తులసి నాయర్

తులసి నాయర్, భారతీయ సినీ నటి. ఆమె తమిళ సినిమాల్లో నటించింది. 2013లో మణిరత్నం దర్శకత్వంలో కడలి సినిమాతో తెరంగేట్రం చేసింది తులసి. ఆ తరువాత రవి కె.చంద్రన్ దర్శకత్వంలో యాన్ (2014) సినిమాలో నటించింది.

తులసి నాయర్
60వ దక్షిణాది ఫిలింఫెర్ అవార్డ్స్ వెదుకలో తులసి నాయర్
జననం 20 అక్టోబరు 1997
వృత్తి నటి, మొడల్
క్రియాశీలక సంవత్సరాలు 2013-2014
తల్లిదండ్రులు రాధ
బంధువులు కార్తికా నాయర్(సోదరి)

కెరీర్

తన 14వ ఏట తులసి మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 2011 నవంబరు లో సుహాసిని సిఫార్సుపై తులసిని ఎంచుకున్నాడు మణి రత్నం.[1] ఈ పాత్రకు ఆమె చిన్నది అవుతుందన్న కారణంతో మొదట మణి  రత్నం ఆమెను తిరస్కరించారు. కానీ ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడంతో సహాసినీ సిఫార్సుపై తులసిని తిరిగి తీసుకున్నాడు మణి.[2]  ఈ సినిమా కథానాయకుడు గౌతం కార్తిక్, తులసిలకు మొదటి సినిమా. నిజానికి 32 ఏళ్ళ క్రితం గౌతం తండ్రి కార్తిక్, తులసి తల్లి రాధ హీరో  హీరోయిన్లుగా కలసి తమ మొదటి సినిమాలో నటించడం విశేషం. 

నటించిన చిత్రాలు

సంవత్సరంచలన చిత్రంపాత్రభాషగమనికలు
2013కడల్బేత్రికాతమిళముకడలి గా తెలుగులోకి

అనువదించబదినది

2014యాన్స్రీలాతమిళంరంగం 2 గా తెలుగులొకి

అనువదించబదినది

మూలాలు

  1. V. Lakshmi (14 November 2011). Mani's search continues…. The Times of India. URL accessed on 14 August 2014.
  2. If not for Mani Ratnam, I wouldn't be in films: Thulasi. The Times of India. (29 September 2012). URL accessed on 14 August 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.