తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు.[1] అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.
| తెలుగుదేశం పార్టీ | |
|---|---|
| నాయకుడు | చంద్రబాబు నాయుడు |
| వ్యవస్తాపకుడు | నందమూరి తారక రామారావు |
| పార్లమెంటరీ పార్టీ నేత | సుజనా చౌదరి |
| లోక్‌సభలో పార్టీ నేత | తోట నరసింహం |
| రాజ్యసభలో పార్టీ నేత | యలమంచిలి సుజనా చౌదరి |
| స్థాపన | మార్చి 29, 1982 |
| ప్రధాన కార్యాలయం | రోడ్డు నంబరు.2, బంజారా హిల్స్, హైదరాబాదు-500033 |
| రంగు | పసుపు |
| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 102 / 175 |
| తెలంగాణ | 2 / 119 |
| లోక్ సభ | 16 / 545 |
| రాజ్య సభ | 6 / 245 |
| ఓటు గుర్తు | |
![]() | |
| వెబ్ సిటు | |
| http://www.telugudesamparty.org/ | |
| జెండా | |
13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

నందమూరి తారక రామారావు
నందమూరి తారక రామారావు శకం
నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.
వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం NTRకు మాత్రమే చెల్లింది.
1988లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.
1988 మరియు 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి మరియు రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు.
1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు రెండవసారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి revenue మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుకు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్.టీ రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది.
చంద్రబాబు నాయుడి శకం

చంద్రబాబు నాయుడు
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం" (4 సం" రామారావు గారిని ప్రజలు ఎన్నుకున్నది + 5 సం" చంద్రబాబుని ప్రజలు ఎన్నుకున్నది ) చరిత్ర సృష్టించాడు.1996లో రామారావు మరణమునకు పిదప ఆయన భార్య లక్ష్మీ పార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్థులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మఱల చీల్చింది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది.
చంద్రబాబు నాయుడు హైదరాబాదును మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.
ఎన్నికల చరిత్ర
శాసన సభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్
| సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతము | ఫలితం |
|---|---|---|---|---|
| 1983 | 7వ శాసనసభ | 202 / 294 |
54.03% | విజేత |
| 1985 | 8వ శాసనసభ | 202 / 294 |
46.21% | విజేత |
| 1989 | 9వ శాసనసభ | 74 / 294 |
36.54% | ఓటమి |
| 1994 | 10వ శాసనసభ | 216 / 294 |
44.14% | విజేత |
| 1999 | 11వ శాసనసభ | 180 / 294 |
61.22% | విజేత |
| 2004 | 12వ శాసనసభ | 47 / 294 |
37.59% | ఓటమి |
| 2009 | 13వ శాసనసభ | 92 / 294 |
28.12% | ఓటమి |
| 2014 | 14వ శాసనసభ | 102 / 175 |
45% | విజేత |
తెలంగాణా
| సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతము | ఫలితం | గమనిక |
|---|---|---|---|---|---|
| 2014 | 1వ శాసనసభ | 20 / 119 |
21.77 | ఓటమి | బిజెపితొ పొత్తు (తె.దా.పా 15 సీట్లు, బిజెపి 5 సీట్లు) |
లోక్ సభ ఎన్నికలు
| సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు |
|---|---|---|
| 1984 | 8వ లోక్ సభ | 30 |
| 1989 | 9వ లోక్ సభ | 2 |
| 1991 | 10వ లోక్ సభ | 13 |
| 1996 | 11వ లోక్ సభ | 16 |
| 1998 | 12వ లోక్ సభ | 12 |
| 1999 | 13వ లోక్ సభ | 29 |
| 2004 | 14వ లోక్ సభ | 5 |
| 2009 | 15వ లోక్ సభ | 6 |
| 2014 | 16వ లోక్ సభ | 16 |
తెలుగు యువత
తెలుగు యువత అనగా తెలుగుదేశం పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తుంది. పార్టీ తరపున జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యమయి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీకి నామినేటేడ్ పదవులు ఉన్నట్లుగానే తెలుగు యువతకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధి, సభ్యులనే నామినేటేడ్ పదవులు ఉంటాయి. తెలంగాణకు ఒప్పుకోలేక సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండలేక తెలంగాణలో పార్టీ ఖాలీ అయ్యింది.
ప్రచురణలు
పుస్తకాలు
వీడియోలు
యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్లో [2] తెలుగు దేశం నాయకుల ప్రసంగాలు దృశ్యశ్రవణ మాధ్యమంగా లభిస్తున్నాయి.
ప్రచారం, సిద్ధాంతాలు
మూలాలు, వనరులు
- తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : వివరాలు జులై 19, 2008న సేకరించబడినది.
- యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్
ఇవికూడా చూడండి
- ఒక చరిత్ర కొన్ని నిజాలు - తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంపై ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన గ్రంథం.
- భారతదేశ రాజకీయ పార్టీల జాబితా
- భారత రాజకీయాలు
- నందమూరి తారక రామారావు
- చంద్రబాబు నాయుడు
- బాలకృష్ణ
- లక్ష్మీ పార్వతి
