దక్షిణ అమెరికా
దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది. ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు మద్య ఒక ఆకు వలె కనిపించును. ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు. దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.

| విస్తీర్ణం | 17,840,000 చ.కి.మీ |
|---|---|
| జనాభా | 382,000,000 |
| జనసాంద్రత | 21.4 / చ.కి.మీ. |
| దేశాలు | 12 |
| ఆధారితాలు | 3 |
| ప్రాదేశికత | సౌత్ అమెరికన్ |
| భాషలు | స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి. |
| టైమ్ జోన్ | UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్) |
| పెద్ద నగరాలు | సావోపాలో బ్యూనస్ ఎయిర్స్ రియో డి జనీరో బొగాటా లీమా శాంటియాగో కారకస్ |
భౌగోళికం

ఉనికి
దక్షిణ అమెరికా త్రిభిజాకారముగా ఉంది.దీని ఉత్తర ంహాగము విశాలముగా ఉండి, దక్షిణమునకు పోవుకొద్ది సన్నబడుతుంది.ఈ ఖండము ప్రపంచ పటములో ఒక ఆకు వలె కనిపిస్తుంది.దక్షిణ అమెరికా ఒక పొడవైన నది, ఒక పొడవైన దేశము కలిగిన ఖండము.
వాతావరణం
'దక్షిణ అమెరికా'లో చాలావరకు భౌతికరూపమును అనుసరించి ఉంది.ఈ ప్రాంతంలో చాలా భాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది (Rain follows the sun). ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరప్రాంతంలో ఉన్నపుడు ఉత్తరప్రాంతంలోనూ, దక్షిణంలో ఉన్నపుడు దక్షిణా ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. 'దక్షిణ అమెరికా'లోని 'దక్షిణ పెరు, ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి ఉంది. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి ఉన్నాయి. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండిన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.
అడవులు జంతువులు
'దక్షిణ అమెరికా'లో చాలాభాగం అడవులతో నిండి ఉంది. అమెజాన్ ప్రాంతంలో గల అడవులను భూమండల ఊపిరితిత్తులు అంటారు.అమెజాన్ ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' వివిధ రకాలైన జంతువులకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' రకరకాలైన పక్షులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో సరీసృపాలలో కొండచిలువ పాములు ముఖ్యమయినవి. పూమ, లామ ముఖ్యమయినవ జంతువులు.Subramanyam parinam (చర్చ) 14:29, 2016 జూన్ 23 (UTC)
జనాభా
దక్షిణ అమెరికా సుమారు 42 కోట్లు ఉండవచ్చును.జనసాంద్రత కిలోమీటరుకు సుమారు 22.జనాభా విస్తరణలో సమతుల్య లేదు.అమెజాన్ నది పల్లపు ప్రాంతాలు, గయాన మెట్ట భుములు, అటకామ, పెటగోనియా ఎడారులలో జనసాంద్రత అత్యల్పము.దక్షిణ అమెరికా తీర ప్రాంతములలో జనసాంద్రత అధికము.జనాభా చాలవరకు రేవు పట్టణములు, రాజధాని నగరములలో నివసిస్తున్నారు.
వ్యవసాయం
దక్షిణ అమెరికా'లో ప్రధాన పంటలు మొక్క జొన్న, గోధుమ, కాఫీ, చెరుకు, ప్రత్తి.మొక్క జొన్న, గోధుమ దక్షిణ అమెరికా'లో ప్రధాన ఆహార పంటలు.బ్రెజిల్, అర్జెంటీనాలు మొక్క జొన్న ప్రధాన ఉత్పత్తి కేం ద్రాలు.కాఫీ, చెరుకు ఇక్కడి ప్రధాన వాణిజ్య పంటలు.ప్రపంచ కాఫి ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రముఖ స్థానములో ఉంది.
ఖనిజాలు
పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, నైట్రేట్ వంటి ఖనిజాలు దక్షిణ అమెరికాలో ఎక్కువగా లభిస్తాయి. దక్షిణ అమెరికాలో జరుగు రాగి ఉత్పత్తి ప్రపంచ రాగి ఉత్పత్తిలో ఐదవ వంతుగా ఉత్పత్తి అవుతోంది.ప్రపంచ తగరము ఉత్పత్తిలో బొలివియా రెండవ స్థానములో ఉంది.ప్రపంచంలో గల ఖనిజతైల ఉత్పత్తులలో ఏడవ వంతు దక్షిణ అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది.
