తేరళందూర్

తేరళందూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తేరళందూర్
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆమరువియప్పన్
ప్రధాన దేవత:శెంగమలవల్లి తాయార్
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:దర్శన పుష్కరిణి
విమానం:గరుడ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్లు
ప్రత్యక్షం:కావేరికిని, యమధర్మరాజునకు, వసుమహారాజునకు

విశేషం

పెరుమాళ్లకు కుడివైపున గరుడాళ్వారు ఎడమవైపున ప్రహ్లాదాళ్వారు వేంచేసియున్నారు. ఇచ్చట కోవెల వీధిలో శ్రీ రజ్గనాథుల సన్నిధి, గోవిందరాజస్వామి సన్నిధి వేరుగా ఉన్నాయి. వృషభ మాసం హస్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. కంబ మహాకవి పుట్టిన ప్రదేశము.

మార్గం

మాయవరం నుండి టౌన్ బస్ ఉంది. కుంభకోణం-మాయవరం-తంజావూరు-మాయవరం-బస్ ఉంది. అహోబిల మఠం ఉంది.

సాహిత్యం

శ్లో. దివ్యే దర్శన పద్మినీ తటగతే శ్రీ మత్యళందూర్ పురే
  రాజ త్యామరువి ప్రభు ర్గరుడ ఇత్యాఖ్యే విమానే స్థిత: |
  ప్రాప్త శ్శెంగమలోప పూర్వలతికాం ప్రాచీముఖ స్సహ్యజా
  ధర్మ శ్రీ వసురాజ సేవిత వపు శ్శ్రీమత్కలిఘ్న స్తుత: ||

పాశురం

  తిరువుక్కున్దిరువాగియ శెల్వా దెయ్‌వత్తుక్కరశే శెయ్యకణ్ణా;
  ఉరువచెఇజడరాழி వల్లనే యులగుణ్ణ వొరువా తిరుమార్బా;
  ఒరువఱ్కాత్తియుయమ్‌ వగై యెన్ఱాలుడనిన్ఱైవ రెన్నుళ్ పుగన్దు;ఒழிయా
  తరువిత్తిన్ఱిడ అఇజ నిన్నడై న్దేన్ అళున్దూర్ మేల్‌త్తిశై నిన్ఱ వమ్మానర్.
  తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 7-7

వివరం

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆమరువియప్పన్ శెంగమలవల్లి తాయార్ దర్శన పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్లు గరుడ విమానము కావేరికిని, యమధర్మరాజునకు, వసుమహారాజునకు

ముముక్షువు తెలుసుకోవలసినవి

స్వస్వరూపము భగవచ్చేషత్వము
పరస్వరూపము సర్వశేషిత్వము
ఉపాయ స్వరూపము భగవత్ కృప
ఉపేయ స్వరూపము భగవత్ కైంకర్యము
విరోధ స్వరూపము అవిద్య కర్మప్రకృతి సంబంధములు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.