తోట్లవల్లూరు

తోట్లవల్లూరు (నార్త్ వల్లూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 521

తోట్లవల్లూరు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో తోట్లవల్లూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో తోట్లవల్లూరు మండలం యొక్క స్థానము
తోట్లవల్లూరు
ఆంధ్రప్రదేశ్ పటములో తోట్లవల్లూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.355062°N 80.774117°E / 16.355062; 80.774117
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము నార్త్ వల్లూరు
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 39,685
 - పురుషులు 19,886
 - స్త్రీలు 19,799
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.56%
 - పురుషులు 68.11%
 - స్త్రీలు 58.98%
పిన్ కోడ్ 521163

163., ఎస్.టి.డి. కోడ్ = 0866.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టంమీద 11 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

ఈ గ్రామం విజయవాడ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

వుయ్యూరు, కంకిపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 28 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, గ్రామానికి చెందిన శ్రీ ఓరుగంటి సుబ్బారావు దంపతులు, ప్రోత్సాహక నగదు బహుమతులు అందించుచున్నారు. [6]
  2. ఎస్.సి.బాలుర వసతి గృహం.
  3. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కలాసమాలపల్లి.
  4. శాఖా గ్రంథాలయం.

గ్రామంలోని మౌలిక సౌకర్యాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఈ కేంద్రంలో ఆయుర్వేద ఆసుపత్రి గూడా ఉంది.

బ్యాంకులు

  1. యుకో బ్యాంక్. ఫోన్ నం. 0866/2804245.
  2. సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం. 0866/2804145., సెల్= 8886644182.
  3. కార్పొరేషన్ బ్యాంక్. ఫోన్ నం. 0866/2804411.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి చిరుమామిళ్ళ ఉమాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా చిరుమామిళ్ళ మోహన్ మంజు ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నేలలో) తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [2]

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ చెన్నమల్లికార్జునస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 2015,డిసెంబరు-26వ తేదీ శనివారంనాడు శివ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుఝామున 5 గంటలనుండియే ఉత్తరద్వారంగుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని భృంగీ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. [8]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఒక వారంరోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [9]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, స్వామివారి కల్యానం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా నాగేంద్రస్వామి పుట్ట వద్ద, జంట నాగ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [10]

శ్రీ విజయదత్త షిర్డీ సాయిబాబా ఆలయం

ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం 2017,మార్చి-20వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం నుండి సోమవారం వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం సాయిబాబా గారికి పల్లకీసేవ నిర్వహించారు. [11]

శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండరామాలయం

తోట్లవల్లూరు గ్రామంలోని నాయుడుపేటలో నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2015,మే నెల-5వ తేదీ మంగళవారంనాడు, విగ్రహాలకు గ్రామోత్సవం నిరవించారు. ఆరవతేదీ బుధవారం ఉదయం 9-48 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా బంధుమిత్రుల రాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసారు. [3]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

తోట్లవల్లూరు శివారులోని కలాసమాలపల్లిలో, 2017,మార్చి-5వతేదీ ఆదివారంనాడు, గంగానమ్మ తల్లి, పోతురాజు, బొడ్డురాయి, నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత విగ్రహాల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. [10]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

ఈ గ్రామములో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ జంపనవారి ఆలయంలో అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం 2017,మార్చి-18వతేదీ శనివారంనాడు కన్నులపండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో ఉంటున్న జంపన, నక్కా వంశీయులు ఆలయానికి తరలివచ్చి, అమ్మవారిని దర్శించుక్న్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [11]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామములోని లయన్స్ క్లబ్ ఆఫ్ తోట్లవల్లూరు, దాతత సహకారంతో, 2012,డిసెంబరు-14వ తేదీనాడు ప్రారంభించిన నిత్యాన్న పథకం, 3 సంవత్సరాలుగా, నిత్యాన్న పథకాన్ని కొనసాగుచున్నది. స్థానిక లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ వీరంకి గురుమూర్తి, ఈ పథకానికి పునాది వేసినారు. అప్పటినుండి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మొత్తం 65 మందికి లయన్స్ క్లబ్ ఆవరణలో, మద్యాహ్నం ఒకపూట ఉచిత భోజనం పెడుచున్నారు. అంతే కాక వల్లూరుపాలెం-15, భద్రిరాజుపాలెం-12, తోట్లవల్లూరు-8, క్యారేజీలు పంపించుచున్నారు. ఈ పథకం ప్రారంభించి, 2015,సెప్టెంబరు-10వ తేదీనాటికి 1000 దినాలు పూర్తి అయినది. [5]&[7] తోట్లవల్లూరు మండలంలో ఇప్పటి వరకు దీపం పథకంలో భాగంగా, 2400 గ్యాస్ కనెక్షన్లను లబ్దిదారులకు రాయితీపై అందజేసినారు. ఈ సందర్భంగా, కృష్ణా జిల్లా కలెక్టరు శ్రీ లక్ష్మీకాంతం, 2017,మే-29న నిర్వహించిన వీడియో కాన్‌ఫరెన్స్‌లో, తోట్లవల్లూరు మండలాన్ని పొగరహిత మండలంగా ప్రకటించినారు. [12]

మండలములోని గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.బొడ్డపాడు4571,577786791
2.చాగంటిపాడు8202,8171,4131,404
3.చినపులిపాక3071,040533507
4.దేవరపల్లి8783,0441,4981,546
5.గరికపర్రు8913,1491,5591,590
6.గురివిందపల్లి226830420410
7.ఈలూరు3821,485740745
8.కనకవల్లి206759384375
9.కుమ్మమూరు3401,256620636
10.మధురాపురం14482523
11.ములకలపల్లి132421198223
12.నార్త్ వల్లూరు1,9357,2593,6753,584
13.పెనమకూరు6742,4401,2331,207
14.రొయ్యూరు6622,4181,2341,184
15.సౌత్ వల్లూరు2,3078,9784,4854,493
16.యాకమూరు5602,1641,0831,081

గణాంకాలు

జనాభా (2001 -మొత్తం 39685, -పుల్రుషులు 19886 -స్త్య్రీలు 19799

వనరులు

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2014,మే-8; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-7; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-17; 24వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-10; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-8; 24వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-14; 23వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-27; 27వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చి-3; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చి-6; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-21; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మే-30; 2వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.