్య సుప్రజ రామ"సూర్య ప్రసాద్శ్రీకాంత్, శివాజి, ఛార్మి, గౌరి ముంగల్
2008బలాదూర్ఉదయ్ శంకర్రవితేజ, అనుష్క
౨౦౦౭తులసిబోయపాటి శ్రీనివాసరావువెంకటేష్, నయనతార
2007"మధుమాసంచంద్ర సిద్ధార్థసుమంత్, స్నేహ, పార్వతి మిల్టన్
2006శ్రీకృష్ణ 2006విజయేంద్ర ప్రసాద్శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్
2005సోగ్గాడుటి. రవి రెడ్డిరరుణ్, ఆర్తి అగర్వాల్
2005నిరీక్షణ (2005 సినిమా)సీతా రామ్ ప్రసాద్ఆర్యన్ రాజేష్, శ్రీదేవి
2005బొమ్మలాటకె. ప్రకాశ్సాయికుమార్, శ్రేయ, నరేష్
2004మల్లీశ్వరికె. విజయ భాస్కర్వెంకటేష్, కరినా కైఫ్
2003విజయంసింగీతం శ్రీనివాసరావురాజా, గజాలా
2003నీకు నేను నాకు నువ్వురాజశేఖర్ఉదయ కిరణ్, శ్రేయ
2003హరివిల్లుబి. నరసింగరావుభానుచందర్, హరిత
2002నువ్వు లేక నేను లేనుకాశీ విశ్వనాథ్తరుణ్, ఆర్తి అగర్వాల్
2002నీ ప్రేమకైముప్పలనేని శివవినీత్, అబ్బాస్, లయ
2002అల్లరిటి. రవి రెడ్డినరేష్, నీలాంబరి, శ్వేతా అగర్వాల్
2002హాయ్ఇ.వి.వి. సత్యనారాయణఆర్యన్ రాజేష్, నికిత
2001ప్రేమించుబి. సుబ్బారావ్సాయి కిరణ్, లయ
2000కలిసుందాం రాఉదయ శంకర్వెంకటేష్, సిమ్రాన్
2000జయం మనదేరాఎన్. శంకర్వెంకటేష్, వెంకన్న యాదవ్, భానుప్రియ, సౌందర్య
1999పెద్దమనుషులుబి. సుబ్బారావుసుమన్, రచన, హీరా
1999ప్రేయసి రావేచంద్రమహేష్శ్రీకాంత్, రాశి
1998శివయ్యసురేష్ కృష్ణరాజశేఖర్, సంఘవి, మోనికా బేడీ
1998గణేష్తిరుపతి స్వామివెంకటేశ్, రంభ, మధుబాల
1997ప్రేమించుకుందాం రాజయంత్ సి. పరాంజీవెంకటేష్, అంజలీ జవేరీ
1997సూపర్ హీరోస్ఎవియస్ఎవియస్, బ్రహ్మానందం
1996'ధర్మ చక్రంసురేష్ కృష్ణవెంకటేశ్, రమ్యకృష్ణ, ప్రేమ
1996ఆహా నా పెళ్ళంటజంధ్యాలహరీష్, సంఘవి
1996నాయుడు గారి కుటుంబంబి. సుబ్బారావుసుమన్, కృష్ణంరాజు, సంఘవి
1996తాత మనవడుకె. సదాశివరావుకృష్ణం రాజు, వినీద్ కుమార్, సంఘవి
1995కొండపల్లి రత్తయ్యదాసరి నారాయణరావుదాసరి నారాయణరావు, హరీష్, ఆమని
1995తాజ్ మహల్ముప్పలనేని శివశ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవి
1994తోడి కోడళ్ళుబి. సుబ్బారావుసురేష్, మాలాశ్రీ
1994సూపర్ పోలీస్కె. మురళీ మోహన రావువెంకటేష్, నగ్మా
1993అక్కా చెల్లెళ్లువి.సి. గుహనాధన్సురేష్, మాలాశ్రీ
1993'ఆంధ్రవైభవంఎమ్.ఆర్. రాజాజీడా.డి. రామానాయుడు, మురళీ మోహన్, జమున
1993పరువు ప్రతిష్టవి.సి. గుహనాధన్సుమన్, సురేష్, మాలాశ్రీ
1992సూరిగాడుదాసరి నారాయణ రావుదాసరి నారాయణ రావు, సుజాత
1992ప్రేమ విజేతకె. సదాశివరావుహరీష్, రోజా
1991ప్రేమ ఖైదీఇ.వి.వి. సత్యనారాయణహరీష్, మాలాశ్రీ
1991కూలీ నెం. 1కె. రాఘవేంద్రరావువెంకటేష్, టబు
1991సర్పయాగంపరుచూరి బ్రదర్స్శోభన్ బాబు, హరీష్, రోజా