పరిశ్రమలు
దక్షిణ అమెరికాలో ఇనుము-ఉక్కు, నూలు వస్త్ర, పంచధార, మాంస సంబంధమైన పరిశ్రమలు, నూనెశుద్ధి, రాగి కరిగించు పరిశ్రమలు ముఖ్యమయిన పరిశ్రమలు.అర్జెంటైనా ప్రపంచంలో ఎక్కువగా మాంసం ఉత్పత్తులు చేస్తున్నది.వెనుజులాలో నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
వాణిజ్యము
ఎగుమతులు:కాఫీ, ప్రత్తి,, ముడి ఇనుము, కలప, పంచదార, ఉన్ని దిగుమతులు:యంత్రములు, మోటారు వాహనాలు, రసాయన పదార్దాలు, నేల బొగ్గు ముఖ్యమయినవి.
దేశాలు
| Flag | Arms | దేశం పేరు | విస్తీర్ణం | జనాభా (2016 est.) [1] |
జన సాంద్రత per km2 (per sq mi) |
రాజధాని |
|---|---|---|---|---|---|---|
| అర్జెంటీనా | 2,766,890 kమీ2 (1,068,300 sq mi) | 43,847,430 | 14.3/km² (37/sq mi) | బ్యూనస్ ఎయిర్స్ | ||
| బొలివియా | 1,098,580 kమీ2 (424,160 sq mi) | 10,887,882 | 8.4/km² (21.8/sq mi) | లా పెజ్ | ||
| బ్రెజిల్ | 8,514,877 kమీ2 (3,287,612 sq mi) | 207,652,865 | 22.0/km² (57/sq mi) | బ్రెసిలియ | ||
| చిలీ[2] | 756,950 kమీ2 (292,260 sq mi) | 17,909,754 | 22/km² (57/sq mi) | సాంటియాగో | ||
| కొలంబియా | 1,141,748 kమీ2 (440,831 sq mi) | 48,653,419 | 40/km² (103.6/sq mi) | బోగోటా | ||
| ఈక్వడార్ | 283,560 kమీ2 (109,480 sq mi) | 16,385,068 | 53.8/km² (139.3/sq mi) | క్వీటొ | ||
| ఫాల్క్లాండ్ దీవులు (United Kingdom) [3] | 12,173 kమీ2 (4,700 sq mi) | 2,910 | 0.26/km² (0.7/sq mi) | స్టాన్లీ | ||
| ఫ్రెంచ్ గయనా (France) | 91,000 kమీ2 (35,000 sq mi) | 275,713 | 2.7/km² (5.4/sq mi) | కేయేన్ (Préfecture) | ||
| గయానా | 214,999 kమీ2 (83,012 sq mi) | 773,303 | 3.5/km² (9.1/sq mi) | జార్జ్ టౌన్ | ||
| పరాగ్వే | 406,750 kమీ2 (157,050 sq mi) | 6,725,308 | 15.6/km² (40.4/sq mi) | అసూన్సియోన్ | ||
| పెరూ | 1,285,220 kమీ2 (496,230 sq mi) | 31,773,839 | 22/km² (57/sq mi) | లిమా | ||
| దక్షిణ జార్జియా మరియు దక్షిణ సాండ్విచ్ దీవులు (United Kingdom) [4] | 3,093 kమీ2 (1,194 sq mi) | 20 | 0/km² (0/sq mi) | ఎడ్వర్డ్ పాయింట్ | ||
| సురినామ్ | 163,270 kమీ2 (63,040 sq mi) | 558,368 | 3/km² (7.8/sq mi) | పెరమారిబొ | ||
| ఉరుగ్వే | 176,220 kమీ2 (68,040 sq mi) | 3,444,006 | 19.4/km² (50.2/sq mi) | మోంటేవీడియో | ||
| వెనుజులా | 916,445 kమీ2 (353,841 sq mi) | 31,568,179 | 30.2/km² (72/sq mi) | కారకాస్ | ||
| Total | 17 | 420,458,044 | 21.5/km² | |||
ఇవీ చూడండి
వనరులు
- "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
- Includes Easter Island in the Pacific Ocean, a Chilean territory frequently reckoned in Oceania. Santiago is the administrative capital of Chile; Valparaíso is the site of legislative meetings.
- Claimed by Argentina.
- Claimed by Argentina; the South Georgia and the South Sandwich Islands in the South Atlantic Ocean are commonly associated with Antarctica (due to proximity) and have no permanent population, only hosting a periodic contingent of about 100 researchers and visitors.

