దక్షిణ మహాసముద్రం

దక్షిణ మహాసముద్రం (ఆంగ్లం : Southern Ocean), దీనికి ఇతర పేర్లు "మహా దక్షిణ సముద్రం", "అంటార్కిటిక్ మహాసముద్రం మరియు "దక్షిణ ధృవ మహాసముద్రం". దక్షిణార్ధ గోళానికి 60° అక్షాంశ దిగువన గల సముద్రప్రాంతము. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రానికి దక్షిణాన, అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ వున్న జలరాశి.[1]

దక్షిణ మహా సముద్రం

భౌగోళికం

దక్షిణ మహాసముద్రం అంటార్కిటిక్ సర్కమ్‌పోలార్ కరెంట్ (అంటార్కిటికా చుట్టూ భ్రమిస్తుంది) ను కలిగివున్నది. ఈ జలరాశిలో అముండ్‌సెన్, బెల్లింగ్‌షౌసెన్ సముద్రం, డ్రేక్ పాసేజ్ లోని కొన్ని భాగాలు, రాస్ సముద్రం, కోఆపరేషన్ సముద్రం, కాస్మోనాట్ సముద్రం, స్కోషియా సముద్రపు కొద్ది చిన్నభాగాలు, మరియు వెడ్డెల్ సముద్రం మొదలగునవి ఉన్నాయి. దీని మొత్తం విస్తీర్ణం 20,327,000 చ.కి.మీ. (7,848,000 చ.మై.).

అనేక విధాలుగా, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం నకు వ్యతిరేక దిశలో, భూగోళ వ్యతిరేక అంచులో గలదు.

ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ మహాసముద్రాల మధ్య భేదాలు
ఆర్క్‌టిక్ మహాసముద్రందక్షిణ మహాసముద్రం
యురేషియా మరియు ఉత్తర అమెరికాలచే చుట్టబడివున్నదిఅంటార్కిటిక్ ఖండం చుట్టూ ఆవరించియున్నది
వెచ్చని మహాసముద్రం, మంచుభూములను వెచ్చబరుస్తుందిమంచు భూభాగం, అతిశీతల సముద్రాలను శీతలీకరిస్తుంది
నదులద్వారా మంచినీరు ఆర్కిటిక్ మహాసముద్రానికి చేరుతున్నదిగ్లేషియర్‌లు కరుగుట వలన దక్షిణ మహాసముద్రానికి నీరందుతున్నది
ఆర్కిటిక్ మహాసముద్రానికి మధ్యలో మంచు ఏర్పడుతున్నదిఅంటార్కిటిక్ మహాసముద్రపు తీరంలో మంచు ఏర్పడుతున్నది

వాతావరణం

సముద్ర-ఉష్ణోగ్రత −2 నుండి 10  °C (సెంటీగ్రేడ్) (28 నుండి 50 °F (ఫారెన్‌హీట్)) ల మధ్య మారుతూ వుంటుంది. వాయు తుఫానులు తూర్పువైపునకు ఖండం చుట్టూ ప్రయాణించి తీవ్రరూపందాలుస్తాయి. దీనికి కారణం మంచు మరియు విశాల సముద్ర ఉష్ణోగ్రతల మధ్య కలిగే వ్యత్యాసాలు.

ప్రకృతి వనరులు

  • ఖండముల మార్జిన్ లలో పెద్దమోతాదులలో ఆయిల్ మరియు సహజ వాయువు నిల్వలు సంభవం.
  • మాంగనీసు నాడ్యూల్‌లు
  • ప్లేసర్‌ల నిల్వలు
  • ఇసుక మరియు రాళ్ళు
  • మంచినీరు (ఐస్ బెర్గ్‌ల రూపంలో)
  • చరములు:
    • స్‌క్‌విడ్
    • వేల్ చేప
    • సీల్ చేప
    • క్రిల్
    • అనేక రకాల చేపలు

ప్రకృతి వైపరీత్యాలు

ఐస్‌బెర్గ్‌లు సంవత్సరం పొడగునా సముద్రంలో ఎక్కడైనా ఏర్పడుతాయి. వీటిలో కొన్ని, అనేక వందల మీటర్లవరకూ ఏర్పడుతాయి.

  • నావికులు 40 నుండి 70 డిగ్రీల అక్షాంశాలను క్రింది విధంగా గుర్తిస్తారు;
    • "గర్జించే నలభైలు (Roaring Forties),"
    • "భయానక ఏభైలు (furious fifties)" మరియు
    • "కీచుమనిపించే అరవైలు (shrieking sixties)"

ఓడరేవులు మరియు హార్బర్‌లు

ఐస్ పీర్ (మంచు పలకలు) లలో తీవ్రమయిన పగుళ్ళు. మాక్‌ముర్డో స్టేషను వద్ద నిలచియున్న నౌకను చూడవచ్చు.

పెద్ద ఓడరేవులు :

  • ఎస్పరాంజా బేస్,
  • విల్లా లాస్ ఎస్టెరెల్లాస్ (చిలీ),
  • మాసన్ స్టేషను,
  • మాక్‌ముర్డో స్టేషను,
  • పామేర్ స్టేషను, మరియు అంటార్కిటికాలోని ఆఫ్-షోర్ ఆంకరేజీలు.

[2]

ఇవీ చూడండి

  • ఎర్నెస్ట్ షాకల్టన్ (ఎక్స్‌ప్లోరర్)
  • అంటార్కిటిక్ ఖండపు దూరపు అంచులు
  • ఆస్ట్రేలియా మరియు దక్షిణ మహాసముద్రం
  • గర్జించే నలభైలు (Roaring forties)
  • ఉప-అంటార్కిటిక్

మూలాలు

  1. Pyne, Stephen J.; The Ice: A Journey to Antarctica. University of Washington Press, 1986. NOTE: Despite the title, Pyne has not published a travel journal here: instead he presents a well-researched study of Antarctica's exploration, earth-sciences, icescape, esthetics, literature, and geopolitics.
  2. "Unique ice pier provides harbor for ships," Antarctic Sun. January 8, 2006; McMurdo Station, Antarctica.

ఇతర పఠనాలు

  • Gille, Sarah T. 2002. "Warming of the Southern Ocean since the 1950s": abstract, article. Science: vol. 295 (no. 5558), pp. 1275-1277.
  • Descriptive Regional Oceanography, P. Tchernia, Pergamon Press, 1980.
  • Matthias Tomczak and J. Stuart Godfrey. 2003. Regional Oceanography: an Introduction. (see the site)

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.