1990బొబ్బిలి రాజాబి. గోపాల్వెంకటేష్, దివ్య భారతి
1989ఇంద్రుడు చంద్రుడుసురేష్ కృష్ణకమలహాసన్, విజయశాంతి
1988ప్రేమ'సురేష్ కృష్ణవెంకటేష్, రేవతి
1988బ్రహ్మ పుత్రుడు 'దాసరి నారాయణరావువెంకటేష్, రజని
1988చినబాబుఎ. మోహన్ గాంధీనాగార్జున, అమల
1987గురుబ్రహ్మబి. సుబ్బా రావుఎ. నాగేశ్వరరావు, శారద
1987రామువై. నాగేశ్వరరావుబాలకృష్ణ, రజని
1987కలియుగ పాండవులుకె. రాఘవేంద్రరావువెంకటేష్, కుష్బూ
1987అహనా పెళ్ళంటజంధ్యాలరాజేంద్ర ప్రసాద్
1986ప్రతిధ్వనిబి. గోపాల్శారద, అర్జున్, రజని
1895శ్రీకట్న లీలలుపరుచూరి బ్రదర్స్చంద్రమోహన్, తులసి
1985మాగల్యబలంబి. సుబ్బారావుశోభన్ బాబు, జయసుధ
1984సంఘర్షణకె. మురళీ మోహన రావుచిరంజీవి, విజయశాంతి, నళిని
1984కథానాయకుడుకె. మురళీమోహన రావుబాలకృష్ణ, విజయశాంతి
1983ముందడుగుకె. బాపయ్యశోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద
1982దేవతకె. రాఘవేంద్రరావుశోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి
1981అగ్నిపూలుకె. బాపయ్యకృష్ణంరాజు, జయసుధ
1981ప్రేమ మందిరందాసరి నారాయణ రావుఎ.ఎన్.ఆర్, జయప్రద
1980కక్షవిసి. గుహనాథన్శోభన్ బాబు, వాణిశ్రీ
1979మండే గుండెలుకె. బాపయ్యశోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి
1979ఒక చల్లనిరాత్రికె.వాసుచంద్రమోహన్,మాధవి
1978చిలిపి కృష్ణుడుబి.సుబ్బారావుకాంతారావు,రాజశ్రీ
1978ఎంకి నాయుడుబావబి.సుబ్బారావుశోభనబాబు,వాణిశ్రీ
1977సావాసగాళ్ళుబి.సుబ్బారావుకృష్ణ,జయచిత్ర
1977మొరటోడుసికె నగెష్సత్యనారాయణ,జయసుధ
1976సెక్రటరిఎస్ ప్రకాష్ రావుఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ
1975అమ్మాయల శపథముజిచిఆర్ శేషగిరి రావుచంద్రమోహన్,లక్ష్మి
1975సోగ్గాడుకె,బాపయ్యశోభన్‌బాబు,జయచిత్ర
1974చక్రవాకంవి.మధుసూదన రావుశోభన్‌బాబు,వాణిశ్రీ
1973జీవనతరంగాలుటి.రామారావుశోభన్‌బాబు,వాణిశ్రీ
1971ప్రేమనగర్కె.ఎస్.ప్రకాశరావుఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ
1970ద్రోహికె.బాపయ్యజగ్గయ్య,వాణిశ్రీ
1969బొమ్మలు చెప్పిన కథజి.విశ్వనాథంకాంతారావు,విజయనిర్మల
1969సిపాయి చిన్నయ్యజివిఆర్ శేషగిరి రావుఎ.నాగేశ్వరరావు,కెఆర్ విజయ
1968పాప కోసంజివిఆర్ శేషగిరి రావుజగ్గయ్య, దేవిక
1967స్త్రీ జన్మకె.ఎస్.ప్రకాశరావుఎన్.టి.రామారావు,కృష్ణకుమారి
1966శ్రీ కృష్ణ తులాభారంకె.కామేశ్వరరావుఎన్.టి.రామారావు,జమున
1965ప్రతిజ్ఞాపాలనసి.యస్. రావుకాంతారావు, రాజశ్రీ
1964రాముడు భీముడుతాపి చాణక్యఎన్.టి.ఆర్, జమున, సావిత్రి
1963అనురాగంజి. రామినీడుజగ్గయ్య, భానుమతి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.