త్రిపుర
త్రిపుర (బెంగాళీ: ত্রিপুরা) ఈశాన్య భారత దేశము లోని రాష్ట్రము. రాష్ట్ర రాజధాని అగర్తల మరియు ఇక్కడ మాట్లాడే ప్రధాన భాషలు బెంగాళీ మరియు కోక్‌బరోక్.
| త్రిపుర | |
![]() Map of India with the location of త్రిపుర highlighted. | |
| రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
అగర్తల - |
| పెద్ద నగరము | అగర్తల |
| జనాభా (2001) - జనసాంద్రత |
3,191,168 (21వది) - 304/చ.కి.మీ |
| విస్తీర్ణము - జిల్లాలు |
10,492 చ.కి.మీ (26వది) - 4 |
| సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
| అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1972-01-21 - డి.ఎన్. సహాయ్ - మానిక్ సర్కార్ - ఒకే సభ (60) |
| అధికార బాష (లు) | బెంగాళీ, కోక్‌బరోక్ |
| పొడిపదం (ISO) | IN-TR |
| వెబ్‌సైటు: tripura.nic.in | |
త్రిపుర రాజముద్ర | |
చరిత్ర

త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యముగా ఉండేది. 1949 లో భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యము యొక్క రాజధాని దక్షిణ త్రిపురలో గోమతీ నది తీరమున రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉంది. రాజధానిని తొలుత పాత అగర్తలకు ఆ తర్వాత 19వ శతాబ్దములో ప్రస్తుత అగర్తలకు తరలించబడింది. రాచరిక పరిపాలనకు వ్యతిరేకముగా గణముక్తి పరిషద్ ఉద్యమము ప్రారంభమైనది. ఈ ఉద్యమము యొక్క విజయానికి ఫలితముగా త్రిపుర భారత దేశములో విలీనమైనది. దేశ విభజన తీవ్ర ప్రభావము చూపిన ప్రాంతములలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రములో ఇప్పుడు బెంగాళీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయము పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనము సాగిస్తున్నారు.
జిల్లాలు
| సంఖ్య | రాష్ట్రము. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
|---|---|---|---|---|---|---|---|
| 1 | TR | DH | దలై | అంబస్స | 307417 | 2523 | 122 |
| 2 | TR | NT | ఉత్తర త్రిపుర | కైలాసహర్ | 590655 | 2821 | 209 |
| 3 | TR | ST | దక్షిణ త్రిపుర | ఉదయపూర్ | 762565 | 2152 | 354 |
| 4 | TR | WT | పశ్చిమ త్రిపుర | అగర్తల | 1530531 | 2997 | 511 |
రాజకీయాలు
త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతము మానిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా వామపక్ష కూటమి పరిపాలించుచున్నది. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రేసు పార్టీ పరిపాలించింది. 1978 నుండి 1988 వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి 1993లో అధికారములోకి వచ్చింది. 1988 నుండి 1993 వరకు భారత జాతీయ కాంగ్రేసు మరియు త్రిపుర ఉపజాతి యుబ సమితి యొక్క సంకీర్ణ ప్రభుత్వము పాలించింది.
1970 దశాబ్దము చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతున్నది
