త్రివర్ణ పతాకం

మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయ పతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.

Indian National Flag
Flag ratio: 2:3

మరిన్ని వివరాలకు భారత జాతీయపతాకం చూడండి.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.